For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెష్ క్యాబేజ్ జ్యూస్ తాగడం వల్ల 8 బెనిఫిట్స్ పొందవచ్చు..!!

|

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో క్యాబేజ్ ఒకటి. ఇది క్రూసిఫెరస్ కుటుంబానికి చెందినది. క్యాబేజ్ లో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు ఐయోడిన్ అనే మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో విటమిన్ కె, ఇ, సి, బి6 మరియు బి1 ఉన్నాయి. ఇవన్నీ కొన్ని రకాల క్యాన్సర్స్ ను నివారించడంలో మరియు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఇంకా రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది . శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది . రక్తములో చెక్కెర స్థాయిని అదుపు చేసేందుకు గ్లూకోజ్ టోలరెన్స్ (glucose tolarence) లో భాగమైన ' క్రోమియం ' ఈ లెట్యూస్ లో పుష్కలముగా ఉంటుంది . నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది . ఇంకా క్యాబేజీలో విటమిన్స్ , ఐరన్ మరియు పొటాషియం మరియు తక్కువ క్యాలరీలు కలిగి ఉండటం వల్ల క్యాబేజ్ ను ఇటు సౌత్ అటు నార్త్ రెండు ప్రదేశాలలోనూ దీని వినియోగం ఎక్కువ.

క్యాబేజ్ ను కేవలం ఉడికించి సలాడ్ రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటారు . జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. క్యాబేజ్ లో వివిధ రకాల విటమిన్స్ మరియు మినిరల్స్ ఉండటం వల్ల హెల్తీ సిస్టమ్ మరియు అందమైన చర్మసౌందర్యాన్ని పొందవచ్చు .

క్యాబేజ్ జ్యూస్ లో న్యూట్రీషియన్స్ తో పాటు యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ అధికంగా ఉండటం వల్ల ఇటు ఆరోగ్యాన్ని, అటు అందాన్ని మెరుగుపరుస్తాయి. శరీరంలోని హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడుటకు మరియు అందమైన చర్మం పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

క్యాబేజ్ లో ల్యాక్టిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కోలన్ కు నేచురల్ డిస్ ఇన్ ఫెక్ట్ గా పనిచేస్తుంది . మరియు ఇది ఒక గ్రేట్ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ . ఇది ఆర్థరైటిస్ ను మరియు డీజనరేటివ్ డిసీజ్ ను నివారిస్తుంది . జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంను శుభ్రపరుస్తుంది. అల్సర్ కు చక్కటి చికిత్సగా పనిచేస్తుంది . క్యాబేజ్ జ్యూస్ లో ఇంతే కాదు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . మరి అవేంటో తెలుసుకుందాం...

బెనిఫిట్ # 1:

బెనిఫిట్ # 1:

క్యాబేజ్ జ్యూస్ లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ కోలన్ కు ఇన్ఫెక్షన్ కాకుండా నివారిస్తుంది. కోలన్ హెల్తీగా ఉంచుతుంది. అందువల్ల క్యాబేజ్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.క్యాబేజ్ జ్యూస్ అక్యూట్ అల్సర్ ను నివారిస్తుంది . ఇది సెస్కి అల్సర్ ను నివారించి ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను డిటాక్సిఫైడ చేయడంతో పాటు పొట్టలోపల ఇన్నర్ లేయర్ ను స్మూత్ గా చేస్తుంది. దాంతో అల్సర్ నివారించబడుతుంది.

బెనిఫిట్ # 2:

బెనిఫిట్ # 2:

క్యాబేజ్ జ్యూస్ లో ఉండే కొన్ని అంశాలు బ్రొంకైటిస్ మరియు ఆస్థమా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. రెడ్ క్యాబేజ్ క్యాబేజిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల, శరీరంలో వ్యాధినిరోధక శక్తి ని పెంపొందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని వ్యవస్థను బలోపేతంలో సహాయపడటమే కాదు ఫ్రీరాడికల్స్ ను నుండి సహాయపడతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బెనిఫిట్ # 3:

బెనిఫిట్ # 3:

క్యాబేజ్ జ్యూస్ లో ఉండే గ్యూటమిన్ అనే అమినో యాసిడ్ డైజెస్టివ్ హెల్త్ కు ముఖ్యమైన పాత్రపోషిస్తుంది.

బెనిఫిట్ # 4:

బెనిఫిట్ # 4:

శరీరంలో వివిధ రకాల క్యాన్సర్లు డెవలప్ కాకుండా ప్రమాదాన్ని తగ్గిస్తుంది . క్యాబేజ్ లో ఉండే సల్ఫోరఫా కార్సినోజెన్స్ సెల్స్ డెవలప్ కాకుండా చేస్తుంది. క్యాబేజ్ లో ఉండే ఐసోసినేట్ లంగ్ , స్టొమక్, బ్రెస్ట్, మరియు కోలన్ క్యాన్సర్ డెవలప్ మెంట్ ను తగ్గిస్తుంది.

బెనిఫిట్ # 5:

బెనిఫిట్ # 5:

క్యాబేజ్ జ్యూస్ లో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆర్థరైటిస్, మజిల్ క్రాంప్స్ వంటి ఇన్ఫ్లమేటరీ సమస్యలను నివారిస్తాయి.తాజాక్యాబేజ్ జ్యూస్ లోని ల్యాక్టిక్ యాసిడ్ సోర్ మజిల్స్ నుండి చాలా ఎఫెక్టివ్ గా ఉపశమనం కలిగిస్తుంది.

బెనిఫిట్ # 6:

బెనిఫిట్ # 6:

గ్యాస్ట్రిక్ అల్సర్ ను నివారిస్తుంది.క్యాబేజ్ జ్యూస్ అక్యూట్ అల్సర్ ను నివారిస్తుంది . ఇది సెస్కి అల్సర్ ను నివారించి ప్రేగులను శుభ్రం చేస్తుంది. ప్రేగులను డిటాక్సిఫైడ చేయడంతో పాటు పొట్టలోపల ఇన్నర్ లేయర్ ను స్మూత్ గా చేస్తుంది. దాంతో అల్సర్ నివారించబడుతుంది.

బెనిఫిట్ # 7:

బెనిఫిట్ # 7:

హై కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: లివర్ ను డిటాక్సిఫై చేస్తుంది. హైకొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

బెనిఫిట్ # 8 :

బెనిఫిట్ # 8 :

వ్యాధినిరోధకత పెంచుతుంది. క్యాబేజ్ జ్యూస్ వ్యాధినిరోధకతను పెంచుతుంది . క్యాబేజ్ జ్యూస్ ను రెగ్యులర్ గా త్రాగేవారు, ఎక్కువ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటారని, ఎలాంటి జబ్బుల బారిన పడరని చెబుతుంటారు . క్యాబేజ్ జ్యూస్ లో ఉండే హిస్టిడైన్ అనే కంటెంట్ అలర్జీల నుండి కోల్కోవడానికి సహాయపడుతుంది.

English summary

What Happens If You Drink Cabbage Juice?

Cabbage juice is rich in minerals like sulfur, calcium, iron, magnesium and iodine. It also contains vitamins K, E, C, B6 and B1. It can prevent certain types of cancer and also control cholesterol levels.
Story first published:Wednesday, August 10, 2016, 14:24 [IST]
Desktop Bottom Promotion