ఒట్టి క్యారట్ జ్యూస్ కాకుండా.. వేప, తేనె కలిపి తాగండి..! ఆశ్చర్యపోతారు..!

By Swathi
Subscribe to Boldsky

ఈ కాలంలో చాలామంది చాలా త్వరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. హాస్పిటల్స్, మెడిసిన్స్ అంటూ.. ఎప్పుడూ మందులతో కాలం గడుపుతూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తుంటే.. మీరు ఖచ్చితంగా హోం రెమెడీస్ ని గుర్తించాలి. మీరు ఎప్పటికీ హెల్తీగా ఉండటానికి సహాయపడే అద్భుతమైన రెమెడీస్ ని ఫాలో అవ్వాలి.

What Happens When You Drink Carrot Juice With Neem And Honey

న్యాచురల్ రెమిడీస్ చాలా ఎఫెక్టివ్ గా, పవర్ ఫుల్ గా పనిచేస్తాయి. అనేక వ్యాధులు, అనారోగ్య సమస్యలను నివారించడంలో పాపులర్ అయ్యాయి. మన వంటిల్లు, గార్డెన్ లోనే అనేక ఔషధగుణాలున్న పదార్థాలు అందుబాటులో ఉన్నాయని అనేక అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంతేకాదు వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవట.

సాధారణంగా క్యారట్ జ్యూస్ లోని అద్భుత ప్రయోజనాలు వింటూనే ఉంటాం. అంతేకాదు క్యారట్ జ్యూస్ ని ప్రతిరోజూ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చని కూడా తెలుసుకున్నాం. అయితే క్యారట్ జ్యూస్ ని మరింత పవర్ ఫుల్ గా మార్చడానికి వేప, తేనె మిక్స్ చేయాలని నిపుణులు సూచిస్తారు. ఈ మూడింటి మిశ్రమం.. చాలా ఎఫెక్టివ్ గా 7 వ్యాధులను నివారిస్తుందట.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

క్యారట్ జ్యూస్ లో వేప, తేనె కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకున్న అదనపు ఫ్యాట్ సెల్స్ తొలగిపోతాయి. దీంతో మెటబాలిజం మెరుగుపుడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పేగులలో నులిపురుగులు

పేగులలో నులిపురుగులు

క్యారట్ జ్యూస్, వేప, తేనె మిశ్రమం పేగులలో పేరుకున్న హానికారక నులిపురుగులను నాశనం చేస్తుంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలను నివారించవచ్చు.

డయాబెటిస్

డయాబెటిస్

ఒక గ్లాసు ఈ డ్రింక్ ని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల డయాబెటిస్ సంకేతాలను తగ్గించుకోవచ్చు. అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని చాలా అద్భుతంగా తగ్గిస్తుంది.

వయసు పెరగడాన్ని

వయసు పెరగడాన్ని

ఈ హెర్బల్ డ్రింక్ లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కొత్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దీంతో ఏజింగ్ ప్రాసెస్ నెమ్మదిగా మారుతుంది.

కంటి ఆరోగ్యం

కంటి ఆరోగ్యం

ఈ డ్రింక్ ని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల.. కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ వల్ల కంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

క్యాన్సర్

క్యాన్సర్

ఈ హోంమేడ్ డ్రింక్ లో ఫైటో న్యూట్రియంట్స్ ఉండటం వల్ల.. క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి. దీంతో క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడవచ్చు.

హార్ట్ హెల్త్

హార్ట్ హెల్త్

ఈ న్యాచురల్ డ్రింక్ లో కెరోటనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హై బ్లడ్ ప్రెజర్ ని తగ్గిస్తాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    What Happens When You Drink Carrot Juice With Neem And Honey

    What Happens When You Drink Carrot Juice With Neem And Honey. Here is an amazing homemade drink that can treat over 7 disorders!
    Story first published: Thursday, December 15, 2016, 19:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more