For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తులసినీళ్లు, పసుపు మిశ్రమంతో శరీరానికి కలిగే అమేజింగ్ బెన్ఫిట్స్..!

By Swathi
|

తులసి ఆకులోని ఆధ్మాత్మిక ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు అమోఘమైనవి. ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలు.. దాని ద్వారా వచ్చే సువాసనే.. మనలో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. అంతటి గొప్ప ప్రయోజనాలున్న ఆ మొక్కను తింటే పొందే ప్రయోజనాలు చెప్పాల్సిన అవసరం లేదు.

అలాగే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు అందించే తులసి ఆకు రసంలో.. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్న పసుపు కలిపి తీసుకుంటే.. రకరకాల వ్యాధులను నయం చేయవచ్చు.

అంతేకాదు.. ఈ కాలంలో చాలామంది చాలా త్వరగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ప్రతిసారీ డాక్టర్ దగ్గరకు వెళ్లడం కూడా కష్టమైనపనే. కాబట్టి అనేక వ్యాధులను నిరోధించడానికి.. ఇంట్లోనే కొన్ని న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం అద్భుతమైన పరిష్కారం.

అలాంటి అమేజింగ్ సొల్యూషనే.. తులసి వాటర్ మరియు పసుపు. ఈ రెండింటి మిశ్రమం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం. ముందుగా కొన్ని నీటిని వేడిచేయాలి. కొన్ని తులసి ఆకులు, ఒక టీస్పూన్ పసుపు కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. ఈ డ్రింక్ ని.. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

దగ్గు

దగ్గు

తులసి, పసుపు మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల గొంతులో ఇన్ల్ఫమేషన్ తగ్గడమే కాకుండా.. దగ్గుకి కారణమయ్యే ఫ్లమ్ తొలగిపోతుంది.

ఆస్తమా

ఆస్తమా

ఈ హెల్త్ డ్రింక్ ఆస్తమా నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శ్వాసనాళంలో సమస్యలను తొలగించి.. శ్వాస సజావుగా సాగడానికి సహాయపడుతుంది.

కిడ్నీలు

కిడ్నీలు

ఈ హోంమేడ్ హెల్త్ డ్రింక్.. కిడ్నీల్లో మలినాలను బయటకు పంపిస్తుంది. దీనివల్ల కిడ్నీలు ఆరోగ్యంగా, క్లెన్స్డ్ గా ఉంటాయి.

ఒత్తిడి

ఒత్తిడి

ఈ న్యాచురల్ డ్రింక్ ని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల.. మెదడుకి రక్తప్రసరణ సజావుగా జరిగి.. ఒత్తిడి తగ్గుతుంది.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

ఈ డ్రింక్ ని ప్రతి రోజూ తాగడం వల్ల బోవెల్ మూమెంట్స్ మెరుగుపరిచి.. తీవ్రంగా ఇబ్బంది పెట్టే కాన్ట్సిపేషన్ లక్షణాలను తగ్గిస్తుంది.

ఎసిడిటీ

ఎసిడిటీ

ఈ హెల్త్ డ్రింక్ లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉండటం వల్ల.. పొట్టలో ఉపశమనం కలిగించి.. యాసిడ్ లెవెల్స్ ని న్యూట్రలైజ్ చేసి.. ఎసిడిటీని తగ్గిస్తుంది.

అల్సర్స్

అల్సర్స్

ఈ న్యాచురల్ డ్రింక్.. అల్సర్స్ ని.. తగ్గించే సత్తా ఉంటుంది. నోట్లో, పొట్టలో అల్సర్స్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

జీర్ణక్రియ

జీర్ణక్రియ

డైజెస్టివ్ జ్యూస్ లు ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా.. ఈ హోంమేడ్ హెల్త్ డ్రింక్.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

తలనొప్పి

తలనొప్పి

తులసి, పసుపు మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం తీసుకోవడం వల్ల.. సైనస్, ఒత్తిడికి సంబంధించిన తలనొప్పి తగ్గుతుంది.

అలర్జీలు

అలర్జీలు

ఈ న్యాచురల్ డ్రింక్.. రక్తాన్ని డెటాక్సిఫై చేయడం ద్వారా.. కొన్ని రకాల అలర్జీలను నివారిస్తుంది.

క్యాన్సర్ నివారించడానికి

క్యాన్సర్ నివారించడానికి

ఈ న్యాచురల్ హెల్త్ డ్రింక్ లో ప్రొస్టేట్ క్యాన్సర్ నిరోధించే సత్తా ఉంటుంది. అలాగే ఈ డ్రింక్ ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల.. అందులోని పవర్ ఫుల్ ఫైటో న్యూట్రియంట్స్ కారణంగా.. బ్రెస్ట్ క్యాన్సర్ ని కూడా.. అరికట్టడం సాధ్యం అవుతుంది.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

ఈ హోంమేడ్ హెల్త్ డ్రింక్ కొలెస్ట్రాల్ కరిగించే సత్తా కలిగి ఉంటుంది. శరీరంలో పేరుకున్న ఫ్యాట్ టిష్యూలన్ తేలికగా కరిగిస్తుంది.

English summary

What Happens When You Drink Tulsi Water With Turmeric Every Morning?

What Happens When You Drink Tulsi Water With Turmeric Every Morning? Did you know that the mixture of tulsi and turmeric come with a number of health benefits?
Story first published: Tuesday, September 27, 2016, 14:53 [IST]
Desktop Bottom Promotion