For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ గా పెరుగు తింటుంటే శరీరంలో జరిగే అద్భుత మార్పులేంటి...?

|

పెరుగు ప్రాచీన కాలంనుండి అద్భుతమైన పోషక విలువలతో మానవాళికి మంచి ఆహారంగా ఉపయోగపడుతోంది. పెరుగునే యోగ్రర్ట్ అని పిలుస్తారు. పెరుగు అంటే ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. ఎందుకంటే ఇది క్రీమీ టేస్ట్ ను కలిగి ఉంటుంది. అంతే కాు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అంతే కాదు మరీ ముఖ్యంగా పాల కంటే పెరుగు చాలా సులభంగా జీర్ణం అవుతుంది. ఇంకా పెరుగులో ప్రోటీన్స్ మరియు క్యాల్సియం కంటెంట్ అధికంగా ఉన్నాయి. పాలు పడనివారు, ఇష్టం లేనివారు, మరియు ల్యాక్టోజ్ ఇన్టాలరెన్స్ వల్ల సులభంగా జీర్ణించుకోలేని వారు పాలకు బదులుగా పెరుగును ఖచ్ఛితంగా తినాల్సి ఉంటుంది.

పెరుగులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి . కాబట్టి దీన్ని మన డైలీ, రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఈ ప్రయోజనాలు ఎముకలు, దంతాలు, బ్రెయిన్, స్టొమక్, మరియు ప్రేగుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది . మరియు మీరు ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆపానవాయువు సమస్యలను ఎదుర్కోరు.

పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్

పెరుగు తినడం వల్ల మన శరీరానికి అవసరం అయ్యేటటువంటి అన్ని రకాల న్యూట్రీషియన్స్ తో పాటు మంచి బ్యాక్టీరియా బాడీకి చేరుతాయి. అందువల్ల, పెరుగు వల్ల పొందే ఇన్ని ప్రయోజనాలను ఖచ్చితంగా మిస్ చేయకూడదు. వివిధ రకాలా ఫ్లేవర్స్ ఉన్న పెరుగు తినడం నివారించే ప్లెయిన్ గా ఇంట్లో తయారుచేసుకొనే హెల్తీ పెరుగును తినడం వల్ల మరిన్ని హెల్తీ, అమేజింగ్ బెనిఫిట్స్ ను పొందవచ్చు...

మరి డైలీ బెసిస్ లో రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల ఏం జరగుతుందో తెలుసుకుందాం....!

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది:

మీరు హై బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్నట్లైతే , అప్పుడు ఖచ్చితంగా మీ రెగ్యులర్ డైట్ లో పెరుగు ఉండాల్సిందే . ఎవరైతే రెగ్యులర్ గాపెరుగు తింటారో వారిలో హైబ్లడ్ ప్రెజర్ లక్షణాలు, కిడ్నీ మరియు హార్ట్ డిసీజ్ వంటి లక్షణాలు పెరగవని కొన్ని పరిశోధనల ద్వారా తేలింది. అందుకు పెరుగులో ఉండే పొటాషియమే అంటున్నారు.

మానసిక ఏకాగ్రత పెంచుకోవచ్చు:

మానసిక ఏకాగ్రత పెంచుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో స్ట్రాంగ్ బ్రెయిన్ మరియు మెంటల్ కాన్ సంట్రేషన్ మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది . ఇది పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా వల్లే ఇలా జరగుతుంది. రెగ్యులర్ గా పెరుగు తినే వారిలో మెమరీ పవర్ పెరుగుతుందని కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారణ అయింది.

 బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది :

బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది :

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు గ్యాస్ సమస్యలు నివారించబడి బెల్లీ ఫ్లాట్ గా మారుతుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా మరియు ఫ్యాట్ బర్నింగ్ లక్షణాలు బెల్లీ ఫ్యాట్ ను కరిగిస్తాయి. మరియు మలబద్దక సమస్యలను కూడా నివారిస్తుంది.

నడుము చుట్టుకొలత తగ్గించుకోవచ్చు:

నడుము చుట్టుకొలత తగ్గించుకోవచ్చు:

రెగ్యులర్ గా పెరుగు తినడం వల్ల మెటబాలిజం రేటు పెరిగి నడుము చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. అంటే కేవలం పెరుగు తినడం వల్ల ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు. అంతే కాదు పెరుగు రెగ్యులర్ గా తినడం వల్ల ఒత్తిడికి(ఇది నడుము చుట్టూ కొవ్వు చేరే) కారణం అయ్యే హార్మోనుల ఉత్పత్తిని తగ్గిస్తుంది.

ఆకలి కోరికలను నార్మల్ గా ఉంచుతుంది:

ఆకలి కోరికలను నార్మల్ గా ఉంచుతుంది:

రెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం వల్ల ఇతర ఆహారాల మీద కోరికలు కలగకుండా, ఆకలి కానివ్వకుండా...అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకుండా కంట్రోల్ చేస్తుంది . పెరుగు తినడం వల్ల పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది .

 సంతోషంగా ఉండవచ్చు:

సంతోషంగా ఉండవచ్చు:

పెరుగులో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నాడీవ్యవస్థకు చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకా ఇందులో ఉండే విటమిన్ బి12, విటమిన్స్ వెజిటేరియన్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. వీటిని చాలా వరకూ అనిమల్ ఫుడ్స్ లో ఎక్కువగా చూస్తుంటాము. విటమిన్ బి 12 ఒత్తిడి మరియు డిప్రెషన్ తగ్గించడానికి సహాయపడుతాయి.

ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు:

ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు:

ప్రతి రోజూ పెరుగు తింటుంటే దంతక్షయ సమస్యలుండవు . పాల వల్ల దంతక్షయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీటిలో ల్యాక్టోజ్ షుగర్స్ ఉండటం వల్ల పెరుగు దంతాలకు మరియు ఎముకలకు చాలా మేలు చేస్తుంది.

English summary

What Happens To Your Body When You Eat Curd

Curd, also known as yoghurt, is loved by many because of its creamy taste. Curd offers all the benefits of milk; but unlike milk, it is easy to digest and has more protein and calcium content in it. People who can't digest milk easily (due to lactose intolerance) must eat curd.
 
 
Story first published: Tuesday, January 19, 2016, 18:21 [IST]
Desktop Bottom Promotion