For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ మొలకలు తినడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు..

|

మొలకలు అన్నివిధాలా ఆరోగ్యానికి సోపానాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఇవి కొద్దిగా తిన్నా కడుపు నిండుతాయి. కేలరీలు పెరగవు. ఇంతకన్నా స్లిమ్‌గా వుండాలనే వారికి మరేం కావాలి? మొలకలు ఆరోగ్యకరమే! సమృద్ధిగా అత్యవసర పోషకాలు ఉన్నాయి. అందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి 1, విటమిన్ బి 6, విటమిన్ కె ఉన్నాయి. దీనితో బాటుగా ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాసియం, మాంగనీసు, కాల్షియం కూడా సమృద్ధిగా ఉన్నాయి. మొలకలలో పీచు, ఫోలేట్ మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. మొలకెత్తిన గింజలు, ధాన్యాలు, కాయ ధాన్యాలలో ఈ పోషకాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ఉదాహరణకు, మొలకెత్తిన తర్వాత గింజలు చాలావరకు విటమిన్ ఎ ఎనిమిది రెట్లు పెరుగుతుంది.

ఎంజైముల అద్భుతమైన మూలాలు: మొలకలలో మన శరీరానికి ఉపయోగమైన, ఆరోగ్యకర౦గా ఉంచే ఎంజైములు సమృద్ధిగా ఉన్నాయి. ఆహారాన్ని వండినప్పుడు వీటిలో కొన్ని ఎంజైములను నష్టపోతాము. అందువల్ల తాజా మొలకలను తిని శక్తివంతమైన ఎంజైములను పొందాలి. అధిక మాంసకృతులు: మొలకలలో మాంసకృతులు అత్యంత ఎక్కువ స్థాయిలో ఉన్నాయన్న వాస్తవం చాలామందికి తెలియదు. నిజానికి వీటిలో 35 శాతంవరకు మాంసకృతులు ఉంటాయి. మీ ఆహారానికి మొలకలు జోడించడం వలన మీ శరీరానికి అవసరమైన మాంసకృతులను అందించడమే కాక జంతువుల మాంసాల వలన వచ్చే కొవ్వును, కోలెస్టరాల్ను, క్యాలరీలను తగ్గిస్తుంది. ఎక్కువగా శాకాహారం ఇష్టపడే వారికి, శాకాహారులకు మొలకలు ఎంతగానో సిఫార్సు చేయబడ్డాయి. తేలికగా జీర్ణమౌతాయి: మొలకలలో మీరు ఇష్టపడే మరొక విషయం అవి ఎంతో తేలికగా జీర్ణమౌతాయి. మొలకలను తినడం జీర్ణసంబంధ, కడుపు ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. ఇవి పిల్లలకు, పెద్దలకు కూడా ఉత్తమమైనవి.

మొలకలు పూర్తి పోషణ యొక్క చౌకైన మరియు సులభమైన మూలం. పెసలు, శెనగ , శనగలు, బీన్స్ , ఎండిన బటానీలు దేశవ్యాప్తంగా ప్రజానీకానికి ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి . శతాబ్దాలుగా భారత సంప్రదాయ వంటలో ఒక భాగం మొలకలు . ఇన్ని పోషకాంశాలున్న ఈ మొలకల్లో ఉన్నఅద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు మీకోసం కొన్ని.....

జుట్టు పెరుగుదలకు:

జుట్టు పెరుగుదలకు:

మొలకలు,జుట్టు పెరుగుదలకు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పొడవుగా అందంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది ఫ్రీరాడికల్స్ నివారించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది పురుషుల్లో బట్టతల మరియు అలోపేసియా నివారిస్తుంది.

క్యాపిల్లర్స్ ను రిపేర్ చేస్తుంది , స్ట్రాంగ్ మార్చుతుంది:

క్యాపిల్లర్స్ ను రిపేర్ చేస్తుంది , స్ట్రాంగ్ మార్చుతుంది:

మొలకలు న్యూట్రీషియన్స్ క్యాపిల్లర్స్ ను రిపేర్ చేస్తుంది మరియు బలాన్నిఅందిస్తుంది. ఇంకా రక్తనాళాల్లో కొత్త రక్తకణాలు ఏర్పడేలా చేస్తుంది. దాంతో శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది.

విటమిన్స్ అధికంగా ఉన్నాయి.

విటమిన్స్ అధికంగా ఉన్నాయి.

మొలకెత్తిని విత్తనాల్లో వివిధ రకాల విటమిన్స్ ను పెంచుతుంది. ముఖ్యంగా విటమిన్స్ ఎ, బి కాంప్లెక్స్, సి, మరియు ఇ అధికంగా ఉన్నాయి. సహజ గింజలలో కంటే మొలకెత్తిన విత్తనాల్లో 20 సార్లు అసలు విలువలను పెంచే విటమిన్స్ గా కొన్ని పరిశోధనలు చూపించబడినాయి. బీన్స్ మొలకల్లో 285 విటమిన్ బి1 పెరిగేలా చేస్తుంది.

 బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

మొలకల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది శరీరంలో మెటబాలిజం రేటు పెంచుతుంది . శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి:

ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి:

మొలకల్లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా ఉండవు. అందువల్ల మొలకలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.

శరీరానికి ఆల్కలైజింగ్ నివారిస్తుంది:

శరీరానికి ఆల్కలైజింగ్ నివారిస్తుంది:

మొలకలను తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ఆల్కైజెస్ ను అందిస్తుంది. ఇవి శరీరానికి రక్షణ కల్పిస్తాయి. . ముఖ్యంగా ప్రాణాంత వ్యాధులైన క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి శరీరంలో అసిడిటిని నివారిస్తాయి .

 ఐరన్ పుష్కలంగా ఉంటుంది:

ఐరన్ పుష్కలంగా ఉంటుంది:

మన శరీరానికి అత్యవసరమైనటువంటి న్యూట్రీషియన్. ఇది మన శరీరంలోని రక్తంతో పాటు, ఆక్సిజన్ ను శరీరంలోని అన్ని బాగాలకు ప్రసరించేందుకు సహాయపడుతుంది. . మానవ శరీరంలో జీవక్రియల్నీ సరిగా పనిచేయడానికి సహాయపడుతుంది .

 యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ:

యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ:

మొలకల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . యాంటీఆక్సిడెంట్స్ జుట్టు, చర్మం, నెయిల్స్ మొదలగునవి ఆరోగ్యం పెరగడానికి సహాయపడుతుంది.

English summary

Why Sprouts Are Essential For Our Health

Due To Its High Nutritional Value, It Will Not Be Inappropriate If We Call Sprouts A Wonder Food. Thus The Importance Of Sprouts On Our Health Should Never Be Underestimated. To Those Who Are Not Very Familiar With Sprouts, Let Me Inform You That Sprouts Are Nothing But Germinated Seeds Of Certain Grains And Legumes.
Story first published: Wednesday, June 29, 2016, 13:28 [IST]
Desktop Bottom Promotion