మీరు తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ 10డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేయండి.

Posted By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

బరువు తగ్గడం అనేది మీరు అనుకుంటున్నంత సులభమేమి కాదండోయ్ దానికి చాలా పట్టుదల మరియు కృషి చేయాలి. అలాగని కష్టం కూడా కాదులెండి. దీనికోసం మీరు మీ రోజువారి జీవితంలో కొన్ని గంటల సమయం మరియు కాస్త శక్తి ని ఖర్చు చేస్తే సరిపోతుంది.

అంతేకాకుండా, దీనితోపాటు మీ రోజువారీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకోవడం వలన బరువు తగ్గాలనే మీ ఆలోచనని ఆచరణలో పెట్టినట్లయితే మిమల్ని మీరే నమ్మలేనటువంటి అద్భుతమైన మార్పులను చూడవచ్చు. దీనికోసం కేవలం రోజూ వ్యాయామం చేయడం లేదా కొవ్వు లేని ఆహారం తీసుకోవడం వలనో మీరు మీ బరువు ని కోల్పోవడం జరగదు. మీరు తీసుకునే ఆహరం ఆరోగ్యకరమైనదిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది మిమల్ని ఆరోగ్యంగా ఉండేలా చేసి అలాగే బరువు ను కోల్పోవడం లో కూడా మీకు సహాయపడుతుంది.

best detox juices for a fast weight loss

ఈమధ్య కాలంలో పళ్ళ రసాన్ని తీసుకొని బరువు తగ్గడం అనేది బాగా

ఆచరణలోకి వచ్చింది. పళ్ళ రసం బరువుని తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది మరియు మీ శరీరాన్ని డేటాక్సిఫై కూడా చేస్తుంది. కాబట్టి మీ రోజువారీ డైట్ లో కొన్ని పళ్లరసాలు మరియు కూరగాయల రసాన్ని జతచేయడం వలన మీరు కష్టపడకుండా సులభంగా, తొందరగా బరువు తగ్గవచ్చు.

ఇంకా మీరు ప్రతిరోజు ఈ రసాలను త్రాగడం వల్ల మెరుగైన జీర్ణక్రియ ప్రక్రియ ని పొంది, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండి, బ్లడ్ షుగర్ ని సరైన స్థాయిలో కలిగి వుంటారు. ఇది మీ చర్మ సౌదర్యాన్ని మెరుగుపరిచి మరియు అనుకున్న స్థాయిలో బరువు తగ్గుతారు.

తాజా పళ్లరసాలను తీసుకోవడం వలన ఖనిజాలు, విటమిన్లు మరియు అనామ్లజనకాలని మీ శరీరానికి అందించవచ్చు. తొందరగా బరువు తగ్గడానికి ఉపయోగపడే 10 బెస్ట్ నిర్విషీకరణ రసాల గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం. ఇవి కేవలం బరువుని తగ్గించడమే కాకుండా మీ శరీరానికి ఇతర ఆరోగ్య ప్రయోజనాలని కూడా అందిస్తాయి.

1. దోసకాయ సెలీరీ జ్యూస్

1. దోసకాయ సెలీరీ జ్యూస్

బరువు తగ్గడంతో ఒక బాలన్సుడ్ డైట్ తో పాటుగా తాజా సెలెరీ మరియు దోసకాయలను కలిగి ఉండాలి.దోసకాయలో అధిక నీరు మరియు యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.ఇది మీ కడుపు తొందరగా నింపుతుంది మరియు ఎక్కువ కాలం నిండుగా ఉండేలా చేస్తుంది. సెలెరీ కలయికతో, కేలరీలలో నీరు తక్కువగా ఉంటుంది మరియు వేగవంతంగా మీరు బరువు తగ్గడానికి ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. పుచ్చకాయ మరియు పుదీనా రసం (మింట్ జ్యూస్)

2. పుచ్చకాయ మరియు పుదీనా రసం (మింట్ జ్యూస్)

పుదీనా కేవలం వంటకాల రుచిని పెంచడంతో పాటుగా బరువుని కూడా తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడానికి సహాయపడే అమైనో ఆమ్లాలు పుచ్చకాయ లో పుష్కలంగా ఉంటాయి. పుదీనా మరియు పుచ్చకాయ కలయిక హైడ్రేట్ చేసి మరియు కేలరీలను తక్కువగా ఉంచుతుంది. ఇది బరువు తగ్గే ప్రక్రియను పెంచడంలో సమర్థవంతమైనది.

- పుదీనా ఆకులు మరియు పుచ్చకాయ బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి

-½ కప్పు నీటితో ముక్కలుగా చేసుకున్న పుచ్చకాయ మరియు పుదీనాని బ్లైండ్ చేయండి.

3.క్యాబేజీ జ్యూస్

3.క్యాబేజీ జ్యూస్

క్యాబేజీ అన్నది అజీర్ణం మరియు ఉబ్బరం వంటి కడుపు సమస్యలను నివారించడంలో సహాయపడే అధిక ఫైబర్ తో నిండివున్న కూరగాయ. వేగవంతంగా బరువుని తగ్గించే ప్రక్రియలో క్యాబేజీ రసం సహాయపడుతుంది మరియు సుదీర్ఘకాలం నిండుగా వున్న అనుభూతినిస్తుంది.

క్యాబేజీ ని శుభ్రంగా కడిగి దానికి నిమ్మరసం జోడించి బ్లైండ్ చేయడం వలన మరింత రుచిగా ఉంటుంది.

4. నారింజ రసం (ఆరెంజ్ జ్యూస్)

4. నారింజ రసం (ఆరెంజ్ జ్యూస్)

తాజాగా పిండిన నారింజ రసాన్నిఎవరు మాత్రం ఇష్టపడరు? ఇది ఆరోగ్యకరమైనది మరియు తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది, ఇది శీతల పానీయాలకు మంచి ప్రత్యామ్నాయం. మీ రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి ఆరెంజ్ లో ఎక్కువగా ఉంటాయి.

- నారింజలను శుభ్రంగా కడిగి మరియు తొక్క ని తీసి, విత్తనాలను తొలగించండి.

- ఇప్పడు దీనికి చిటికెడు నల్ల ఉప్పు ని జతచేసి బ్లెండ్ చేసుకొని తాగండి.

5. పైనాపిల్ జ్యూస్

5. పైనాపిల్ జ్యూస్

పైనాపిల్ రసం కడుపులోని కొవ్వును తగ్గించడానికి ఒక గొప్ప పరిష్కారం. బ్రోమెలైన్ అనే

ఒక ముఖ్యమైన ఎంజైమ్ తో ఇది నిండి ఉంటుంది ఇది పొట్టలో వున్న అదనపు కొవ్వుని తొలగిస్తుంది.

-½ కప్పు నీటిలో బాగా కడిగి ముక్కలుగా చేసి బ్లైండ్ చేసుకొని ఆ రసాన్ని బరువు తగ్గడానికి ప్రతిరోజు సేవించండి.

6. దానిమ్మ రసం

6. దానిమ్మ రసం

దానిమ్మ రసం లో అనామ్లజనకాలు, పాలీఫెనోల్స్ మరియు సంయోజిత లినోలెనిక్ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవన్నీ జీవక్రియను పెంచడానికి మరియు అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

- ఒక బ్లెండర్ లో దానిమ్మ గింజల్ని జోడించండి.

- దీనికి ½ ఒక కప్పు నీరు పోయాలి మరియు బ్లైండ్ చేసి రోజూ సేవించండి.

7. ఆమ్లా జ్యూస్

7. ఆమ్లా జ్యూస్

మీ జీర్ణ వ్యవస్థ ని సరిగా ఉంచడానికి మరియు జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడే ఉసిరి రసంతో మీ రోజుని ప్రారంభించండి. తొందరగా బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ రసాన్ని తీసుకోండి.

-ఉసిరి నుండి విత్తనాలను తొలగించి మరియు చిన్న ముక్కలుగా కత్తిరించండి.

- దీనిని ఒక పేస్ట్ చేసి, ఈ పేస్ట్ కి ½ కప్పు నీటిని కలపాలి.

- దాన్ని ప్రతిరోజు తాజాగా త్రాగాలి.

8. క్యారట్ మరియు టమోటో జ్యూస్

8. క్యారట్ మరియు టమోటో జ్యూస్

క్యారెట్ విటమిన్ ఎ యొక్క గొప్ప మూలం, కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ తో పూర్తిగా నిండి ఉంటుంది. టమోటా రసంలో శరీరంలోని కొవ్వు ని కరిగించి జీవక్రియ పెంచి, ఆకలి ప్రక్రియలను నియంత్రిస్తాయి. క్యారెట్ మరియు టమోటా రసం బరువు తగ్గడంలో సహాయపడే ఉత్తమ రసాలలో ఒకటి.

- కూరగాయలు శుభ్రంగా కడిగి మరియు చాప్ చేసుకొని బ్లైండ్ చేయండి.

- దీనికి 1/4 కప్ నీటిని కలపండి.

9. (బిట్టర్గార్డ్ జ్యూస్) కాకరకాయ రసం

9. (బిట్టర్గార్డ్ జ్యూస్) కాకరకాయ రసం

కాకరకాయ లేదా కరేలా, ఇది ఆకలిని పుట్టించదు కానీ క్యాలరీ కంటెంట్లో ఎంత తక్కువగా ఉందో అది ఎంత వేగంగా బరువుని తగ్గిస్తుంది. కరేలా రసం కొవ్వును కారణమైన మెటాబోలీసింగ్ కోసం అవసరమైన పిత్త ఆమ్లాలను స్రవించడానికి కాలేయంని ప్రేరేపిస్తుంది.

-బ్లెండర్ లో శుభ్రపరిచి తరిగిన కాకరకాయ ముక్కలని తీసుకోండి. కావాలంటే చేదుని పోగొట్టడానికి నిమ్మ రసం ని కలుపుకోవచ్చు.

- ఈ రసం నున్నగా వచ్చేదాకా బ్లైండ్ చేసి రోజు సేవించండి.

10. బాటిల్ గోర్డ్ లేదా లాకీ జ్యూస్

10. బాటిల్ గోర్డ్ లేదా లాకీ జ్యూస్

బాటిల్ కాయ రసం మిమల్ని రిఫ్రెష్ చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి మంచిది. ఇది కొవ్వు లేకుండా తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది మరియు మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

-దీనిమీద వున్న చర్మాన్ని తొలగించి చిన్న ముక్కలు గా కట్ చేసుకొని ఒక బ్లెండర్ లో చేర్చండి.

- తాజాగా మరియు రుచిగా ఉండటానికి కొంచం నిమ్మరసం మరియు అల్లాన్ని జతచేయండి.

English summary

10 Best Detox Juices For A Fast Weight Loss

You may be trying to avoid those unhealthy fizzy drinks and might want to opt for better health-cleansing drinks. It is mandatory that every person should go through a full detox cleanse by adding these detox drinks in the diet..