For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వ రోగ నివారణకు టాప్ 10 ఫైబర్ రిచ్ ఫుడ్స్..!

ఫైబర్ రిచ్ ఆహారం మన శరీరంనకు పోషకాలను అందిస్తుంది. దీనిలో యాంటిఆక్సిడెంట్, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందువలన గుండెపోటు,క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

|

ఆధునిక కాలంలో తిండి దగ్గర నుంచి శారీరక శ్రమ వరకూ మన అలవాట్లన్నీ మారిపోయాయి. గతంలో ముతక ధాన్యాలు, తృణ ధాన్యాలు, రకరకాల పండ్లు, ముడి పప్పుల వంటివన్నీ తినేవారు. వాటితో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలీష్ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్ధాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలనూ ఎదుర్కొంటున్నారు. అలాగని మళ్లీ పూర్తిగా ముతక ధాన్యాలు, దంపుడు బియ్యం, రొట్టెల్లాంటి వాటికి పూర్తిగా మారిపోవటం కష్టం కాబట్టి.. మనం తినే ఆహారంలోనే 'పీచు' మోతాదు పెంచుకునేదెలా? అన్న అవగాహన పెంచుకుని.. అందుకు తగ్గట్టుగా మంచి అలవాట్లు పెంచుకోవటం ముఖ్యం!

ఫైబర్ రిచ్ ఆహారం మన శరీరంనకు పోషకాలను అందిస్తుంది. దీనిలో యాంటిఆక్సిడెంట్, విటమిన్లు మరియు ఫైటోకెమికల్స్ ఉంటాయి. అందువలన గుండెపోటు,క్యాన్సర్ మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం మీ జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది. ఫైబర్ ఫుడ్స్ మలబద్దకాన్ని, హెమరాయిడ్స్ మరియు డివర్టిక్యులోసిస్, వంటి వ్యాదులను తగ్గిస్తాయి. అంతేకాక ఒక ఆరోగ్యకరమైన బరువు నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒబేసిటిని కంట్రోల్ చేస్తుంది.

10 Fibre-rich Foods You Should Eat

మీరు అధిక ప్రయోజనాలు పొందాలంటే మీ ఆహారంలో తప్పనిసరిగా ఫైబర్ రిచ్ ఆహారాలు ఉండాలి. కార్న్,కాయధాన్యాలు,కిడ్నీ బీన్స్,సంపూర్ణ గోధుమ పాస్తా,బ్రౌన్ బియ్యం,సంపూర్ణ గోధుమ రొట్టె మరియు బ్రోకలీ మరియు క్యాబేజీ వంటి కూరగాయలు మరియు అవకాడొలు,బేరి పండ్లు మరియు యాపిల్ వంటి పండ్లలో పీచు అధికంగా ఉంటుంది. ఫైబర్ సమృద్ధిగా ఉన్న ఆహారాలు ఒక రూపం కలిగి మరియు మీకు సరైన పోషకాహారం అందుకోవడానికి సహాయపడతాయి.

ఫైబర్ లో జీర్ణం అయ్యే ఫైబర్ మరియు జీర్ణం కానీ ఫైబర్ రెండూ ఉంటాయి . ఈ రెండు రకాల ఫైబర్ అనేక పండ్లలో కనుగొనడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ లోచేర్చుకోవడం వల్ల రుచిని సంత్రుప్తిపరచడం మాత్రమే కాదు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది.కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మీరు తక్కువ ఆహారం తీసుకుంటారు మరియు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

1. ఓట్స్:

1. ఓట్స్:

ఓట్స్ ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది చాలా అత్యంత ఉపయోగకరమైన ఆహారం.అధికంగా వోట్స్‌ను అల్పాహారంగా తీసుకుంటారు. వోట్స్‌ రెండు రకాల ఫైబర్‌ను కల్గి ఉంటాయి. ఒకటి కరిగే ఫైబర్‌ ( పాలు) , రెండవది కరగని ఫైబర్‌( పండ్లు). కరిగే ఫైబర్‌ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలను నియంత్రిస్తుంది. కరగని ఫైబర్‌ మలబద్ధకం నుంచి ఉపశమనం కల్గిస్తుంది. ఇవి ఎక్కువగా పాలు, పండ్లు, ధాన్యపు గింజల్లో లభిస్తాయి.

2. లెంటిల్స్ :

2. లెంటిల్స్ :

త్రుణ ధాన్యాలు . వీటినే పప్పులు, కాయధాన్యాలు అనికూడా పిలుస్తుంటారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో ఫైబర్ తో పాటు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుంది. ఇది చాలా వర్సిటైల్ ఫుడ్ .వీటిని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. సాంబార్...సలాడ్స్ లో విరివిగా ఉపయోగిస్తుంటారు.

3. ఫ్రూట్స్:

3. ఫ్రూట్స్:

ఆపిల్ లేదా ఆరెంజ్ వంటి వాటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ల్ల ఇది ఆరోగ్యానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది.

4. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ :

4. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ :

కాలీఫ్లవర్, క్యాబేజ్ మరియు బ్రొకోలీ వంటి క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. న్యూట్రీషియన్స్ కూడా అధికంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి కావల్సిన న్యూట్రీషియన్స్ ను అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

5. బెర్రీస్ :

5. బెర్రీస్ :

స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీస్, గూస్బెర్రీస్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి, శరీరానికి అవసరమయ్యే ఫైబర్ బెర్రీస్ నుండి కూడా శరీరానికి అందుతుంది.

6. అవొకాడో:

6. అవొకాడో:

అవకాడో సాచురేటేడ్ ఫాట్'లకు బదులుగా మోనో-సాచురేటేడ్ ఫాట్'లను బదిలీ చేయుటలో శక్తివంతంగా పని చేస్తుంది. మరియు బరువు తగ్గే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా అవకాడోని మీరు తీసుకునే ఆహారంలో కలుపుకోవటం వలన గుండెని ఆరోగ్యంగా ఉంచే ఫాట్'లను అందించినవారు అవుతారు. ఇది చాలా విటమిన్'లను మరియి పోషకాలను అందించి మీరు వరువు తగ్గుటలో మంచి పాత్ర పోషిస్తుంది.

7. ఫ్లాక్స్ సీడ్స్:

7. ఫ్లాక్స్ సీడ్స్:

ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మరియు ఫైబర్'లను కలిగి ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ బరువు నిర్వహణలో ముఖ్యపాత్రని పోషిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్'లు ఆకలిని తగ్గించివేస్తాయి మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మీరు చక్కర పదార్థాలు తీసుకునే అవసరం లేకుండా చేస్తాయి.

8. మష్రుమ్:

8. మష్రుమ్:

మష్రుమ్స్ మనకు అందుబాటులో ఉన్న వెజిటేబుల్సే.. ఇది చాలా ఆరోగ్యకరమైనది మరియు న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఫైబర్ అధికంగా ఉన్నాయి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఒక గ్రేట్ ఐడియా.

9. సెలరీ:

9. సెలరీ:

సెలరీలో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు తక్కువ. కేవలం ఒక కప్పు సెలరీలో 6 శాతం డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైనది.

10. రైస్ బ్రాన్:

10. రైస్ బ్రాన్:

రైస్ బ్రాన్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది. రెగ్యులర్ గా శరీరానికి ఫైబర్ అందాలంటే రైస్ బ్రాన్ ను రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

English summary

10 Fibre-rich Foods You Should Eat

There are several health benefits of consuming fibre-rich foods. Listed here are a few foods that are rich in fibre content.
Desktop Bottom Promotion