For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మంచి ఆహారాలతో శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది..

By Y. Bharat Kumar Reddy
|

ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని మనం అందరం పాఠశాల రోజుల్లోనే తెలుసుకుని ఉంటాం. కానీ ప్రస్తుతం మనలో చాలామంది మన నిజమైన సంపద ఏమిటో మర్చిపోయారు. నిత్యం పని ఒత్తిళ్ల మధ్య ఉంటూ బిజీ బిజీగా గడుపుతూ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. కొత్త జీవన విధానాలతో మన ఆహారపు అలవాట్లు మొత్తం మారిపోయాయి. ఇక ఆరోగ్యకరమైన ఆహారం గురించి అయితే అసలు మర్చిపోయాం. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను మనం పొందగలుతాం. ఎంతో ఆనందంగా ఉండగలుగుతాం.

ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏమిటి ?

ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్లకోసం టాప్ 10 హెల్తీ ఫుడ్స్

సరైన పోషకాహారం తీసుకోవడాన్నే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అంటారు. లీన్ ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులను సమానంగా తీసుకుంటే చాలు. వీటన్నింటినీ బ్యాలెంస్డ్ గా తీసుకోవాలి. దీంతో శరీరం బలంగా తయారవుతుంది. వ్యాధులు దూరం అవుతాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు.

పిజ్జాలు, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ మొదలైనవి వంటి ఫాస్ట్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, శీతల పానీయాలకు కూడా దూరంగా ఉండాలి. నీరు, పిండి పదార్ధాలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్స్, పాలు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్లు ఉండే ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

లైంగిక సామర్థ్యంను పెంచే 15 ఇండియన్ సూపర్ ఫుడ్స్

ఆరోగ్యకరమైన ఆహారం తింటే వచ్చే ప్రయోజనాలు

ఆరోగ్యకరమైన ఆహారం వల్ల దీర్ఘకాల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శరీరం మొత్తం కూడా బలంగా మారుతుంది. మెదడు, గుండె, ఎముకలు, మెదడువంటి వాటి పనితీరు మెరుగవుతుంది. అంతేకాకుండా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి. వాటన్నంటినీ ఒక్కసారి చదువుదామా..

1. ఆరోగ్యకరమైన గుండె కోసం

1. ఆరోగ్యకరమైన గుండె కోసం

సోడియం, కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఆహారం గుండెకు చాలా మంచిది. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సాచ్యురేటెడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ ను మనం ఎక్కువగా వేయించిన ఆహారాల ద్వారా పొందవచ్చు. రెడ్ మీట్, వెన్న మొదలైనవి గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణం అవుతాయి. తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిది. ఇవి మన హృదయానికి మేలు చేస్తాయి.

2. ఎముకలు, దంతాల ఆరోగ్యం కోసం..

2. ఎముకలు, దంతాల ఆరోగ్యం కోసం..

కాల్షియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల దంతాలు బలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి కూడా ఈ ఫుడ్స్ ఉపయోగపడతాయి. విటమిన్ డీ మన శరీరంలో కాల్షియాన్ని సమన్వయం చేస్తుంది. కాబట్టి విటమిన్ డీ తగినంత తీసుకోవడం కూడా అవసరం. తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, మంచి ఆహారాలు, పండ్ల రసాలు, తృణధాన్యాలు మొదలైన వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.

3. మెదడు చురగ్గా పని చేస్తుంది

3. మెదడు చురగ్గా పని చేస్తుంది

శరీరాన్ని నియంత్రించడంలో మెదడు పాత్ర కీలకం. మెదడు సక్రమంగా పని చేయాలంటే సరైన పోషకాహారం అవసరం. మంచి ఆహరం తీసుకోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరగువుతుంది. మెదడు కణాలు మరింత ఉత్తేజంకావడానికి, బ్రెయిన్ షార్ప్ గా పని చేసేందుకు పోషకపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.

సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మీ మెదడు చాలా షార్ఫ్ గా ఆలోచించగలుతుంది.

4. బరువు నియంత్రణ

4. బరువు నియంత్రణ

యాపిల్స్, క్యారట్స్, దోసకాయలు, చిప్స్, ఫ్రైస్, చాక్లెట్లు సోడాలు ఇతర కూరగాయలను ఆహారంగా తీసుకోవడం వల్ల మీరు బరువు అదుపులో ఉంటుంది. మీరు నిత్యం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని అధిక బరువు సమస్య నుంచి దూరమైతే ఊబకాయం, థైరాయిడ్ సమస్యల బారిన పడకుండా ఉంటారు.

5. ఎనర్జీ

5. ఎనర్జీ

మనం తినే ఆహారం జీర్ణం అయ్యాక అది ఎనర్జీ, ఫ్యాట్స్ గా మారుతుంది. అయితే ఎక్కువ ఫ్యాట్స్ ఉండే ఆహారం తీసుకోకపోవడం మంచిది. దీనివల్ల మీరు రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను కలిగి ఉంటారు. అలాగే ఒకేసారి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా రెండు మూడు సార్లు తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కూడా చాలా మంచిది. అలాగే మంచి పోషక పదార్థాలుండే అల్పాహారం తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు ఎనర్జీని ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

6. ఒత్తిడి తగ్గుతుంది

6. ఒత్తిడి తగ్గుతుంది

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ మైండ్, బాడీ సక్రమంగా పని చేయగలుగుతాయి. మీరు ఒకవేళ ఒత్తిడికి గురవుతున్నట్లయితే ఒమేగా -3 ఫ్యాట్ యాసిడ్స్ ఉండే ఆహారపదార్థాలు తీసుకుంటూ ఉండండి. ఈ యాసిడ్స్ కర్టిసోల్ వంటి ఒత్తిడి హార్మోన నుంచి శరీరాన్ని కాపాడుతాయి. అలాగే బ్లాక్ టీ ద్వారా కూడా ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. నట్స్, బచ్చలికూరలలో విటమిన్ సి, మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఒత్తిడి బారీన పడకుండా ఉంటారు.

7. యవ్వనంగానే ఉంటారు

7. యవ్వనంగానే ఉంటారు

పండ్లు, కూరగాయలు వంటి వాటిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో ఉండే ఆమ్లజనకాలు చర్మ కణాలను రక్షిస్తాయి. దీంతో మీరు యవ్వనంగా కనిపిస్తారు. చేపల్లో లభించే ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి. అలాగే మీ చర్మం ముడుతలుపడకుండా ఉంటుంది.

8. ఓవరాల్ హెల్త్

8. ఓవరాల్ హెల్త్

సమతుల్యం ఆహారం బాడీ మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే అవయవాలు పని తీరు మెరుగుపడేలా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపడేందుకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

9. లాంగ్ లైఫ్

9. లాంగ్ లైఫ్

హెల్తీ హార్ట్, హెల్తీ మైండ్, ఒత్తిడి తక్కువగా ఉండడం, మంచి ఫిట్ బాడీ కలిగి ఉంగే లాంగ్ లైఫ్ మీ సొంతం. అలాగే వ్యాధుల బారిన పడకుండా ఉండే సామర్థ్యం మీ శరీరానికి ఉంటే కూడా మీ జీవితం ఆరోగ్యకరంగా ఉంటుంది. సమతుల్య, పోషకపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మాత్రమే మీరు కలకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతారు.

10. డబ్బు ఆదా

10. డబ్బు ఆదా

పండ్లు, కూరగాయలు, గింజలు మొదలైనటువంటి ఆరోగ్యకరమైన ఆహారాలు మీకు తక్కువ ధరకే లభిస్తాయి. ఫాస్ట్ ఫుడ్స్ కంటే వీటి ధర చాలా తక్కువే. అలాగే ఇవి మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయేతప్ప హాని కలిగించవు. ఆరోగ్యకరమైన అలవాట్లు మీకు ఉంటే మీరు డాక్టర్ని కూడా సంప్రదించాల్సిన అవసరం లేదు. మెడిసిన్స్ కూడా మీకు అంతగా అవసరం ఉండదు. దీంతో మీ డబ్బు ఆదా అవుతుంది.

11. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోరు

11. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోరు

లీన్ ప్రోటీన్లు, కార్పొహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి ఉపయోగపడతాయి. అలాగే మీరు ఎప్పుడైతే సమతుల్య, పోషక ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తారో అప్పటి నుంచి అనారోగ్యకరమైన ఆహారంపైకి మీ మనస్సు మల్లదు.

దీంతో మీరు ఒక మంచి జీవనశైలికి ఈజీగా అలవాటైపోతారు.

12. మంచి మూడ్ లో ఉంటారు

12. మంచి మూడ్ లో ఉంటారు

కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారాలు సెరోటోనిన్ ను పెంచడానికి సాయం చేస్తాయి. సెరోటోనిన్ మెదడుకు సంబంధించిన ఒక రసాయనం. ఇది మన మానసికి స్థాయిని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలనునియంత్రించడానికి సహాయం చేస్తాయి. అందువల్ల ఇలాంటి పదార్థాలుండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది.

13. పరిజ్ఞానం పెరుగుతుంది

13. పరిజ్ఞానం పెరుగుతుంది

ఎప్పుడైతే మీరు ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తారో ఆ తర్వాత నుంచి వివిధ మంచి వివిధ ఆహారపదార్ధాలపై పరిశోధన చేపడుతారు.

వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాలపై మీకు పరిజ్ఞానం పెరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకునే ఆహారంలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే కూడా మీరు ఎవర్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదు. ఏవి తింటే బాగుంటుందనే విషయంపై మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఎప్పకప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ ఉంటారు.

14. లెస్ పికీ

14. లెస్ పికీ

పిల్లలకు వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజూ అందించడం అనేది తల్లిదండ్రులకు సులభతరమైన విషయం కాదు.

అలాగే కొందరు పెద్దవారు కూడా రోజూ రోటిన్ గా ఒకే ఆహారం తీసుకోవడం వల్ల కాస్త విసుగు చెంది ఉంటారు.

ఒకవేళ మీకు అలా అనిపిస్తున్నట్లయితే మీరు పండ్లు, కూరగాయలు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి.

15. ఫ్లట్టర్ బెల్లీ

15. ఫ్లట్టర్ బెల్లీ

కార్బొనేషన్, ఎక్కువ మోతాదులో సోడియం వంటివి ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల బ్లోటెడ్ బెల్లీ సమస్య బారిన పడతారు. సోడియం, అధిక చక్కెర ఉండే ఆహారపదార్థాలు, కార్బోనేటేడ్ పానీయాలను వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి.

16. హెల్తీ స్మైల్

16. హెల్తీ స్మైల్

ఒకసారి మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభిస్తే మీకు అన్ని ప్రయోజనాలే కలుగుతాయి. దంతాల నొప్పి, నోటి నుంచి వచ్చే చెడు వాసన, గమ్ డిసీజ్స్ వంటి వాటి బారిన మీరు పడకుండా ఉంటారు. అలాగే నోటికి సంబంధించిన పలు సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆందోళనలు కూడా ఉండవు. ఇక హెల్తీ స్మైల్ మీ సొంతమవుతుంది. మొత్తంమీద ఆరోగ్యకరమైన ఆహారం మన శరీరంపై ఎంతో ప్రభావం చూపుతుంది. అయితే ఈ ప్రయోజనాలన్నింటినీ వెంటనే పొందలేకపోవొచ్చు. ఇందుకు కొంత సమయంలో పట్టొచ్చు. మీరు మాత్రం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూనే ఉండండి. దాని ఫలితాలు భవిష్యత్తులో మీరు చాలా చూస్తారు.

English summary

16 Positive Effects Of Healthy Eating On Your Life

Positive Effects Of Healthy Eating On Your Life. Read to know more about..
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more