లేత కొబ్బరి కంటే ఎండు కొబ్బరిలో పోషకాలు..ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ..!!

Posted By:
Subscribe to Boldsky

మనచుట్టు ఉన్న వస్తువులు, మనం ప్రతి రోజు తినే పదార్థాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే మనం పోషకాలు అందించేవి కాకుండా పెద్దగా ఉపయోగం లేని పదార్థాలను తింటూ ఉంటాం. అధిక లావు తగ్గాలి అంటే, ఆరోగ్యంగా, చలాకీగా ఉండాలి అంటే లేత కొబ్బరి తినాలని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం లేత కొబ్బరిలో ఎన్నో రకాల ప్రోటీన్లు మరియు ఎంజైమ్‌లు ఉంటాయి. దాంతో శరీరానికి చాలా ఉపయోగం.

లేత కొబ్బరిని నేరుగా కాకున్నా ప్రతి రోజు 100 గ్రాములు ఏదైనా ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. లేత కొబ్బరి కంటే ఎండు కొబ్బరిలో ఎక్కువగా పోషకాలు మరియు రోగ నిరోదక గుణాలు ఉంటాయి. అయితే ఎండు కొబ్బరి అరిగేందుకు కాస్త ఇబ్బంది. అందుకు కారణం అందులో మాయిశ్చరైజ్ కంటెంట్ మొత్తం తొలగిపోవడం వల్ల డ్రైగా మారుతుంది.

8 Health Benefits Of Dry Coconut

కొబ్బరిలోపల వాటర్ కంటెంట్ ను పూర్తిగా ఆవిరైపోవడం వల్ల ఎండు కొబ్బరి మరింత టేస్ట్ గా ఉంటుంది, ఎండు కొబ్బరి జీర్ణమవ్వడానికి కొద్దిగా సమయం పట్టినా, అందులో బెనిఫిట్స్ మాత్రం అద్భుతమని అంటున్నారు నిపుణులు. కొంత మంది కొబ్బరిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికమని , కొలెస్ట్రాల్ అధికమని చాలా మంది ఎండుకొబ్బరి ఉపయోగించరు.

అయితే డ్రై కోకనట్ లోని రుచి, అద్భుత ప్రయోజనాలుండటం వల్లే ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది.

ఎండు కొబ్బరిలో ఫైబర్, కాపర్, మ్యాంగనీస్, సెలీనియంతో పాటు అనేక న్యూట్రీసియన్స్ ఉన్నాయి. ఈ హై న్యూట్రీషినల్ వాల్యూస్ వల్ల డ్రై ఫుడ్స్ లో ఒది ఒక బెస్ట్ ఫుడ్స్ గా చెబుతారు. ఆరోగ్యంగా జీవించడానికి రెగ్యులర్ డైట్ లో ఇది కూడా ఒక భాగమే.

కాబట్టి, మీరు కూడా హెల్తీ లైఫ్ కోరుకుంటున్నట్లైతే ఏలాంటి కాంప్రమైజ్ లేకుండా ఈ రుచికరమైన ఆరోమా డ్రై కోకనట్ ను బెస్ట్ ఆప్షన్ గా ఎంపిక చేసుకోవాల్సిందే. మరి అంతకు ముందుగా డ్రై కోకనట్ లోని హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

హార్ట్ హెల్త్ :

హార్ట్ హెల్త్ :

డ్రై కోకనట్ లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది హార్ట్ కు మంచిది. మేల్ బాడీకి కనీసం 38 గ్రాలము డైటరీ ఫైబర్ అవసరం అవుతుంది. ఫీమేల్ బాడీకి 25గ్రాములు అవసరం అవుతుంది. ఈ డైటరీ ఫైబర్ వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.

బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది:

బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది:

బ్రెయిన్ ఏం చేస్తుందో తెలుసా? మీ రెగ్యులర్ డైట్లో డ్రై కోకనట్ ను తప్పనిసరిగా చేర్చుకోవాలి. డ్రై కోకనట్ బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది. హెల్తీ బ్రెయిన్ ను ప్రోత్సహిస్తుంది. మతిమరుపు వంటి సమస్యలను, ఇతర బ్రెయిన్ డెడ్ సమస్యలను నివారిస్తుంది.

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది:

డ్రై కోకనట్ లో 5.2 మైక్రోగ్రామ్స్ ఉంటుంది. ఇది వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డ్రై కోకనట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సెలీనియం సెలనో ప్రోటీన్స్ ను పెంచడం వల్ల అనేక వ్యాధులను నివారించుకోవచ్చు.

పురుషుల్లో వంద్యత్వాన్ని నివారిస్తుంది:

పురుషుల్లో వంద్యత్వాన్ని నివారిస్తుంది:

ఇది అపోహ కాదు, వాస్తవం. డ్రైడ్ కోకనట్ లో ఉండే మినిరల్స్ పురుషుల్లో వంద్యత్వ సమస్యలను నివారిస్తుంది. ఈ విషయాన్ని కొన్ని మెడికల్ టెస్ట్ మరియు పరిశోధనల ద్వారా నిరధారించారు . డ్రై కోకనట్ తినడం వల్ల శరీరంం సెలీనియం ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పురుషుల్లో ఇన్ఫెర్టిలిటిని తగ్గిస్తుంది.

అనీమియా తగ్గిస్తుంది:

అనీమియా తగ్గిస్తుంది:

మహిళల్లో ఒక వయస్సు వచ్చిన తర్వాత అనీమియాకు గురి అవుతుంటారు. ఐరన్ లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. డ్రైడ్ కోకనట్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అనీమియాను నివారిస్తుంది. కావాలంటే మీరు కూడా తినచూడండి.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

ఎండు కొబ్బరిలో ఉండే అనేక న్యూట్రీషియన్స్ క్యాన్సర్ సెల్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. కోలన్ , ప్రొస్టేట్ వంటి క్యాన్సర్ ను నివారించడంలో డ్రైడ్ కోకనట్ గ్రేట్ గా సహాయపడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రెగ్యులర్ గా డ్రైడ్ కోకనట్ తినడం అలవాటు చేసుకోండి.

జీర్ణ సమస్యలుండవు:

జీర్ణ సమస్యలుండవు:

అవును మితంగా ఎండుకొబ్బరి తినడం వల్ల మలబద్దకం, అల్సర్ , హెమరాయిడ్స్ వంటి జీర్ణ సమస్యలుండవు. డ్రైడ్ కోకనట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు.

ఆర్థ్రైటిస్ ను నివారిస్తుంది:

ఆర్థ్రైటిస్ ను నివారిస్తుంది:

ఆర్థ్రైటిస్, ఓస్టిరియోఫోసిస్ వంటి వ్యాధులను నివారించడంలో డ్రై కోకనట్ సహాయపడుతుంది. ఉండుకొబ్బరిలో ఉండే మినిరల్స్ టిష్యులన్ స్ట్రాంగ్ గా ఉంచుతుంది. హెల్తీ బాడీకి సహాయపడుతుంది

English summary

8 Health Benefits Of Dry Coconut

8 Health Benefits Of Dry Coconut, Dry coconuts are healthy without a doubt! Listed in this article are a few of the exceptional health benefits of dry coconuts
Story first published: Thursday, May 4, 2017, 20:00 [IST]
Subscribe Newsletter