For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నం ఎలా వండుకుని తింటే బాడీలో ఫ్యాట్ చేరదు, ఉన్న కొవ్వు కరిగిపోతుంది.!!

అన్నాన్ని ఒక ప్ర‌త్యేక‌మైన విధానంలో వండి తింటే దాని వ‌ల్ల మ‌న శ‌రీరంలోకి అద‌న‌పు క్యాల‌రీలు చేర‌వ‌ట‌. కొవ్వు కూడా రాద‌ట‌. అంతే కాదు, శ‌రీరంలో ఇప్ప‌టికే ఉన్న కొవ్వు కూడా క‌రుగుతుంద‌ట‌.

|

మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌లు దేశాల్లోనూ అన్నం ప్ర‌ధాన ఆహారాల్లో భాగంగా ఉంది. మ‌న ద‌క్షిణ భార‌త‌దేశంలోనైతే ఇదే ముఖ్య‌మైన ఆహారం. చౌక‌గా బియ్యం ల‌భించ‌డం, ఏ కూర‌తోనైనా క‌లుపుకుని తిన‌గ‌లిగే సౌల‌భ్యం ఉండ‌డంతో మ‌న ద‌గ్గ‌ర అన్నాన్ని ఎక్కువ‌గా తింటారు.

అయితే నిత్యం శారీర‌క శ్ర‌మ చేసే వారు అన్నం ఎంత తిన్నా వారికి అనారోగ్యాలు రావు. కానీ శారీర‌క శ్ర‌మ లేకుండా, నిత్యం ఒకే ద‌గ్గ‌ర కూర్చుని ప‌నిచేసే వారికైతే అన్నం తెచ్చి పెట్టే తంటాలు అన్నీ ఇన్నీ కావు. శ‌రీరంలో శ‌క్తి ఎక్కువ‌గా ఖ‌ర్చు కాదు. క్యాల‌రీలు పేరుకుపోతుంటాయి. అధికంగా బ‌రువు పెరుగుతారు. గుండె జ‌బ్బులు, షుగ‌ర్ వంటి అనారోగ్యాలు వ‌స్తాయి.

A Simple Way to Cook Rice That Could Halve the Calories

ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ లిస్ట్ ఇంకా ఎక్కువే అవుతుంది త‌ప్ప త‌ర‌గ‌దు. దీనికి ప్ర‌ధాణ కార‌ణం మ‌నం తినే అన్నం. బాగా పాలిష్ చేయ‌బ‌డి, మ‌ల్లెపూవు రంగులోకి వ‌చ్చే అన్నం అంటేనే మ‌న‌కు చాలా ఇష్టం. దాన్నే ఎక్కువ‌గా తింటున్నాం. అనారోగ్యాల‌ను తెచ్చుకుంటున్నాం.

అయితే అన్నాన్ని ఒక ప్ర‌త్యేక‌మైన విధానంలో వండి తింటే దాని వ‌ల్ల మ‌న శ‌రీరంలోకి అద‌న‌పు క్యాల‌రీలు చేర‌వ‌ట‌. కొవ్వు కూడా రాద‌ట‌. అంతే కాదు, శ‌రీరంలో ఇప్ప‌టికే ఉన్న కొవ్వు కూడా క‌రుగుతుంద‌ట‌. మ‌రి అలాంటి అద్భుత‌మైన ఫ‌లితాల‌ను ఇచ్చే ఆ ప‌వ‌ర్‌ఫుల్ టిప్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం....

అన్నాన్ని ప‌లు ర‌కాలుగా వండుతారు...

అన్నాన్ని ప‌లు ర‌కాలుగా వండుతారు...

సాధార‌ణంగా అంద‌రూ అన్నాన్ని ప‌లు ర‌కాలుగా వండుతారు. కొంద‌రు ఎల‌క్ట్రిక్ కుక‌ర్ పై వండితే ఇంకొంద‌రు గ్యాస్ స్ట‌వ్‌పై గంజిని వార్చి లేదంటే నీటిని అలాగే ఇగిర్చి ఆవిరి చేసి అన్నం వండుతారు.

 బియ్యం, నీళ్ల‌తోపాటు కొద్దిగా కొబ్బ‌రినూనె

బియ్యం, నీళ్ల‌తోపాటు కొద్దిగా కొబ్బ‌రినూనె

అయితే అన్నం ఎలా వండినా బియ్యం, నీళ్ల‌తోపాటు కొద్దిగా కొబ్బ‌రినూనె కూడా వాటితో క‌లిపి పాత్ర‌లో వేయాల‌ట‌.

కొబ్బ‌రినూనె అంటే

కొబ్బ‌రినూనె అంటే

కొబ్బ‌రినూనె అంటే మ‌నం జుట్టుకి పెట్టుకునేది కాదు, వంట‌ల‌కు వండే కొబ్బ‌రినూనె వేరేగా ఉంటుంది. అది ఎక్కువ‌గా నూనె గానుగల నుంచి ల‌భిస్తుంది. లేదంటే మార్కెట్‌లోనూ కొనుక్కోవ‌చ్చు.

 బియ్యం బ‌రువులో 3 శాతం కొబ్బ‌రి నూనెను

బియ్యం బ‌రువులో 3 శాతం కొబ్బ‌రి నూనెను

అయితే మీరు పెట్టే బియ్యం బ‌రువులో 3 శాతం కొబ్బ‌రి నూనెను క‌ల‌పాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 1 కిలో బియ్యం ఉడికేందుకు పెడితే అందులో 3 శాతం బ‌రువు అంటే 30 గ్రాముల కొబ్బరి నూనెను ఆ బియ్యానికి క‌లపాల్సి ఉంటుంది.

అలా కొబ్బ‌రినూనెను క‌లిపాక

అలా కొబ్బ‌రినూనెను క‌లిపాక

అలా కొబ్బ‌రినూనెను క‌లిపాక అన్నం మామూలుగానే వండాలి. అనంత‌రం ఆ అన్నాన్ని చ‌ల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టాలి. 12 గంట‌ల త‌రువాత ఆ అన్నంను బ‌య‌టికి తీసి కొద్దిగా వేడి చేసి వెంట‌నే తినేయాలి. దీని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

పైన చెప్పిన విధానంలో అన్నం

పైన చెప్పిన విధానంలో అన్నం

పైన చెప్పిన విధానంలో అన్నం వండ‌డం వ‌ల్ల ఆ అన్నం రెసిస్టెంట్ స్టార్చ్ అన‌బ‌డే సంక్లిష్ట పిండి ప‌దార్థంగా మారుతుంద‌ట‌. దీన్ని పలువురు సైంటిస్టులు ఇటీవ‌లే క‌నుగొన్నారు. ఇలా సంక్లిష్ట పిండి ప‌దార్థంగా మారిన అన్నాన్ని తింటే దాని వ‌ల్ల మ‌న‌కు సాధార‌ణ అన్నం క‌న్నా దాదాపుగా స‌గం క్యాల‌రీలు త‌క్కువ‌గా వ‌స్తాయ‌ట‌.

ఈ అన్నం సాధార‌ణ అన్నంలా కాకుండా

ఈ అన్నం సాధార‌ణ అన్నంలా కాకుండా

అంటే ఉదాహ‌ర‌ణ‌కు సాధార‌ణ అన్నం ద్వారా 100 గ్రాముల‌కు 400 క్యాల‌రీలు ల‌భిస్తాయ‌నుకుంటే ఈ అన్నం ద్వారా మ‌న‌కు 100 గ్రాముల‌కు 200 క్యాల‌రీలు మాత్ర‌మే ల‌భిస్తాయి. అవి కూడా శరీరంలో నిదానంగా క‌లుస్తాయి. అంటే ఆ అన్నం సాధార‌ణ అన్నంలా కాకుండా చాలా ఆల‌స్యంగా జీర్ణ‌మ‌వుతుంది.

 కొబ్బ‌రినూనె అన్నాన్ని తింటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

కొబ్బ‌రినూనె అన్నాన్ని తింటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

ఇలా జీర్ణ‌మ‌య్యేందుకు ఒంట్లో ఉన్న కొవ్వును ఖ‌ర్చు చేసుకుంటుంది. దీని వ‌ల్ల మ‌న‌కు క్యాల‌రీలు బాగా త‌క్కువ‌గా అంద‌డ‌మే కాదు, ఈ కొబ్బ‌రినూనె అన్నాన్ని తింటే శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది.

చాలా త‌క్కువ మొత్తంలో

చాలా త‌క్కువ మొత్తంలో

చాలా త‌క్కువ మొత్తంలో ఈ అన్నం తిన్నా కొన్ని గంట‌ల పాటు ఆక‌లి వేయ‌దు. క‌డుపు నిండిన భావన క‌లుగుతుంది. దీని వల్ల బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతారు.

ఈ అన్నం మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

ఈ అన్నం మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.

కొబ్బ‌రినూనెను ఉప‌యోగించి వండిన ఈ అన్నం మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. నిత్యం అన్నం మానేసి చ‌పాతీలు మాత్ర‌మే తింటున్నవారు, వాటిని తిన‌లేని వారు ఎంచ‌క్కా అన్నాన్ని ఈ విధంగా వండుకుని తిన‌వ‌చ్చు. దీంతో వారి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ బాగా వినియోగ‌మ‌వుతుంది. త‌ద్వారా మందుల వాడకాన్ని స్టెప్ బై స్టెప్ త‌గ్గించుకోవ‌చ్చు కూడా.

ఈ అన్నం వ‌ల్ల శ‌రీరంలోకి విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ బాగా శోషించుకోబ‌డ‌తాయి

ఈ అన్నం వ‌ల్ల శ‌రీరంలోకి విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ బాగా శోషించుకోబ‌డ‌తాయి

ఈ అన్నం వ‌ల్ల శ‌రీరంలోకి విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ బాగా శోషించుకోబ‌డ‌తాయి. మ‌ల‌బ‌ద్ద‌కం కూడా పోతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌నిచేస్తుంది. శ‌రీరంలో ఉన్న చెడు బాక్టీరియా పోయి మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. అంతేకాదు శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ కూడా ప‌టిష్ట‌మ‌వుతుంది.

English summary

A Simple Way to Cook Rice That Could Halve the Calories

Have you ever looked at your old pictures and released that you have put on quite a bit of weight, in a rather short time?Do you often experience frustration and disappointment because of your weight?
Desktop Bottom Promotion