For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రాక్షలో కంటే ద్రాక్ష విత్తనాల్లో 7 అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ..!!

By Lekhaka
|

పండ్లలో బాగా పాపులర్ అయినటివ ద్రాక్ష. ద్రాక్షలో వివిధ రాలు ఉన్నాయి. అయితే ద్రాక్షను చాలా మంది ఇష్టపడరు. వీటిలో ఉండే పుల్లని స్వభావం వల్ల చాలా మంది వీటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. ద్రాక్షలో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇంకా వీటిలో నేచురల్ ప్లాంట్ కాంపౌడ్స్ ఓలిగోమెరిక్ ప్రోంథోసైయనిడిన్ కాంప్లెక్స్ కంటెంట్స్(ఓపిసిఎస్) ఉంటాయి.

ఇవన్నీ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటికి గురించి బాగా తెలిసి ఉంటాయి, ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ను తొలగిస్తాయి. ఇవి ప్రీమెచ్యుర్ ఏజింగ్ ను నివారిస్తాయి. అలాగే క్రోనిక్ డిసీజెస్ నుకూడా నివారిస్తాయి.

ద్రాక్షలో ఉండే (ఓపిసిఎస్)గుణాలు, శరీర ఆరోగ్యానికి కావల్సినన్ని ప్రయోజనాలను అందించి శరీరంలోని అన్ని బాగాలకు ఉపయోగపడుతాయి. ద్రాక్షలో మాత్రమే కాదు, ద్రాక్ష విత్తనాల్లో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. హార్ట్ సమస్యలకు, రక్తనాళాల సమస్యలను, హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో, వీక్ బ్లడ్ సర్క్యులేషన్ ఉన్నవారికోసం ఈ విత్తనాలతో ఒక ట్రెడిషినల్ రెమెడీని ఉపయోగిస్తుంటారు.

ద్రాక్షవిత్తనాల్లో ఇవే కాదు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గ్రేప్ సీడ్స్ లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటీర, యాంటీ అలర్జిక్ మరియు వాసోడిలేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

ద్రాక్ష విత్తనాల్లో ఉండే ఓపిసిఎస్ అనే కాంపౌండ్ కంటెంట్ క్యాన్సర్ నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొన్ని పరిశోధనల ఆధారంగా గ్రేప్ సీడ్ రసాన్ని బ్రెస్ట్, స్టొమక్, లంగ్, ప్రొస్టేట్ మరియు కోలన్ క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.

గ్రేప్ సీడ్స్ లో ఉన్న టాప్ హెల్త్ బెనిఫిట్స్ ను తెలుసుకోవాలంటే పూర్తిగా చదవాల్సిందే..

1. హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

1. హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

గ్రేప్ సీడ్స్ లో ఉండే ఫ్లెవనాయిడ్స్, లినోలిక్ యాసిడ్స్, మరియు ఫినోలిక్ ప్రొసినైడిన్స్ బ్లడ్ వెజిల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. దాంతో హైబ్లడ్ ప్రెజర్ ను నివారిస్తుంది.

2. క్రోనిక్ వీనస్ ఇన్ సఫియన్సీ :

2. క్రోనిక్ వీనస్ ఇన్ సఫియన్సీ :

గ్రేప్ సీడ్స్ లో ఉండే ఓపిసి లు క్రోనిక్ వీనస్ ఇన్ సఫిసియన్సీని నివారించడంలో గొప్సగా సహాయపడుతుంది. ఇది హెవీనెస్ అనుభూతిని, నొప్పి, దురదను తగ్గించడంలో సహాయపడుతుంది.

3. బోన్ స్ట్రెంగ్త్ :

3. బోన్ స్ట్రెంగ్త్ :

గ్రేప్ సీడ్స్ లో ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పాజిటివ్ రిజల్ట్ ను కలిగిన్నాయి. ఎముకలు ఏర్పడటానికి మరియు ఎముకలను బలోపేతం చేయడానికి ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి.

4. వాపులను తగ్గిస్తుంది :

4. వాపులను తగ్గిస్తుంది :

గ్రేప్ సీడ్స్ ఎక్స్ ట్రాక్ట్ కాళ్ళలో వాపు తగ్గిస్తుంది. వాపును ఓడిమా అని కూడా పిలుస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేసుకొన్నవారు గ్రేప్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్ ను తీసుకోవడం వల్ల వీరిలో వాపులను తగ్గడం ఒక పరిశోధనలో కనుగొన్నారు.

5. మతిమరుపు లక్షణాలు:

5. మతిమరుపు లక్షణాలు:

గ్రేప్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్ లో హిప్పో కాంపల్ డిస్ ఫంక్షన్ అనే బ్రెయిన్ సమస్యను గ్రేప్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్ నివారిస్తుంది. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడం వల్ల మరియు మైటోకోండ్రియల్ ఫంక్షనింగ్ వల్ల ఇది సాద్యం అవుతుంది.

6. ఓరల్ హెల్త్:

6. ఓరల్ హెల్త్:

ల్యాబ్ స్టడీ ప్రకారం , గ్రేప్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్ లో కావిటీ రిమినిరలైజేషన్ చేయడాన్ని ప్రోత్సహిస్తుందని కనుగొన్నారు. చిన్న వయస్సులోనే దంత క్షయం మరియు బోన్ హెల్త్ ను మెరుగుపరచడంలో గ్రేప్ సీడ్స్ పాజిటివ్ ఫలితాలను అందించినట్లు పరిశోధనల్లో కనుగొన్నారు.

7. డయాబెటిస్:

7. డయాబెటిస్:

డయాబెటిస్ కంట్రోల్ చేయడంలో గ్రేప్ సీడ్ ఎక్స్ ట్రాక్ట్ తో పాటు సరైన వ్యాయామం కూడా సహాయపడుతుంది. ఇది డయాబెటిక్ పేషంట్స్ లో లిపిడ్ ప్రొఫైల్ ను మెరుగుపరుస్తుంది, బరువు తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటుంది. ఇతర డయాబెటిక్ కండీషన్ ను నివారిస్తుంది.

English summary

Amazing Health Benefits Of Grape Seeds That You Need To Know

The health benefits of grape seeds do not end with that. A grape seed also has antibacterial, antiviral, anticarcinogenic, anti-inflammatory, anti-allergic and vasodilatory properties.
Desktop Bottom Promotion