For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదం ప్రకారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలు..!

. ప్రతి రోజు బ్రేక్ ఫాస్టులో బలవర్థకమైన అల్పాహారాన్ని మితంగా కాకుండా కాస్త ఎక్కువగానే తీసుకోమంటున్నారు న్యూట్రీషియన్లు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మీ ఎనర్జీ లెవల్స్‌ను స్థిరం

By Lekhaka
|

చాలామంది ఉదయంవేళ కార్యాలయాలకు, లేదా వ్యాపారాలకు వెళ్ళాలంటూ తమ బ్రేక్ ఫాస్ట్ సైతం తినకుండా వెళతారని అయితే, ఇది సరి కాదని, ఉదయంవేళ చక్కని అల్పాహారం తీసుకుని రోజు దినచర్య మొదలు పెట్టేవారికి ఒత్తిడి వుండదని లేదా తక్కువగా వుంటుందని ఒక తాజా రీసెర్చి తెలుపుతోంది. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మైండ్ సరిగా పని చేయటమే కాక, వీరి చూపు, చేతుల పని సైతం తప్పులు లేకుండా చేశాయని రీసెర్చర్లు తెలిపారు. అంతేకాదు, వీరు దీర్ఘకాలం తమ ఏకాగ్రతలను తాము చేసే పనిపైన పెట్టగలిగినట్లుగా తెలిపారు.

Ayurveda Recommends: 9 Foods That Should Be A Part Of Your Daily Breakfast

చాలా మంది తాము బ్రేక్ ఫాస్ట్ చేయని రోజు ఒత్తిడిగా భావిస్తామని, అంతేకాక, బద్ధకంగాను, పని సవ్యంగా చేయకపోయినట్లుగాను కూడా వుంటుందని 25 నుండి 34 సంవత్సరాల మధ్య వయసు వారు తెలిపారు. మనం తీసుకునే ఆహార విషయంలో తగిన జాగ్రత్త తీసుకోక పోతే... ఒక వయస్సు దాటిన తర్వాత ఓవర్ వెయిట్‌ వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అధిక బరువువున్నవారు ఎక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం ఇష్టపడరు. మరికొందరైతే ఓవర్ వర్కవుట్స్ ప్రారంభిస్తారు. ఈ రెండింటి వల్ల లావు లేదా బరువు తగ్గడం అటుంచి.. నీరసం వచ్చి పడిపోవడం ఖాయమని వైద్యులు అంటున్నారు.

ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రతి మనిషి నిర్ణీత వేళకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మంచిదని చెపుతున్నారు. ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్ధాం. ప్రతి రోజు బ్రేక్ ఫాస్టులో బలవర్థకమైన అల్పాహారాన్ని మితంగా కాకుండా కాస్త ఎక్కువగానే తీసుకోమంటున్నారు న్యూట్రీషియన్లు. ఇలా చేయడం వల్ల మీ జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, మీ ఎనర్జీ లెవల్స్‌ను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుందట. కాబట్టి, ఆయుర్వేదం ప్రకారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొనే అల్పాహారాలేంటో ఒకసారి చూద్దాం...

గ్రీన్ జ్యూస్ :

గ్రీన్ జ్యూస్ :

వివిధ రకాల జ్యూస్ లు ఉన్నాయి. ఫ్రూట్ జ్యూసులు మాత్రమే కాకుండా వెజిటేబుల్ జ్యూస్ లను కూడా ఎంపిక చేసుకోవచ్చు. వెజ్ గ్రీన్ జ్యూస్ లలో హెల్తీ న్యూట్రీషియన్స్ కలిగి ఉంటాయి. బ్రొకోలీ, కుకుంబర్, సెరల్, కొత్తిమీర, స్పినాచ్ జ్యూస్ లను ఎంపిక చేసుకోవాలి. నిపుణులు సూచిస్తున్నారు.

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి. అంతకంటే అధికంగా తింటే వాటిలోని షుగర్ మీ శరీరంలోని షుగర్ స్ధాయి పెంచుతుంది. కనుక మితంగా తినండి.

 మొలకలు:

మొలకలు:

మొలకల్లో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తాయి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో మొలకలను చేర్చుకోవాలి.

మింట్ బీట్రూట్ జ్యూస్:

మింట్ బీట్రూట్ జ్యూస్:

ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా, ఈ జ్యూస్ కు కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కాంబినేషన్లో తయారుచేస్తారు. బీట్, క్యారెట్, ఆపిల్ ముక్కలుగా చేసి,అందులో ఫ్రెష్ గా ఉండే పుదీనా చేర్చి జ్యూస్ తయారుచేసి తాగాలి.

 ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఒక కప్పు ఓట్ మీల్ ని పాలల్లో కానీ మరే రూపంలో కానీ తీసుకొన్నా ఫలితాలుంటాయి. ఓట్ మీల్ లోని పీచు... ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు మీరు ఉత్సాహాంగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది. కొత్త ఆలోచనలు వచ్చేలా ఉత్తేజపరుస్తుంది. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. అన్నిటికంటే గొప్ప ప్రయోజనం అంటే దానిని క్షణాలలో తయారు చేయవచ్చు. పనిలోకి తొందరగా వెళ్ళే వారు మైక్రోవేవ్ లో ఓట్ మీల్ తయారు చేసి రెడీగా తినేయవచ్చు.

నట్స్:

నట్స్:

బాదం పప్పు, ఇతర గింజల్లో ఏక అసంతృప్త కొవ్వు పదార్ధాలు వుంటాయి కనుక అవి మీ శరీరానికి చాలా మంచివి - మీ ధమనులను శుభ్ర పరుస్తాయి. గింజలు తరువాతి భోజనం వరకు మీకు కడుపు నిండుగా అనిపిస్తుంది. వాటిలో విటమిన్ ఇ, పీచు పదార్ధం, మెగ్నీషియం పుష్కలంగా వుంటాయి. గింజల్లో వుండే విటమిన్ ఇ యాంటి ఆక్సిడెంట్ గా పని చేసి కాన్సర్, ఉబ్బసం, ఇతర ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో మీ రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది.

బెర్రీస్:

బెర్రీస్:

తీపి తక్కువ బెర్రీస్ లో బరువు తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ముదురు వర్ణంలో ఉండే బెర్రీస్ లో యూరిక్ ఆమ్లం తగ్గించడానికి సహాయం కీలక అంశంగా ఉంటుంది.వీటిని అలాగే తినవచ్చు, ఎండబెట్టిన లేదా జ్యూస్ చేసి త్రాగవచ్చు. దాంతో లాంగ్ టైమ్ హెల్తీ హార్ట్ ను కలిగి స్లీమ్ గా మారవచ్చు.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

ఆయుర్వేదం ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే స్వీట్ పొటాటో త్వరగా పొట్ట నింపిన ఫీలింగ్ కలిగిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ తిన్న ఫీలింగ్ కలిగిస్తుంది.

ఎండు ఖర్జూరం:

ఎండు ఖర్జూరం:

హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కు డేట్స్ హెల్తీ చాయిస్, వీటిని బ్రెడ్ తో పాటు తీసుకోవచ్చు. ఎండు ఖర్జూరాలను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి, ఉదయం ఓట్ మీల్ తో కలపి తీసుకోవాలి.

English summary

Ayurveda Recommends: 9 Foods That Should Be A Part Of Your Daily Breakfast

As per Ayurveda, breakfast is one of the most important meals of our daily health needs and skipping it is a big no-no, if you want to lead a healthy life. What you have for your breakfast decides the amount of energy you'll be receiving that particular day.
Desktop Bottom Promotion