వేడిపాలను తాగటం వల్ల లాభాలు

By: Deepti
Subscribe to Boldsky

పాలు మిమ్మల్ని తాజాగా ఉంచటమే కాక విశ్రాంతినిస్తాయి. వేడిపాల ఉపయోగాలేంటో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

మీకు శక్తినివ్వటంతో పాటు, ఒక కప్పు వేడిపాలు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిని చేస్తాయి. పాలల్లో విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్, నియాసిన్, ఫాస్పరస్, పొటాషియం ఉంటాయి.

ఒక అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగటం వల్ల ఆరోగ్యం ఎంతో బాగుంటుంది.

పాలు మరియు తేనెలో 10 మిరాకిల్ హెల్త్ బెనిఫిట్స్

మీకు ఒకవేళ పాల ఉత్పత్తులు పడకపోతే, మీ వైద్యుని సూచనలు పాటించండి. పాలు భరించలేని వారికి సాధారణంగా సోయా పాలను సూచిస్తారు, కానీ వైద్యుని సలహా ఎంతో ముఖ్యం.

మిగతావాళ్ళు అందరూ పాలను రోజూ తాగవచ్చు. నిజానికి, కాఫీ, టీ, మద్యం ఇలాంటివి తగ్గించి పాలను ఎక్కువ తాగటం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది.

వేడిపాల లాభాలు చర్చిద్దాం.

కాల్షియం

కాల్షియం

మీ పళ్ళు, ఎముకలకు కాల్షియం అవసరం. పాలు రెగ్యులర్ గా తాగటం వలన మీ ఎముకలు గట్టిపడి, పళ్ళు కూడా బలపడతాయి .

ప్రొటీన్లు

ప్రొటీన్లు

పాలల్లో ప్రొటీన్ ఎక్కువ. మీ దైనందిక ఆహారంలో అందుకే పాలను చేర్చటం ముఖ్యం. మీ రోజును వేడిపాలతో మొదలుపెడితే రోజంతా శక్తివంతంగా ఉంటుంది. వ్యాయామాలు చేసేవారు కండరాల పెరుగుదల కోసం పాలల్లో ప్రొటీన్లపై ఆధారపడవచ్చు.

మలబద్ధకం

మలబద్ధకం

వేడిపాలకి ఇది మరో ఉపయోగం. జీర్ణానికి మంచిదవటం చేత మలబద్ధకంతో బాధపడేవారు పాలని తమ పరిష్కారంగా ప్రయత్నించవచ్చు.

మేకపాలలోని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా ?

ఓపిక స్థాయి

ఓపిక స్థాయి

అలసటతో బాధపడేవారు వేడి పాలు తాగి హాయిగా హుషారుగా మారచ్చు. పిల్లలకి ప్రత్యేకంగా ఇదే తాగించాలి.

నీటిశాతం సమం చేయటం

నీటిశాతం సమం చేయటం

మీకు తెలుసా, పాల వల్ల కూడా మీ శరీరంలో నీటిస్థితి సమంగా ఉంటుందని? మీ వ్యాయామం అయిన వెంటనే పాలను తాగి మీ శరీరాన్ని తాజాగా మార్చుకోండి.

గొంతు

గొంతు

పాలు గొంతునొప్పిని కూడా తగ్గించగలవు. గొంతునెప్పి వచ్చినపుడు వేడిపాలను (కొంచెం మిరియాల పౌడర్ తో కలిపి) తాగండి.

పసుపు పాలలోని అద్భుతమైన బ్యూటీ&హెల్త్ బెనిఫిట్స్

మానసిక వత్తిడి

మానసిక వత్తిడి

ఆఫీసునుండి ఇంటికి రాగానే, వేడిపాలను తాగి తేడా మీరే తెలుసుకోండి. మీ శరీరానికి వెంటనే విశ్రాంతి దొరుకుతుంది.

నిద్రలేమి

నిద్రలేమి

వేడి పాలు రాత్రిపూట తాగడం వల్ల లాభం ఇదే. పరిశోధనల ప్రకారం పాలు తాగటం వల్ల తొందరగా పడుకుంటారు.

English summary

Benefits Of Drinking Hot Milk

The benefits of hot milk are endless. Milk can energies you, nourish your health and can also reduce insomnia. These are some benefits of drinking hot milk
Story first published: Friday, July 7, 2017, 8:00 [IST]
Subscribe Newsletter