For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ ఉదయం ''కాఫీ, టీ''ల కంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరంలో అద్భుత మార్పులు

By Mallikarjuna
|

సాధారంగా చాలా మందికి నిద్రలేవగానే కాఫీలు, టీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో మాత్రం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు.

మజ్జిగను పెరుగు, కొన్ని మసాల పోపు దినుసులతో రుచికరంగా తయారుచేసుకుంటారు. కరీవేపాకు, ఆవాలు, అల్లం, జీలకర్ర వంటి పోపులతో బట్టర్ మిల్క్ తయారుచేసి తీసుకుంటారు.

పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్పెరుగుతో పొందే అమేజింగ్ హెల్త్ బెన్ఫిట్స్

పెరుగులో ప్రోబయోటిక్ వంటి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది, క్యాలరీలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాదపడే వారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రోజూ ఉదయం పరగడపున మజ్జిగ తాగడం వల్ల పొందే మరికొన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

కడుపులో మంటను తగ్గిస్తుంది

కడుపులో మంటను తగ్గిస్తుంది

రోజూ ఉదయం మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది.

పొట్టలో వ్యర్థాలను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది.

పొట్టలో వ్యర్థాలను బయటకు ఫ్లష్ అవుట్ చేస్తుంది.

బట్టర్ మిల్క్ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టవేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది

ఇంకా, మజ్జిగా కరివేపాకు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు.

వేసవిలో రోజుకు ఒక కప్పు పెరుగు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..వేసవిలో రోజుకు ఒక కప్పు పెరుగు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు..

జీర్ణశక్తిని పెంచుతుంది

జీర్ణశక్తిని పెంచుతుంది

కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగండి. ఇది జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది.

డీహైడ్రేషన్ కు మంచి రెమెడీ

డీహైడ్రేషన్ కు మంచి రెమెడీ

డీహైడ్రేషన్ తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ, ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు.

పోషకాలు

పోషకాలు

మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.

డయోరియాకు మంచి రెమెడీ

డయోరియాకు మంచి రెమెడీ

డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో 3సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

పెరుగుతో జుట్టుకు మెరుపులు...వలపులు...!పెరుగుతో జుట్టుకు మెరుపులు...వలపులు...!

కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది

కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది

ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు .

English summary

Why Drinking Buttermilk Is Better Than Coffee In The Morning?

Buttermilk is made of curd, water and some spices. Curry leaves, cumin seeds, salt and ginger powder are the main ingredients of buttermilk. As curd contains beneficial bacteria, buttermilk is good for digestion and is also low in calories. In fact, those who suffer constipation can have a glass of buttermilk in the morning.
Desktop Bottom Promotion