For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీ వయస్సును పది- పదిహేనేళ్లు వెనక్కు తీసుకొచ్చే 10 సూపర్ ఫుడ్స్ .!

|

ఎప్పటికైనా , ఎవరైనా వృద్ధాప్యంలోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వృద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్‌ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది- పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు. అదెలాగో పరిశీలిద్దామా!

చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి. ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది. మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జత చేసుకుంటే 'మీరే కాలేజి అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచేవే కాక జీర్ణక్రియ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి.

ఏజింగ్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, కంటి చూపు దెబ్బతింటుంది. స్టామినా పెరుగుతుంది. ఓవరాల్ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది. అలా జరగకూడదంటే అందుకు కొన్ని ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇవి స్కిన్, హెయిర్, నెయిల్స్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మంలో ముడుతలు రాకుండా నివారిస్తాయి. జుట్టు మంచి షైనింగ్ తో మెరుస్తుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. తప్పకుండా యంగ్ గా కనబడుతారు.

కాబట్టి, డే టు డే ఫుడ్ హ్యాబిట్స్ వల్లే మీరు యవ్వనంగా కనబడతారన్న విషయం గ్రహించి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిన న్యూట్రీషియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ గురించి ఒక సారి తెలుసుకుందాం..

బెర్రీస్ :

బెర్రీస్ :

బెర్రీస్ ను యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. బెర్రీస్ లో వివిధ రకాలున్నాయి. వాటిలో క్రాన్ బెర్రీ, బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో కొత్త కణాల ఏర్పాటుకు సహాయపడుతాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి.

త్రుణ ధాన్యాలు :

త్రుణ ధాన్యాలు :

రిఫైండ్ ధాన్యాలు, త్రుణధాన్యాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్స్ తో పాటు, విటమిన్స్, మినిరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల ఏజింగ్ ప్రొసెస్ ఆలస్యం అవుతుంది,.. ఏజ్ రిలేటెడ్ సమస్యలను క్యాన్సర్, హార్ట్ అటాక్ వంటి సమస్యలు తగ్గుతాయి.

బీన్స్ :

బీన్స్ :

బీన్స్ లో ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల ఇది హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది. మీరు యంగ్ గా కనబడాలనుకుంటే, డైట్ లో తప్పనిసరిగా బీన్స్ చేర్చుకోవాలి. హార్ట్ హెల్త్ ను మెరుగుపరుచుకోవాలి.

టమోటో:

టమోటో:

టమోటోల్లో లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. మరియు టమోటోలు పొట్ట సమస్యలను నివారిస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ ను లంగ్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

చేపలు:

చేపలు:

చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, వీటిలో ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు యాంటీఇన్ఫ్లమేటరీ నేచరల్ కలిగి ఉంటాయి. చేపలను వారంలో రెండు సార్లు తింటుంటు మంచి ఫలితం ఉంటుంది. స్ట్రోక్ నివారిస్తుంది. మతిమరుపు నివారిస్తుంది.

గ్రీన్స్ :

గ్రీన్స్ :

కేలా, బ్రొకోలీ వంటి ఆకుకూరల్లో ఫైటోన్యూట్రీషియన్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తాయి. యూవీ కిరణాల నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

ద్రాక్ష:

ద్రాక్ష:

రెడ్ గ్రేప్ లో రెస్వర్టోల్ అనే కాంపౌండ్ కంటెంట్ యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ కాంగ్లెంట్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఇంకా గ్రేప్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హార్ట్ కు మంచిది.

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్ :

ఆలివ్ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇంకా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల ఓవరాల్ హెల్త్ కు సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ క్యాన్సర్, ఏజ్ సమస్యలను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది.

నట్స్ :

నట్స్ :

శరీరానికి కూడా హెల్తీ ఫ్యాట్స్ అవసరం అవుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. నట్స్ లో ఉండే కొన్ని రకాల యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఓవరాల్ హెల్త్ కు సహాయపడుతాయి. స్కిన్ ఆరోగ్యంగా ఉంటుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్, హార్ట్ సమస్యలను నివారించడంలో మతిమరుపును నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Can Foods Keep You Young And Healthy?

Are there any foods to stay young? Is there anything that works like an anti-aging nutrition? Read on to know....
Story first published: Friday, February 3, 2017, 11:47 [IST]