For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిలో ఖర్జూరంని పాలలో నానబెట్టి, ఉదయం పరగడపున తీసుకుంటే మగవారికి కొండత బలం..

By Mallikarjuna
|

ఖర్జూరాల తీపికి ఎవరైనా పరవశం చెందాల్సిందే. ఖర్జూరాలు శరీరానికి అద్భుతమైన టానిక్ లా పని చేస్తాయి. ఇక ఖర్జూరాల్లో ఉన్న ఔషధ గుణాల గురించి చెప్పుకోవాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది. ఏ పండు అయినా పండగానే బాగుంటుంది.. కాని ఖర్జూరం మాత్రం ఎండినా గాని బాగుంటుంది. వేసవిలో ఎండు ఖర్జూరం నీళ్ళు తాగని పసిపిల్లలు ఎన్నో సమస్యలొస్తాయి. ఖర్జూరం అత్యధిక మినరల్స్ ఉన్న ఆహార పదార్ధం. ఈ పండులో విటమిన్లు, కాల్షియం, మినరల్స్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

<strong>కర్జూరంలో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...!</strong>కర్జూరంలో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...!

రక్త హీనత (అనిమియా) తో బాధ పడుతున్న వారికి వెంటనే పుష్కలంగా రక్తం వచ్చేలా చేయడంలో ఖర్జూరానికి మించిన ఔషదం లేదు. ఐరన్ లోపం ఉన్న వారికీ ఇది దివ్య ఔషదంగానే చెప్పుకోవాలి. అందుకే దీన్ని ప్రతి రోజు తీసుకునే ఆహారంలో చేర్చుకోవాలి అంటున్నారు పోషక ఆహార నిపుణులు. అద్భుతమైన బలాన్నిచ్చే ఖర్జూరం పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం..

కావాల్సిన పదార్ధాలు : పాలు, ఖర్జూర పండ్లు

ముందుగా ఒక గిన్నె తీసుకోని అది స్టవ్ పై పెట్టి దానిలో పాలు పోసి, అందులో ఖర్జురాలను వేసుకోవాలి. ఆ తర్వాత పాలను మరిగించాలి. అప్పుడు ఖర్జురాల్లోని తియ్య దనం మొత్తం పాలల్లో కలుస్తుంది. కొంచెం సేపు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ లో పోసుకొని చల్లారిన తర్వాతా తాగాలి. ఇందులో ఉండే పోషకాల వల్ల కలిగే లాభాలు ఏంటో చూడండి.

<strong>ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ?</strong>ప్రతిరోజూ అరగ్లాసు దానిమ్మ జ్యూస్, 3కర్జూరాలు తింటే ఏమవుతుంది ?

1. సెక్సువల్ స్టామినా:

1. సెక్సువల్ స్టామినా:

ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. వేడి పాలలో ఖర్జూరాలు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పాలతో పాటు ఖర్జూరాలను మిక్సీలో పేస్ట్ చేసి, కొద్దిగా యాలకపొడి, తేనె కలిపి తీసుకోవాలి.

2. అనీమియా నివారిస్తుంది:

2. అనీమియా నివారిస్తుంది:

ఖర్జూరాల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అనీమియాను తగ్గిస్తుంది. ఈ డేట్స్ ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. డేట్స్ లో ఉండే ఫ్లోరిన్ దంతక్షయాన్ని నివారిస్తుంది.

3. ఎనర్జీ బూస్టర్:

3. ఎనర్జీ బూస్టర్:

డేట్స్ గ్రేట్ ఎనర్జీ బూస్టర్. ఎందుకంటే అందులో గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ లు ఉంటాయి. మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందాలంటే, పాలలో ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి తాగాలి. ఈ పాలలో ఉండే లోక్యాలరీలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

4. పొట్ట ఉదరం యొక్క క్యాన్సర్ ను తగ్గిస్తుంది:

4. పొట్ట ఉదరం యొక్క క్యాన్సర్ ను తగ్గిస్తుంది:

ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కంప్లీట్ గా న్యాచురల్ డ్రింక్ మరియు మెడిసిన్ లా బెటర్ గా పనిచేస్తుంది.

5. కంటి పవర్ ను మెరుగుపరుస్తుంది:

5. కంటి పవర్ ను మెరుగుపరుస్తుంది:

కంటి చూపును మెరుగుపరుస్తుంది. అదే విధంగా రేచీకటిని నివారిస్తుంది.

6. జీర్ణశక్తిని పెంచుతుంది:

6. జీర్ణశక్తిని పెంచుతుంది:

పాలు మరియు ఖర్జూరం కాంబినేషన్ లో అమినో యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. మరియు ఇది సోలబుల్ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది.

7. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

7. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

ఖర్జూరంలో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి ఈ లోఫ్యాట్ డ్రైఫ్రూట్ ను పాలతో కలిపి తాగొచ్చు. వీటిలో మినిరల్స్, విటమిన్స్ ఎక్కువ.

8. మలబద్దకం నివారిస్తుంది:

8. మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకంతో బాధపడే వారికి ఇది మంచి ట్రీట్మెంట్. వీటిని రాత్రిలో పాలలో నానబెట్టి, ఆ పాలను ఉదయం తాగితే మంచి ఫలితం ఉంటుంది.

9. ఫైబర్:

9. ఫైబర్:

డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది, హార్ట్ అటాక్ లక్షణాలను పోగుడుతుంది, బౌల్ మూమెంట్ మెరుగ్గా ఉంటుంది.

10. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది:

10. నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది:

ఈ కాంబినేషన్ పాలలో పొటాషియం ఎక్కువ, కాబట్టి, శరీరంలో సోడియం తగ్గిస్తుంది. దాంతో నాడీవ్యవస్త మెరుగ్గా ఉండి, స్ట్రోక్ ను నివారిస్తుంది.

English summary

Milk Soaked Dates Health Benefits For Men

Dates are dry fruits that can be chipped and sprinkled on sweet dishes, cakes and puddings to enhance flavor in your dish. They are also good to serve with a mixture of fruits. It is important to wash the dates properly before you eat because dust accumulates on the dates easily.
Desktop Bottom Promotion