రోజుకు 4 బాదంలు తినండి, మీ శరీరంలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు గమనించండి!

Posted By:
Subscribe to Boldsky

కొన్ని ఆహారాలు ఆరోగ్యకరమైనవి, అయితే అవి టేస్టీగా ఉండవు. ఉదాహరణకు: కాకరకాయ, ఇది తినడానికి చేదుగా ఉంటుంది. కానీ అందులో ఆరోగ్యప్రయోజనాలు మెండుగా ఉంటాయి. చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతారు. అయితే ఈ విషయంలో బాదంలు మాత్రం అందుకు వ్యతిరేఖంగా అది తప్పు అని రుజువు చేశాయి.

బాదంలలో ఆరోగ్యానికి ఉపయోగపడే విటమిన్స్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి. ఉప్పు లేకుండా నేచురల్ గా లేదా ఒరిజినల్ గా ఉన్నవి తిన్నా కూడా అవి రుచికరంగా ఉంటాయి. అందుకే ఇవి న్యూట్రీషియన్ స్నాక్స్ గా.. బోలెడు ఆరోగ్యప్రయోజనాలను అందించే పోషకహారంగా పాపులర్ అయ్యింది.

బాదంలలో ఆరోగ్యానికి ఉపయోగపడే విటిమన్ ఇ, క్యాల్షియం, మెగ్నీసియం, పొటాషియంలు అధికంగా ఉండటం వల్ల వీటిని ఒక గుప్పెడు తింటే చాలు, హార్ట్ హెల్త్ మెరుగ్గా ఉంటుంది. హార్ట్ సమస్యలు ఇట్టే నివారిస్తుంది. అంతే కాదు వీటిని రెగ్యులర్ గా తింటుంటే, డయాబెటిస్, ఆల్జైమర్స్ వంటి సమస్యలు రావు.

రోజుకు 4 బాదంలు తినండి, మీ శరీరంలో జరిగే ఆశ్చర్యకరమైన మార్పులు గమనించండి!

ఇంకా బాదంలు లోషుగర్ కంటెంట్ ఫుడ్ గా ప్రసిద్ది చెందినది, వీటిలో ప్రోటీనులతో పాటు ఫైబర్, అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. సోడియం, కొలెస్ట్రాల్ ఉండవు.

డ్రైనట్స్ అన్నింటితో పోల్చితే, బాదంలలో ప్రోటీన్స్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఇ, రిబో ఫ్లెవిన్, నియాసిన్స్ అధికంగా ఉంటాయి.

రాత్రంతా నానబెట్టిన బాదామే హెల్తీ అనడానికి కారణాలు..

కాబట్టి, ఇప్పటి నుండి మీరు కూడా రోజూ బాదంలను తినాలనుకుంటే ముందుగా ఇవి అందించే కొన్ని టాప్ హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి...

1. కొలెస్ట్రాల్ వెల్స్ తగ్గుతుంది:

1. కొలెస్ట్రాల్ వెల్స్ తగ్గుతుంది:

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి బాదంలు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. ఒక వేళ ఇప్పటికే మీరు హై కొలెస్ట్రాల్ తో బాధపడుతుంటే, రోజుకు 20-30 బాదంలను తినడానికి ప్రయత్నించండి.

2. హెల్తీ హెయిర్:

2. హెల్తీ హెయిర్:

జుట్టు రాలడం తగ్గి, జుట్టు పెరగడానికి సహాయపడే విటమిన్స్ మరియు మినిరల్స్ బాదంలో అధికంగా ఉన్నాయి. ఇంకా మెగ్నీషియం, జింక్ వంటి మినిరల్స్ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. విటమిన్ బి జుట్టును కాంతివంతంగా మార్చుతుంది.

3. హార్ట్ డిసీజ్ ను నివారిస్తాయి :

3. హార్ట్ డిసీజ్ ను నివారిస్తాయి :

బాదంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, మోనోశ్యాచురేటెడ్ ఫ్యాట్స్, మెగ్నీసియం, కాపర్ వంటివి హార్ట్ మరియు రక్తనాళాల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతాయి. బాదంలను పొట్టుతో సహా అలాగే తినడం వల్ల ఇశ్చియామిక్ హార్ట్ అటాక్ మరియు ఇతర కార్డియాక్ కండీషన్స్ ను నివారిస్తుంది. రోజూ బాదంలను తినడానికి ఇది ఒక ముఖ్యమైన రీజన్.

ఒక స్పూన్ శెనగలు తింటే చాలు 50 బాదంలతో సమానం!

4. ముడుతలను పోగొడుతుంది:

4. ముడుతలను పోగొడుతుంది:

బాదంలలో ఉండే మెగ్నీషియం కంటెంట్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మంలో ముడతలు ఏర్పడకుండా నివారిస్తుంది. ఇంకా వీటిలో ఉండే విటమిన్ ఇ అనే యాంటీఆక్సిడెంట్ ఏజింగ్ లక్షణాలతో పోరాడి, స్కిన్ టాన్ మెరుగుపరుస్తుంది.

5. హెల్తీ బ్యాక్టీరియా పొందుతారు:

5. హెల్తీ బ్యాక్టీరియా పొందుతారు:

బాదం పొట్టులో ప్రొబయోటిక్ అనబడే హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియాకు సహకరిస్తుంది. మంచి బ్యాక్టీరియా లేకపోవడం వల్ల పొట్టనొప్పి, బ్యాడ్ బ్రీత్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, రోజూ బాదంలను తినడం మంచిదని సూచిస్తున్నారు.

6. బరువు తగ్గడానికి :

6. బరువు తగ్గడానికి :

రోజూ బాదంలను తినడం వల్ల ఆ రోజులో కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ తక్కువగా తినడానికి సహాయపడుతుంది. దాంతో జీవక్రియలు నార్మల్ గా ఉండి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి. ఇంకా బాదంలో ఉండే ఫైబర్ కంటెంట్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బాదంలో ఉండే టాప్ బెనిఫిట్స్ లో ఇది కూడా ఒక ముఖ్యమైన ఉపయోగం.

7.బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది:

7.బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది:

బాదంలలో ఉండే విటమిన్ ఇ, మెమరీ పవర్ ను పెంచుతుంది. బ్రెయిన్ వయస్సును తగ్గిస్తుంది. జ్ఝాపక శక్తి పెంచి, మతిమరుపు లక్షణాలను తగ్గిస్తుంది.

బాదం మిల్క్ లో దాగున్న టాప్ 10 హెల్త్ సీక్రెట్స్..!

8. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

8. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:

కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించడంలో బాదంలు గ్రేట్ గా సహాయపడుతాయి. రోజూ బాదంలను తినడం వల్ల క్రమంగా కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది.

9. గాల్ స్టోన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది:

9. గాల్ స్టోన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది:

బాదంలలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు, యాంటీఆక్సిడెంట్స్, గాల్ స్టోన్స్ ను ఏర్పడకుండా నివారిస్తాయి.

English summary

Almonds: Benefits Of Eating Them Every Day

Almonds are known to have several health benefits like decreasing cholesterol level, preventing heart disease, etc. Read to know the top health benefits of
Subscribe Newsletter