ఒక్క రోజుకు 3 ఖర్జూరాలు చాలు మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి..!

Posted By:
Subscribe to Boldsky

కర్జూరాలు.. వీటినే డేట్స్ అని పిలుస్తారు. చాలా డిలీషియస్ గా ఉండే డేట్స్ తినడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పనక్కరలేదు. డ్రై డేట్స్ ని ఎప్పుడో పురాతన కాలం నుంచి తింటూ ఉన్నాం. అయితే.. ప్రస్తుతం వాటిని.. నానబెట్టి మెత్తగా ఉండేలా ప్యాక్ చేసిన మార్కెట్ లో దొరుకుతాయి. వీటి ద్వారా ఎక్కువ మోతాదులో పోషకాలు పొందవచ్చు. ఇలా నానబెట్టిన వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.

డేట్స్ మల్టివిటమిన్ పిల్స్ లా పనిచేస్తాయి. వాటిలో ఉండే న్యూట్రీషియన్స్ అందుకు సహాయపడుతాయి. డేట్స్ అనీమియాను నివారిస్తాయి. కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ ప్రెజర్ మరియు ఇతర అనేక వ్యాధులను సమస్యలను నివారిస్తాయి. మలబద్దకం,ప్రేగు వ్యాధులు, హార్ట్ సమస్యలు, అనీమియా సెక్సువల్ డిస్ ఫంక్షన్ , డయోరియా, పొట్ట ఉదరంలో నొప్పి, కాన్సర్ లక్షణాలను నివారించడంలో డేట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

ఒక్క రోజుకు 3 ఖర్జూరాలు చాలు మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి..!

రోజువారీ డైట్ లో కర్జూరాలను చేర్చుకోవాలని.. తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎన్నో తినాల్సిన అవసరం లేదు.. కేవలం రోజుకి మూడు కర్జూరాలు తీసుకుంటే.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని స్టడీస్ తేల్చాయి. రోజుకి మూడు కర్జూరాలు తినడం మొదలుపెట్టి చూడండి.. మీ ఆరోగ్యం విషయంలో మీకే తేడా కనిపిస్తుంది.

ఐరన్ పుష్కలం:

ఐరన్ పుష్కలం:

డేట్స్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ పెంచి, రెడ్ బ్లడ్ సెల్స్ ను పెరుగుదలకు సహాయపడుతుంది. ఐరన్ లోపం వల్ల అనీమియా దారీతీస్తుంది. అనీమియా సమస్య ఉండకూడదనుకుంటే, ఐరన్ పొందాలంటే రోజుకు మూడు డేట్స్ తినడం మంచిది.

కళ్ళ ఆరోగ్యానికి డేట్స్ :

కళ్ళ ఆరోగ్యానికి డేట్స్ :

డేట్స్ లో జియాక్సిథిన్ మరియు టూటిన్స్ అధికంగా ఉన్నాయి. ఇది బెస్ట్ ఐ విటమిన్ గా పనిచేస్తుంది. ఇది కళ్ళకు సంబంధించిన మాస్కులార్ మరియు రెటినల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

డయోరియా నివారిస్తుంది:

డయోరియా నివారిస్తుంది:

డేట్స్ లో క్యాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది డయోరియాను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది గౌట్ పెయిన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. డేట్స్ వల్ల ఇది మరో టాప్ హెల్త్ బెనిఫిట్.

మలబద్దకంను నివారిస్తుంది:

మలబద్దకంను నివారిస్తుంది:

కొన్ని ఖర్జూరాలను తీసుకుని, ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టాలి. ఈ నీటిలో కూడా లాక్సేటివ్స్ అధికంగా విడుదల అవుతాయి. ఈ వాటర్ ను తాగడంవ ల్ల ప్రేగులు శుభ్రపడుతాయి. మలబద్దకం నివారించబడుతుంది.

సుఖ ప్రసవం:

సుఖ ప్రసవం:

ప్రసవానికి ఒక నెల ముందు నుండి డేట్స్ తీసుకోవడం వల్ల ప్రసవ నొప్పులు, బ్లీడింగ్ సమస్యలను నివారిస్తుంది. అంతే కాదు, ఇలా ప్రసవానికి ముందు నుండి తీసుకోవడం వల్ల పోస్టమాట్రమ్ డిప్రెషన్ ను తగ్గిస్తుంది. కొత్తగా తల్లైన వారిలో పాలు ఎక్కువగా పడుతాయి.

వెయిట్ బ్యాలెన్స్ చేస్తుంది:

వెయిట్ బ్యాలెన్స్ చేస్తుంది:

డేట్స్ లో హెల్తీ న్యూట్రీషియన్స్ ఉన్నాయి. వీటిని తింటే సంత్రుప్తి కలుగుతుంది. ఇవి స్వీట్స్ మీద కోరికలు తగ్గించి బరువు తగ్గిస్తుంది. పరగడుపు డేట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి.

హార్ట్ హెల్త్ కు మంచిది:

హార్ట్ హెల్త్ కు మంచిది:

హార్ట్ సమస్యలతో బాధపడే వారు రోజుకు మూడు డేట్స్ తింటే చాలు మంచి ఫలితం ఉంటుంది. ఒక గ్లాసు నీళ్లలో మూడు డేట్స్ ను నానబెట్టి, ఉదయం పరగడుపున తినాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు మూడు సార్లు తింటే చాలు హార్ట్ అటాక్ ను నివారిస్తుంది.

హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

హైపర్ టెన్షన్ మరియు హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

కర్జూరాలు బ్లడ్ ప్రెజర్ ( బీపీ ) రిస్క్ తోపాటు, హార్ట్ స్ర్టోక్ రిస్క్ ని తగ్గిస్తాయి. బీపీ సమస్య ప్రస్తుతం కామన్ గా వినిపిస్తుంది. కర్జూరాల్లో ఉండే మెగ్నీషియం రోజుకి మూడు కర్జూరాలు తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ రిస్క్ ని తగ్గిస్తుందని తేల్చాయి. అలాగే హైబీపీ ఉన్నవాళ్లకు కూడా ఇవి చక్కటి పరిష్కారమని సూచిస్తున్నారు. మెగ్నీషియం పుష్కలంగా లభించే కర్జూరాలు తినడం వల్ల స్ర్కోక్ రిస్క్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు.

స్ట్రోక్ రాకుండా నివారిస్తాయి:

స్ట్రోక్ రాకుండా నివారిస్తాయి:

రోజుకు మూడు ఖర్జూరాలు తినడం వల్ల పొటాషియం ఎక్కువగా అందుతుంది. శరీరానికి పొటాషియం ఎక్కువగా అందటం వల్ల స్ట్రోక్ 40శాతం తగ్గుతుంది.

బ్రెయిన్ కు మేలు చేస్తుంది:

బ్రెయిన్ కు మేలు చేస్తుంది:

డేట్స్ లో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది. ఇది బ్రెయిన్ ఫంక్షన్ కు చాలా మంచిది. కాబట్టి, బ్రెయిన్ కు కావల్సిన న్యూట్రీషియన్స్ అందివ్వడంలో డేట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

ఎనర్జీ బూస్టర్ :

ఎనర్జీ బూస్టర్ :

ఈ ఎండు ఖర్జూరాల్లో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ అనే కంటెంట్స్ ఉండటం వల్ల , డేట్స్, పాలు కాంబినేషన్ తీసుకోవడం వల్ల శరీరానికి ఇన్ స్టాంట్ ఎనర్జీ అందుతుంది.

లిబిడో :

లిబిడో :

మేకపాలలో డేట్స్ ను డిప్ చేసి, రాత్రంతా ననబెట్టాలి. తర్వాత ఉదయం అందులో యాలకలపొడి,తేనె మిక్స్ చేసి ఉదయం పరగడపున తాగాలి. ఈ పవర్ ఫుల్ కాంబినేషన్ స్త్రీ మరియు పురుషుల్లో ఇద్దరిలో లైంగిక శక్తి పెరుగుతుంది. మరి మీరేమంటారు. రోజుకు ఖచ్చితంగా 3 డేట్స్ తినాలా వద్దా..?

English summary

Things That Happen To Your Body If You Eat Three Dates A Day

Things That Happen To Your Body If You Eat Three Dates A Day ,Eat dates three times in a day to improve eye health, end diarrhoea, etc. Read to know what happens if you eat 3 dates a day.
Subscribe Newsletter