For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బీట్ రూట్ లో టాప్ 12 హెల్త్ బెనిఫిట్స్ ..!!

బీట్ రూట్ రసంలో స్కిన్ టోన్ (చర్మ ఛాయను)మెరుగుపరిచే గుణాలు అధికం. బీర్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుని, వారానికొకసారి తింటే చాలు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు...

By Lekhaka
|

రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. బీట్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాల పొందవచ్చు.

వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా.

ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే కాదు, సౌందర్యానికి పెంచే విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. బీట్ రూట్ రసంలో స్కిన్ టోన్ (చర్మ ఛాయను)మెరుగుపరిచే గుణాలు అధికం. బీర్ రూట్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుని, వారానికొకసారి తింటే చాలు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు...

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది

బీట్ రూట్ ను హైనైట్రేట్ ఫుడ్ గా భావిస్తున్నారు కాబట్టి, ఈ నైట్రేట్ తిన్నప్పుడు, నోట్లోని బ్యాక్టీరియాతో చేరి, నైట్రిట్స్ గా మారి బ్రెయిన్ కు బ్లడ్ ఫ్లోను పెంచుతుంది.

 లివర్ డిటాక్సిఫై చేస్తుంది:

లివర్ డిటాక్సిఫై చేస్తుంది:

బీట్ రూట్ జ్యూస్ లో ఉండే బీటైన్ కంటెంట్ హెల్తీ లివర్ ఫంక్షన్ కు సహాయపడుతుంది.

మెనుష్ట్రువల్ డిజార్డర్స్, మోనోపాజ్ లక్షణాలను నివారిస్తుంది

మెనుష్ట్రువల్ డిజార్డర్స్, మోనోపాజ్ లక్షణాలను నివారిస్తుంది

బీట్ రూట్ లో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి, ఇది శరీరంలో కొత్తగా ఎర్రరక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇవి మెనుష్ట్రువల్ డిజార్డర్స్, మోనోపాజ్ లక్షణాలను నివారిస్తుంది.

క్యాన్సర్ నివారిణిగా, చికిత్సగా సహాయపడుతుంది:

క్యాన్సర్ నివారిణిగా, చికిత్సగా సహాయపడుతుంది:

బీట్ రూట్ జ్యూస్ లో యాంటీట్యూమర్ ఎఫెక్ట్స్ పుష్కలంగా ఉన్నట్లు కొన్ని పరిశోధల్లో కనుగొనడం జరిగింది. ఇవి మన శరీరంలోని సెల్స్ కు రక్షణ కల్పిస్తాయి మరియు కొత్త కణాల ఉత్పత్తికి సహాయపడుతాయి.

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

బీట్ జ్యూస్ లోని హైనైట్రేట్స్ బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. ప్రతి రోజూ రెండు గ్లాసుల బీట్ రూట్ జ్యూస్ త్రాగడం వల్ల క్రమంగా బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడైనది.

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:

బీట్ రూట్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచడంతో పాటు, ఇన్ఫ్లమేషన్ తో పోరాడి, నొప్పులను, వాపులను తగ్గిస్తుంది.

మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

బీట్ రూట్ జ్యూస్ లో జీర్ణ సమస్యలకు మంచి నివారిణిగా పనిచేస్తుంది. కాబట్టి ఇది మలబద్దకంను నేచురల్ గా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అనీమియాను తగ్గిస్తుంది:

అనీమియాను తగ్గిస్తుంది:

బీట్ రూట్ జ్యూస్ లో ఐరన్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల , రెగ్యులర్ గా త్రాగడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ రీజనరేట్ చేస్తుంది . దాంతో అనీమియాను నివారించడంతో పాటు, చికిత్సగా సహాయపడుతుంది . మెనుష్ట్ర్యువల్ డిజార్డర్స్ మరియు మోనోపాజ్ లక్షణాలను ఒక మంచి హోం రెమెడీ.

కండరాలకు చాలా మేలు చేస్తుంది:

కండరాలకు చాలా మేలు చేస్తుంది:

బీట్ రూట్ జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల మజిల్ స్ట్రెంగ్గ్ మరియు పవర్ పెంచుతుంది . చాలా మంది ఆరోగ్య నిపుణులు వారి రెగ్యులర్ డైట్ లో బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటున్నట్లు వెల్లడిచేస్తున్నారు.

చర్మకాంతికి:

చర్మకాంతికి:

బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలు కనిపించవు. ఎందుకంటే ఇందులో ఉండే ఫొల్లెట్, ముఖంలో ముడతలు, ఇతర చర్మ సమస్యలతో పోరాడుతుంది . బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు.

మానసికస్థితిని మెరుగుపరుస్తుంది:

మానసికస్థితిని మెరుగుపరుస్తుంది:

బీట్ రూట్ జ్యూస్ లోని బిటైన్ మరియు ట్రైఫోటాన్ అనే కంటెంట్స్ మనస్సును విశ్రాంతిపరిచే లక్షణాలు కలిగి ఉంటాయి . మరియు డిప్రెషన్ నుండి కోలుకొనేలా చేస్తాయి కాబట్టి బీట్ రూట్ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

పుట్టకలో లోపాలను నివారిస్తాయి.

పుట్టకలో లోపాలను నివారిస్తాయి.

బీట్ రూట్ జ్యూస్ లో ఉండే ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలలో బర్త్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది . గర్భిణీ స్త్రీల కూడా బీట్ రూట్ జ్యూస్ ను మితంగా తీసుకోవడానికి ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

English summary

Top 12 Health Benefits Of Beetroot That You Didn't Know

Beetroot is considered as one one of the healthiest food options since ancient times. It is also known to treat various health issues. Read on to find out the other health benefits of beetroot.
Desktop Bottom Promotion