For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎట్టిపరిస్థితిలో తినకూడని ఆహారాలకు దూరంగా ఉండండి

By Y. Bharath Kumar Reddy
|

మనం తినే ఆహారాలన్నీ మనం చాలా బాగుంటాయని అనుకుంటాం. అయితే వీటిలో చాలా హానికరమైన ఆహారపదార్థాలు కూడా ఉంటాయి. వీటి వల్ల బరువు పెరగడంతో పాటు అనారోగ్యానికి గురువుతాం. మనం నిత్యం ఇలాంటి ఫుడ్స్, పానీయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం.

రుచిగా ఉన్నాయనో.. లేదో అందరూ తింటున్నారనో కొన్నింటిని తినడం వలన మీరు చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.

ఆ సమయంలో మీకు ఎలాంటి ప్రమాదాలు తలెత్తకున్నా భవిష్యత్తులో మాత్రం మీరు అనారోగ్యం బారిన పడాల్సి వస్తోంది. అందువల్ల వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా.

ఫ్రూట్ జ్యూస్

ఫ్రూట్ జ్యూస్

చాలామంది ఫ్రూట్ జ్యూస్ ను ఆరోగ్యకరంగా భావిస్తారు. కానీ వాస్తవానికి ఇవి చాలా హాని చేస్తాయి. మనంతాగే ఫ్రూట్ జ్యూసుల్లో పండ్ల రసాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో సుగర్ కార్న్ సిరప్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పళ్ల రసాల్లో ఫైబర్స్ కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఒక గ్లాస్ జ్యూస్ తాగగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తోంది. అందువల్ల వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి.

<strong>బ్రెయిన్ పవర్ ను తగ్గించే 10 వరెస్ట్ ఫుడ్స్ ..!</strong>బ్రెయిన్ పవర్ ను తగ్గించే 10 వరెస్ట్ ఫుడ్స్ ..!

డీప్ ఫ్రైడ్ ఫుడ్

డీప్ ఫ్రైడ్ ఫుడ్

బాగా వేయించిన ఆహారాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇవి తినడానికి అత్యంత రుచికరంగా ఉన్నా వీటి వల్ల వచ్చే దుష్ర్పభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీటిలో అధిక కేలరీలు, కొవ్వుపదార్థాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా బాగా వేడి వద్ద వీటిని తయారు చేసి ఉంటారు కాబట్టి పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

ప్రాసెస్ డ్ మాంసం

ప్రాసెస్ డ్ మాంసం

ప్రాసెస్ డ్ మాంసం ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులో అధిక మొత్తం సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అంతేకాకుండా ప్రాసెసింగ్ సమయంలో ఆ మాసంలో ప్రమాదకరమైన నైట్రోజన సమ్మేళనాలు కూడా కలుస్తాయి. అత్యధికంగా వేడి చేయడం వల్ల నైట్రేట్స్, నైట్రిట్స్ వంటివి కూడా ఆ మాసంలో కలుస్తాయి. తర్వాత అవి నైట్రోసేమిన్స్ గా మారుతాయి. ఇది పలు ప్రమాదకర వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతుంది. అయితే మీరు ఇందుకు ప్రత్యామ్నాయంగా ఫ్రెష్ మీట్ ను తీసుకోండి. స్థానిక రైతుల మార్కెట్ లభించే మాంసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి.

 తృణధాన్యాల బ్రేక్ ఫాస్ట్

తృణధాన్యాల బ్రేక్ ఫాస్ట్

అల్పాహారంలో తృణధాన్యాలు తీసుకోవొద్దని చెప్పడం లేదు. అయితే కొన్ని కొన్ని రంగురంగుల తృణధాన్యాలు వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి చాలా ప్రమాదకరం. అంతేకాకుండా వీటిలో దుమ్ముతో కూడా చక్కెర కూడా ఉంటుది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా వోట్స్, గోధుమ, ఊక రేకులు వంటివాటిని వినియోగిస్తే చాలా మంచిది.

ఫ్రోజోన్ ఫుడ్

ఫ్రోజోన్ ఫుడ్

మీరు నిల్వ చేసిన ఆహారం తినడం వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఆహారపదార్థాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని తయారీదారులు వాటని వేడి చేసేటప్పడు కార్సినోజెన్లలోకి కన్వర్ట్ చేసి ప్యాక్ చేస్తారు. ఫ్రోజోన్ మీట్ ప్రాడెక్ట్స్ హానికరమైన బాక్టీరియా, పరాన్నజీవులతో కలుషితమై ఉంటుందిన పరిశోధనల్లోనూ వెల్లడైంది.

 కేక్ ఫ్రాస్టింగ్

కేక్ ఫ్రాస్టింగ్

కేక్ ఫ్రాస్టింగ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అయితే అందులో చాలా హానికరమైన ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తారు. అందువల్ల మీరు దీన్ని తినకపోవడమే చాలా మంచిది. ఇందుకు ప్రత్యామ్నాయంగా అవొకాడో, డార్క్ చాక్లెట్స్ ను ఉపయోగిస్తే చాలా మంచిది.

<strong>డయాబెటిష్ పేషంట్స్ తీసుకోవల్సిన..తీసుకోకూడని ఆహారాలు.. </strong>డయాబెటిష్ పేషంట్స్ తీసుకోవల్సిన..తీసుకోకూడని ఆహారాలు..

 కాల్చిన మాంసం

కాల్చిన మాంసం

ఇందులో ప్రోటీన్లతో పాటు ప్రమాదకరమైన వైరస్ లు కూడా ఉంటాయి. హెచ్ సీఏ అని ప్రమాదకరమైన వైరస్ కొలరెక్టల్, ప్యాంక్రియాటిక్, లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వంటికి కారణమవుతుంది. అందువల్ల ఇలాంటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండండి. లేదంటే మీరు కచ్చితంగా హాస్పిటల్స్ కు వెళ్లాల్సి వస్తుంది.

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్

ఆర్సెనిక్ అనేది విషపూరిత మెటల్. ఇది బ్రౌన్ రైస్ లో ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉండే బ్రౌన్ రైస్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే తెల్ల బియ్యంలా మాదిరిగా ప్రాసెసింగ్ సమయంలో ఊకలు వాటి నుండి తొలగించబడవు. అందువల్ల వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి.

 డైట్ సోడా

డైట్ సోడా

డైట్ డ్రింక్స్ లో జీరో కేలరీలుంటాయి. ఇందులో ఆర్టిఫిషియల్ స్వీటర్న్ ఉంటుంది. అస్పర్టమి, బిస్పేనోల్ ఏ వంటివి సేమ్ చక్కెర ఇచ్చే రుచినే ఇస్తాయి. అయితే ఇవి శరీరంలో కొవ్వు పేరుకుపోయేందుకు కారణం అవుతాయి. ఈ రసాయనాలు అధిక ఉష్ణోగ్రత వద్ద కూడా అస్థిరంగా ఉంటాయి.

స్పోర్ట్స్ డ్రింక్

స్పోర్ట్స్ డ్రింక్

సాధారణంగా ఏదైనా క్రీడలు ఆడి అలసిపోయినప్పుడు మీకు స్పోర్ట్స్ డ్రింక్స్ అవసరమవుతాయి. అయితే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అయితే మీరు వీటికి బదులుగా కొబ్బరి నీళ్లను తాగడం చాలా మంచిది.

English summary

Avoid These! Worst Foods You Can Eat

Avoid These! Worst Foods You Can Eat, Most times than not, these supposed healthy choices are actually the reason why you are failing to lose weight and are instead packing on those pounds.
Story first published:Wednesday, November 1, 2017, 8:16 [IST]
Desktop Bottom Promotion