For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోడిగుడ్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఆసక్తికర అంశాలు ఇవే

|

కోడిగుడ్లు అంటేనే ప్రొటీన్ నిక్షేపాలు. పోషకాలు అధికంగా ఉండడంతో పాటు, ఉదయం అల్పాహారానికి సూచనగా ఉంటుంది కూడా. కోడిగుడ్డు రోజూ తీసుకోవడం వలన ఆరోగ్యంగానే కాకుండా, శరీరం సమర్దవంతముగా కూడా తయారవుతుంది. రోజుకి ఒక గుడ్డు కనీసం తీసుకోవడం ద్వారా పోషకాహార లోపం సమస్యను దూరం చేయవచ్చని ప్రభుత్వం కూడా మీడియా ద్వారా జనాలను చైతన్యపరచే కార్యక్రమం చేస్తుంది అంటేనే అర్ధం చేసుకోవచ్చు గుడ్డు ఎంత బలవర్ధకమైన ఆహార పదార్ధమో. కోడిగుడ్డు రుచికరంగా ఉండడమే కాకుండా, అత్యధిక మోతాదులో బి-విటమిన్, పోషకాలు, మరియు ప్రొటీన్ నిక్షేపాలతో నిండి ఉంటుంది. ఈ వ్యాసంలో ఈ కోడిగుడ్డుని గురించి మీకు తెలీని కొన్ని ఆసక్తికరమైన నిజాలను తెలుసుకుందాం.

ఆహారనిపుణుల సూచనల ప్రకారం, ఆహారప్రణాళికలలో భాగంగా కోడిగుడ్డును తీసుకోవడం మూలంగా అది ఒక ఆరోగ్యకర ఆహారప్రణాళికగా మారుతుంది అని సూచిస్తుంటారు. ఒక అధ్యయనం ప్రకారం తృణధాన్యాలతో కూడిన అల్పాహారం కన్నా, కోడిగుడ్డుని జతచేయడం ద్వారా అత్యధిక ప్రయోజనాలని పొందగలరని కనుగొనబడినది. ఒకవేళ ఎటువంటి అల్పాహారం తీసుకోకపోయినా, కోడిగుడ్డుని అల్పాహారంగా తీసుకోవడం వలన కృత్రిమ చక్కెరలు మరియు క్రొవ్వు పదార్ధాలు కలిగిన ఆహరం మీదకు కోరిక వెళ్ళదు.

10 Amazing Facts You Didnt Know About Eggs

కోడిగుడ్లు హాంగోవర్ ను సైతం తగ్గించగల ఉత్తమ ఆహారపదార్ధంగా చెప్పబడినది. దీనికి కారణం కోడిగుడ్డులో ఎక్కువ మోతాదులో సిస్టీన్, మరియు అమినో ఆమ్లాలు ఉండడమే. ఇవి హాంగోవర్ కారకమైన ఆసిటాల్డిహైడ్ దుష్ప్రభావాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. మరియు మద్యపానం కారణంగా శరీరంలో పెరిగే విషపదార్ధాల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా కోడిగుడ్లు సహాయపడుతాయి.

ముఖ్యంగా నాటు కోడిగుడ్లలో(ఆర్గానిక్ ఎగ్స్)హార్మోనులు, యాంటి బయాటిక్స్, క్రిమిసంహారక మందుల అవశేషాలు, రసాయనిక ఎరువుల అవశేషాలు ఉండవు. కావున యు.ఎస్.డి.ఏ నేషనల్ ఆర్గానిక్ ప్రోగ్రాం స్టాండర్డ్స్ ప్రకారం నాటు కోడిగుడ్లు బలవర్ధకమైనవి.

కోడిగుడ్డు గురించి మీరు తెలుసుకోవలసిన ఆసక్తికర అంశాలు ఇవే

గుడ్డు పచ్చసొన మెదడు ఎదుగుదలలో దోహదపడుతుంది:

అత్యధికులు పచ్చసొనలో ప్రొటీన్ నిక్షేపాలు అధికంగా ఉంటాయని, తద్వారా శరీరంలో క్రొవ్వు పేర్కొంటుంది అని తినడమే మానేస్తారు. ఏది ఏమైనా సరైన అవగాహన, వైద్యుని పర్యవేక్షణ లేకుండా చేసే ఇలాంటి చర్యల వలన శరీరానికి కావలసిన పోషకాలను చేతులారా నేలపాలు చేసిన వారిమి అవుతాము. ముఖ్యంగా ఈ పచ్చసొన లో విటమిన్-బి నిక్షేపాలు అధికంగా ఉంటాయి. వీటిని కొలిన్ అని పిలుస్తారు కూడా. ఈ కొలిన్, మెదడులో నరాల పనితీరుని పెంపొందించడంలో సహాయం చేస్తుంది, మరియు మంటను తగ్గించే గుణాలు కూడా అధికంగా ఉంటాయి. గర్భస్థ పిండం మెదడు అభివృద్దిలో కూడా ఈ కొలిన్ ఎంతో సహాయం చేస్తుంది. కావున గర్భిణీలు ఆహారప్రణాళికలో భాగంగా కోడిగుడ్డును తప్పనిసరిగా తీసుకోవలసి ఉంటుందని వైద్యులు సూచిస్తుంటారు.

ఈ కొలిన్ శరీరంలో బీతేన్ ప్రభావాన్ని తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది. తద్వారా హాపీ హార్మోన్స్ అయిన సెరటానిన్, డోపమైన్ మరియు నోరెఫిన్ఫ్రైన్ మొతాదులను పెంచడంలో సహాయం చేస్తుంది.

కోడిగుడ్లు మంచి ప్రొటీన్ నిక్షేపాలు:

ప్రొటీన్ గురించి మాట్లాడాలి అంటే కోడిగుడ్లు అన్నిటికన్నా ప్రధమ స్థానాన్ని ఆక్రమిస్తాయి అనడంలో ఆశ్చర్యం లేదు. కోడిగుడ్డులో ఉన్న ప్రొటీన్ నిక్షేపాలన్నింటినీ శరీరం సంగ్రహించగలదు కూడా. అత్యధిక నాణ్యత కలిగిన ప్రొటీన్ ఉండడమే కాకుండా, ఈ కోడిగుడ్లలో పుష్కలంగా రోగనిరోధక శక్తి తత్వాలు, విటమిన్-ఎ, విటమిన్-బి12, విటమిన్-డి, రిబోఫ్లోవిన్, ఫోలేట్, ఫాస్ఫరస్ మరియు కొలిన్ కూడా అధికంగా ఉంటాయి. బాగా ఉడకబెట్టిన కోడిగుడ్డులో అత్యధికంగా 6గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. రోజూవారి ఆహారప్రణాళికలో తీసుకోవడం మూలంగా, పోషక విభాగంలో భాగంగా 14 శాతం స్త్రీలలో ప్రొటీన్ ఇవ్వగలిగితే, 11 శాతం పురుషులకి అందివ్వగలదు.

బరువు నియంత్రణలో భాగంగా:

మీ ఆహారప్రణాళికలలో భాగంగా కోడిగుడ్డును కూడా జతచేయడం మూలంగా, మీ బరువును సైతం సముపాళ్ళలో నియంత్రిoచుకోగలరని మీకు తెలుసా. దీనికి కారణం కోడిగుడ్లలోని ప్రొటీన్, మీ కడుపును నిండుగా చేసి ఆకలి లేకుండా చూడడంలో సహాయం చేస్తుంది. బరువును తగ్గించే ప్రక్రియలో భాగంగా కండరాల దృడత్వం కోల్పోకుండా సహాయం చేస్తుంది. ఒక పెద్ద కోడిగుడ్డులో అధికంగా 70కాలరీలు, 6గ్రాముల ప్రొటీన్ నిక్షేపాలు ఉంటాయి. తక్కువ కాలరీల ప్రొటీన్ ఆహార పదార్ధానికి కోడిగుడ్డు మంచి ఆహారంగా ఉంటుంది. బరువు తగ్గాలన్న ఆలోచన చేయువారికి అతి ముఖ్యమైన ఆహారంగా సూచించబడినది.

మంచి వ్యాయామ ఆహార పదార్ధం:

వ్యాయామం తర్వాత శరీరానికి కావలసిన ప్రొటీన్ అందించడం అత్యవసరం. తద్వారా కండరాలు తిరిగి ధృడంగా నిర్మింపబడడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. మరియు ఈ ప్రొటీన్, ఆరోగ్యకర అమినోఆమ్లాల తయారీకి సహాయం చేస్తుంది. మీ ఆహారప్రణాళికలో భాగంగా ఎలాగైనా కోడిగుడ్డును తీసుకునే వీలుంది. స్నాక్స్, భోజనం, వ్యాయామం తర్వాత స్నాక్ , లేదా తాజాపండ్లతో కలిపి కూడా తీసుకోవచ్చని సూచించడమైనది.

విటమిన్-డి కి చక్కటి ప్రత్యామ్నాయం:

నిజానికి విటమిన్-డి శరీరానికి సహజ సిద్దంగా సూర్యకాంతి నుండి లభిస్తుంది. అదే విధంగా కొన్నిప్రత్యేకమైన ఆహారపదార్ధాలు తీసుకోవడం మూలంగా కూడా, విటమిన్-డి ని పొందవచ్చు. కోడిగుడ్లు అత్యధిక మోతాదులో విటమిన్-డి కలిగిన సహజ సిద్దమైన ఆహార పదార్ధంగా ఉన్నది. రోజూవారీ ఆహారప్రణాళికలో భాగంగా కోడిగుడ్లను తీసుకోవడం ద్వారా విటమిన్-డి లోపాన్ని నివారించవచ్చు. సూర్యకాంతిని తక్కువగా సంగ్రహిస్తున్న వారు, ఆహారపదార్ధాల ద్వారా అయినా విటమిన్-డి తీసుకోవలసి ఉంటుంది. ఒక పెద్ద కోడిగుడ్డులో 41 అంతర్జాతీయ యూనిట్ల విటమిన్-డి ఉంటుంది, ఈ విటమిన్-డి రోజూవారి ఆహారప్రణాళికలో 10శాతం విటమిన్-డి ని అందించగలదు.

కోడిగుడ్డు రంగు పోషకాల ప్రమాణo కాదు:

అనేకమంది గోధుమ రంగు కోడిగుడ్లు, తెలుపు కోడిగుడ్లకన్నా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయని నమ్ముతుంటారు, కానీ ఈ రంగు పెంకులు పోషకాలను నిర్దేశించవని గమనించాలి. లోపల ఉన్న పచ్చసొన రంగు మాత్రం, కోడికి ఇచ్చిన ఆహార పదార్దాలమీద ఆధారపడి ఉంటుంది. కానీ పోషకాల మీద మాత్రం ప్రభావాన్ని చూపవని పరిశోధనల్లో తేలిన నిజం. కానీ విటమిన్-ఎ మరియు ల్యూటన్ విలువలలో మాత్రం స్వల్పతేడాలు ఉండవచ్చు. ఏది ఏమైనా లోపల ఉండే పదార్ధాలకు, పెంకు రంగుకి సంబంధం లేదు. రంగుతో సంబంధంలేకుండా పచ్చసొనలో విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకర క్రొవ్వులు ఉండగా తెల్లసొనలో రిబోఫ్లోవిన్, మరియు ప్రొటీన్ స్థాయిలు అధికంగా ఉంటాయి.

తాజా కోడిగుడ్లు అన్నిటికన్నా శ్రేష్టం:

మీకు తెలుసా, కోడిగుడ్లు రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచినా కూడా, కొన్న ౩౦రోజుల్లో వినియోగించాలని? గది ఉష్ణోగ్రత వద్ద త్వరగా వయసు మీరిపోయే లక్షణాలు కోడిగుడ్లలో ఉంటాయి. కావున వీటిని ఎక్కువ కాలం అలాగే ఉంచకుండా, ఎప్పటికప్పుడు తినెయ్యడమే మంచిది.

కోడిగుడ్డులోని క్రొవ్వు పదార్ధాలు:

ఒక పెద్ద కోడిగుడ్డులో గరిష్టంగా 1.5గ్రాముల సంతృప్త క్రొవ్వులు ఉంటాయి, మరియు 1గ్రాము బహుళ అసంతృప్త క్రొవ్వులు, 1.8గ్రాముల అసంతృప్త క్రొవ్వుల నిక్షేపాలు ఉంటాయి. కొన్ని కోడిగుడ్లలో ఒమేగా3 వంటి ఆరోగ్యకర క్రొవ్వుల నిక్షేపాలు కూడా ఉంటాయి. దీనికి కారణం, కోళ్ళకు అవిసెగింజల వంటి ఆహారపదార్ధాలను అందివ్వడమే.

ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్స్, డోకోసహెక్సేనోయిక్ అమ్లాలుగా మారడం వలన రెండురకాల ఆరోగ్యకర క్రొవ్వు పదార్ధాలు పచ్చసొనలో ఉంటాయి.

సమతుల్య ఆహారప్రణాళిక అవసరం:

శరీరానికి కేవలం కోడిగుడ్లు మాత్రమే తీసుకుంటే సరిపోదు, కోడిగుడ్లతో పాటు ఆరోగ్యకర క్రొవ్వులు కలిగిన చేపలు, లెగ్యూమ్స్ వంటివి కూడా ఆహారప్రణాళికలో భాగంగా చేర్చాలి. తృణధాన్యాలు, తాజాపండ్లు, కూరగాయలు, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు, డ్రైఫ్రూట్స్ మొదలైన వాటి ద్వారా శరీరానికి కావలసిన అన్నిరకాల పోషకాలను అందివ్వగలుగుతాము.

English summary

10 Amazing Facts You Didn't Know About Eggs

Eggs are a protein-packed, nutrient-rich and affordable breakfast food options that aid in keeping you fit and healthy. They are a delicious way to get a good dose of B vitamins, nutrients and protein. In this article, you will learn about the amazing facts you didn't know about eggs.
Story first published: Tuesday, May 1, 2018, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more