నిద్రకు ఉపక్రమించేముందు తేనెను తీసుకోవడం వలన కలిగే లాభాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ప్రాచీన సాంప్రదాయాల ప్రకారం, నిద్రకు ఉపక్రమించేముందు గోరువెచ్చని పాలలో, తేనెను కలిపి తీసుకోవడం వలన అనేక ఆరోగ్యకర లాభాలున్నాయని విశ్వసిస్తారు. ముఖ్యంగా ముడి సేంద్రీయ తేనెను తీసుకోవడాన్ని సూచిస్తారు. ఆ ఆరోగ్య ప్రయోజనాల గురించిన వివరాలు ఈ వ్యాసంలో పొందుపరచబడ్డాయి.

ప్రాచీన కాలం నుండి తేనెను అనేక సహజసిద్ద ఔషదాలలో వినియోగించడం పరిపాటి. తేనెలో రోగ నిరోధక శక్తి మరియు మంటను తగ్గించే లక్షణాలను(anti-inflammatory) కలిగి ఉండడమే దీనికి కారణం. గాయాల నివారణకు సైతం తేనెను వినియోగించేవారంటే నమ్మశక్యంగా లేదు కదూ. దీనిలో ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగే సహజ సిద్ద లక్షణాలు ఉండడo వలనే అనేక రోగాలకై చికిత్స కోసం తేనెని వినియోగిస్తుంటారు.

తేనెని మధుమేహ వ్యతిరేకిగా కూడా వ్యవహరిస్తారు, ఇది రక్తంలోని గ్లూకోసు నిల్వలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరియు కఫము, జలుబు వంటి రోగాలకు నివారిణిగా కూడా పని చేస్తుంది. ఎగువ శ్వాసనాళ అంటువ్యాధుల చికిత్సకు కూడా తేనెని వినియోగించవచ్చు.అన్ని అద్భుతమైన లక్షణాలు తేనె సొంతం.

నిద్ర కలిగించే హార్మోన్ విడుదల:

నిద్ర కలిగించే హార్మోన్ విడుదల:

ఇన్సులిన్ హెచ్చుతగ్గులను నిర్వహించుటలో తేనె ప్రత్యేకంగా పని చేస్తుంది. నిద్ర వేళకు ముందు తేనె ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపరచబడి తద్వారా మెదడులోని ట్రిప్టోఫాన్ ఉద్దీపనగావించి హార్మోన్ విడుదలలో సహాయం చేస్తుంది. ట్రిప్టోఫాన్ నెమ్మదిగా సెరోటోనిన్ గా మార్చబడుతుంది. ఇది మానసిక స్థాయిలను నిర్వహించే మంచి హార్మోన్. తద్వారా మంచి నిద్రను ఇవ్వగలుగుతుంది.

కాలేయo పని తీరు పెంచుటలో:

కాలేయo పని తీరు పెంచుటలో:

కాలేయం రాత్రివేళల యందు గ్లూకోస్ విడుదల చేయడానికి తేనె ఎంతగానో సహకరిస్తుంది. ఈ గ్లూకోస్ కొవ్వును హరించే హార్మోన్ల విడుదలకు సహాయపడుతుంది. తేనెలో ముఖ్యంగా ఫ్రక్టోస్ మరియు గ్లూకోస్ ఉంటాయి. ఇవి ముఖ్యంగా కాలేయం పని తీరును పెంచుటలో పని చేస్తాయి.

దగ్గు – జలుబు కు మంచి ఔషదం గా పని చేస్తుంది:

దగ్గు – జలుబు కు మంచి ఔషదం గా పని చేస్తుంది:

రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించే ముందు తేనెను తీసుకోవడం ద్వారా సగం రాత్రిలో దగ్గువలన నిద్రలేమి లేకుండా చూసుకోవచ్చును. నిజానికి ప్రాచీన కాలం నుండి జలుబు, మరియు దగ్గుకు తేనెని ప్రత్యేకమైన ఔషదం గా ఉపయోగిస్తూ ఉండడం పరిపాటి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు దగ్గు తగ్గించడం లో కీలకపాత్ర పోషిస్తాయి.

జీర్ణక్రియ పనితీరు పెంపునకు:

జీర్ణక్రియ పనితీరు పెంపునకు:

నిద్రకు ముందు వెచ్చని నీటితో కానీ పాలతో కానీ తేనెను తీసుకోవడం ద్వారా శరీరంలో ఉండే విష తుల్య రసాయనాలు బయటకు పంపివేయుటలో కీలక పాత్ర పోషించడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. ముఖ్యంగా తేనెలో ఉండే యాంటీమోక్రోబియాల్ ఏజెంట్లు హానికర బాక్టీరియాని చంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నిద్ర మద్యలో ఆకలి లేకుండా:

నిద్ర మద్యలో ఆకలి లేకుండా:

ఒక్కోసారి రాత్రి భోజనం చేసినా కూడా, సగం రాత్రిలో ఆకలితో నిద్ర లేచే సందర్భాలు ఉంటాయి. ఇది చాలమందికి సర్వ సాధారణంగా ఉంటుంది. కానీ తేనెను ఒక స్పూన్ నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు అని మన పెద్దలు చెప్తుంటారు. తేనె లో ఉండే సహజ చక్కెర మీ రక్తంలో చక్కెర స్థాయిల సమతుల్యానికి సహాయం చేస్తుంది .

ఆరోగ్యకరమైన చర్మం విషయంలో :

ఆరోగ్యకరమైన చర్మం విషయంలో :

తేనెలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వలన చర్మంపై ప్రతికూల ప్రభావాలను కలగజేసే బాక్టీరియాను సంహరించడంలో సహాయం చేస్తుంది. తద్వారా చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. ఫేస్ పాక్ లలో కూడా తేనెని వినియోగిస్తారు.

మధుమేహం ప్రమాదం తగ్గిస్తుంది:

మధుమేహం ప్రమాదం తగ్గిస్తుంది:

రక్తంలో గ్లూకోస్ హెచ్చుతగ్గులను నియంత్రించడం ద్వారా శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ను తేనె ఉత్పత్తి చేయగలుగుతుంది. తద్వారా శరీరానికి మదుమేహ ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది:

రోగనిరోధక వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది:

తేనెలో ఉండే అనామ్లజనకాల మూలంగా శరీరానికి రోగనిరోధక వ్యవస్థను పెంచుటలో సానుకూల ఫలితాలు చూపిస్తుంది. తద్వారా అనేక వ్యాధులు రాకుండా ముందుగానే అడ్డుకోవడం లేదా ఉన్న వ్యాధులకు చికిత్స గా ఉపయోగపడడం చేస్తుంది. రోజూ వారీ ఆహారంలో తేనెను తీసుకోవడం ద్వారా శరీరం అనేక ఒడిదుడుకులను సైతం తట్టుకునే విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది.

English summary

10 Health Benefits Of Having Honey Before Bed

Honey has been used as a natural medicine since ages. It contains natural anti-bacterial agents and it has wound-healing and anti-inflammatory properties. The health benefits of having honey before bed are it induces sleep hormones, helps in weight loss, aids in proper functioning of the liver, good for midnight hunger pangs, etc.
Story first published: Wednesday, March 28, 2018, 20:00 [IST]