పనస విత్తనాల ద్వారా కలిగే 10 మైండ్ బ్లోయింగ్ హెల్త్ బెనిఫిట్స్

By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

పనసపండు అతి పెద్ద పండ్లలో ఒకటి. ఇది ఏషియాలోనే ప్రసిద్ధి చెందిన ట్రాపికల్ ఫ్రూట్. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే, విటమిన్ బి, పొటాషియం, కేల్షియం అలాగే జింక్ కూడా ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. ఈ రుచికరమైన పండుని అలాగే తినవచ్చు లేదా వండుకుని తినవచ్చు.

అయితే, పనసపండుని తిని చాలా మంది పనసవిత్తనాలని మాత్రం పారేస్తారు. అయితే, వీటి ద్వారా కూడా అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చన్న విషయం మీకు తెలుసా? రైబోఫ్లేవిన్ మరియు థియామిన్ అనే పోషకాలు పనసవిత్తనాలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు ఉపయోగపడతాయి. కళ్ళను, చర్మాన్ని అలాగే శిరోజాలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పోషకాలు ఉపయోగపడతాయి.

10 Mind-blowing Health Benefits Of Jackfruit Seeds

పనస విత్తనాలలో చిన్నమొత్తంలో మెగ్నీషియం, జింక్, పొటాషియం, ఐరన్, కేల్షియం అలాగే కాపర్ వంటి మినరల్స్ కలవు. అలాగే ఆహారం ద్వారా సంభవించే అనారోగ్య సమస్యలకు దారితీసే బాక్టీరియల్ కంటామినేషన్ ను అరికట్టే యాంటీ మైక్రోబయాల్ కాంపౌండ్స్ అనేవి ఇందులో లభిస్తాయి.

కాబట్టి, పనసవిత్తనాల ద్వారా కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ ను చదవండి.

1. ప్రోటీన్లో అధికం:

1. ప్రోటీన్లో అధికం:

పనసవిత్తనాలలో ప్రోటీన్లు అధికమని చాలా మందికి తెలియదు. పనసవిత్తనాలతో వివిధ వంటకాలను తయారుచేసుకోవచ్చు. కండరాలను బిల్డ్ చేయడానికి, అలాగే మెటబాలిజంను మెరుగుపరిచేందుకు ఇందులో లభించే పోషకాలు ఉపయోగపడతాయి.

2. అజీర్ణాన్ని నిరోధిస్తుంది:

2. అజీర్ణాన్ని నిరోధిస్తుంది:

పనసవిత్తనాలలో లభించే పోషకాలు అజీర్ణాన్ని నిరోధిస్తాయి. ఈ పోషకాలకు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే సామర్థ్యం కలదు. ఫైబర్ అనేది పనసవిత్తనాలలో సమృద్ధిగా లభిస్తుంది. అందువలన, డైజెషన్ ప్రాసెస్ మెరుగవుతుంది. అలాగే, కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.

3. కంటిచూపును మెరుగుపరుస్తుంది:

3. కంటిచూపును మెరుగుపరుస్తుంది:

పనసవిత్తనాలలో విటమిన్ ఏ అధికంగా లభిస్తుంది. ఇది మంచి కంటిచూపును మెయింటైన్ చేసేందుకు తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన కంటిచూపు కోసం విటమిన్ ఏ అవసరమవుతుంది. తద్వారా, రేచీకటి వంటి అనేక కంటి సమస్యలను అరికట్టవచ్చు.

4. అనీమియాను అరికడుతుంది:

4. అనీమియాను అరికడుతుంది:

పనసవిత్తనాలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు తీసుకోవడం ద్వారా శరీరంలోని ఐరన్ కంటెంట్ ను పెంపొందించుకోవచ్చు. ఈ విత్తనాలలో ఐరన్ అనేది ఎక్కువ మోతాదులో లభ్యమవుతుంది. హెమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారు దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అనీమియాతో మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే పనసవిత్తనాలను తీసుకోండి. తద్వారా, అనీమియాని తగ్గించుకోండి. అలాగే ఇతర బ్లడ్ రిలేటెడ్ సమస్యల నుంచి కూడా రక్షణని అందించేందుకు పనస విత్తనాలు తోడ్పడతాయి.

5. మానసిక రుగ్మతలను తగ్గిస్తుంది:

5. మానసిక రుగ్మతలను తగ్గిస్తుంది:

పనసవిత్తనాలలో మానసిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఉపయోగపడే మైక్రో న్యూట్రియెంట్స్ అలాగే ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. మానసిక ఒత్తిడితో మీరు సతమతమయితే పనసవిత్తనాలను తరచూ తీసుకోవడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. మానసిక సమస్యలను దూరంపెట్టేందుకు పనసవిత్తనాలలో లభించే పోషకాలు అమితంగా తోడ్పడతాయి.

6. మలబద్దకాన్ని అరికడుతుంది:

6. మలబద్దకాన్ని అరికడుతుంది:

పనసవిత్తనాలలో ఇంసాల్యుబుల్ ఫైబర్ లభ్యమవుతుంది. అందువలన మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే, ఈ విత్తనాలతో లభించే ఫైబర్ కంటెంట్ అనేది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి జీర్ణసమయాన్ని పెంపొందిస్తుంది. ఆ విధంగా కొలోన్ ని డిటాక్సిఫై చేస్తుంది.

7. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

7. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

పనసవిత్తనాలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే గుణాలు కలవు. యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలిగి ఉండటం చేత బాక్టీరియల్ కంటామినేషన్ ని అరికడుతుంది. పనసవిత్తనాలలో జింక్ లభ్యమవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది.

8. క్యాన్సర్ ని అరికడుతుంది:

8. క్యాన్సర్ ని అరికడుతుంది:

పనసవిత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి డిఎన్ఏ సెల్స్ ని డేమేజ్ చేసి కాన్సర్ సెల్స్ ని ఉత్పత్తి చేస్తాయి. పనసవిత్తనాలలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి శరీరాన్ని ఫ్రీ రాడికల్ డేమేజ్ నుంచి రక్షిస్తాయి. పనస విత్తనాలలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీలు కలవు. ఇవి శరీరంలోని సెల్స్ డీజెనెరేషన్ ని తగ్గిస్తాయి.

9. ఎముకలను బలపరుస్తుంది:

9. ఎముకలను బలపరుస్తుంది:

పనసవిత్తనాలలో లభించే కేల్షియం అనేది ఎముకల ఆరోగ్యాన్నిసంరక్షించడానికి ఉపయోగపడుతుంది. పనసవిత్తనాలలో పొటాషియం లభిస్తుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. అందువలన, కండరాలను బిల్డ్ చేసుకునేందుకు పనసవిత్తనాలను మీ డైట్ లో భాగంగా చేసుకుని ఎముకలను బలంగా ఉంచుకోండి.

10. గుండె జబ్బులను తగ్గించుకోండి:

10. గుండె జబ్బులను తగ్గించుకోండి:

పనసవిత్తనాలు హార్ట్ పేషంట్స్ కు ఎంతో మంచి చేస్తాయి. ఈ విత్తనాలతో కొలెస్ట్రాల్ అనేది సున్నా. అందువలన బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచి గుండెకు సంబంధించిన హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి వ్యాధులను అరికట్టడంలో పనసవిత్తనాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

English summary

10 Mind-blowing Health Benefits Of Jackfruit Seeds

10 Mind-blowing Health Benefits Of Jackfruit Seeds,Jackfruit seeds have a lot of health benefits and they are rich in thiamine and riboflavin that favours our overall health. Know more about the health benefits of jackfruit seeds here.
Story first published: Wednesday, February 7, 2018, 17:00 [IST]
Subscribe Newsletter