మీకు తక్షణశక్తినందించే 12 ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

రోజువారీ సాధారణ పనులకే మీరు త్వరగా అలసటకు గురవుతున్నారా? అయితే, మీకు కావలసినంత శక్తి లేదు. శరీరం యొక్క అంతర్గత పనులకు అంటే బాడీ టిష్యూలను మరియు సెల్స్ యొక్క నిర్మాణానికి అలాగే మెయింటైన్ చేసేందుకు, అంతర్గత మరమ్మత్తులకు శరీరానికి శక్తి అవసరపడుతుంది.

అలాగే, కొన్ని యాక్టివిటీస్ ద్వారా ప్రపంచంతో ఇంటరాక్ట్ అవడానికి కూడా శక్తి అవసరం. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారం, ఒక రోజులో ఒక వ్యక్తికి దాదాపు 1800 కిలోకేలరీల సగటు కనీస శక్తి అవసరపడుతుంది.

ఎనర్జీ లెవెల్స్ అనేవి అధికంగా ఉండాలంటే భోజనాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఆహారంలో మీరు భాగంగా చేసుకునే పదార్థాలనేవి మీకు రోజువారీ అవసరమయ్యే ఎనర్జీ లెవెల్స్ ని అందించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మరియు ఫైబర్ అనేవి మీకు తక్షణ శక్తిని అందించేందుకు తోడ్పడతాయి.

తక్షణ శక్తిని అందించే ఈ 12 ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల గురించి తెలుసుకుందాం.

1. ష్రిమ్ప్:

1. ష్రిమ్ప్:

విటమిన్ బి12 అనేది ష్రిమ్ప్ లో సమృద్ధిగా లభిస్తుంది. అలాగే కేలరీలు ఇందులో తక్కువగా లభిస్తాయి. మీ మెటబాలిజం ను సరిచేసి శక్తిని పెంపొందించేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ జలచరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. మీ శక్తిని అలాగే మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ఇవి ఉపయోగపడతాయి.2. తాజా పండ్లు

స్ట్రాబెర్రీస్, అరటిపండ్లు, బ్లూబెర్రీస్ వంటి పండ్లలో సహజసిద్ధంగా చక్కెర లభిస్తుంది. ఇది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఇందులో లభించే ఫైబర్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ ని స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది. పెరుగుని అలాగే పండ్లని కలిపి బ్రేక్ ఫాస్ట్ స్మూతీని తయారుచేసుకోవచ్చు. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.

3. నట్స్

3. నట్స్

జీడిపప్పు, బాదాం, వాల్నట్ మరియు హేజెల్ నట్స్ లో మెగ్నీషియం అధికమోతాదులో లభిస్తుంది. చక్కెరను శక్తిగా మార్చడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాక, నట్స్ లో ఫైబర్ అనేది అధికమొత్తంలో లభిస్తుంది. అందువలన, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి స్థిరంగా ఉంటాయి. అలాగే, వీటిలో లభించే ప్రోటీన్స్ మీ హంగర్ ప్యాంగ్స్ ని తరిమికొడతాయి.

4. హుమ్మ్యూస్

4. హుమ్మ్యూస్

నువ్వుల గింజల పేస్ట్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం అలాగే ముద్ద చేయబడిన శెనగలతో హుమ్మ్యూస్ ని తయారుచేయవచ్చు. శెనగలని మెయిన్ ఇంగ్రిడియెంట్ గా వాడతారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మరియు ఫ్యాట్ కలిగి ఉంటాయి. అందువలన, ఈ పదార్థాన్ని తీసుకోవడం వలన తక్షణ శక్తి లభిస్తుంది.

5. పెరుగు

5. పెరుగు

పెరుగుని తీసుకోవడం వలన తక్షణ శక్తిని పొందవచ్చు. ఇందులో లభించే లాక్టోస్ శక్తిని పెంపొందిస్తుంది. అలాగే, పెరుగులో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ఇది లాక్టోస్ గ్రహింపుని నెమ్మది చేయడం ద్వారా శక్తి ఎక్కువ సేపు ఉండేలా తోడ్పడుతుంది.

6. ఎగ్స్

6. ఎగ్స్

చాలామందికి బ్రేక్ ఫాస్ట్ లో ఎగ్స్ ని తీసుకోవటమంటే ఇష్టం. వీటిలో ప్రోటీన్ అనేది అధికంగా లభిస్తుంది. అలాగే ఇందులో లభించే హార్ట్ హెల్తీ మోనో అన్ సాట్యురేటెడ్ మరియు పోలీ అన్ సాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీ ఆకలిని తీరుస్తాయి. తద్వారా, తక్షణ శక్తిని అందిస్తాయి.

7. చియా సీడ్స్

7. చియా సీడ్స్

ప్రోటీన్స్, ఫ్యాట్స్ మరియు ఫైబర్ అనేవి చియా సీడ్స్ లో పుష్కలంగా లభిస్తాయి. ఈ సీడ్స్ అనేవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని నియంత్రిస్తాయి. స్మూతీస్ లో వీటిని వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది. వీటిని తీసుకోవడం వలన మితిమీరి తినే అలవాటు తగ్గుతుంది. ఎందుకంటే, ఇవి మీకు కడుపు నిండిన భావనని కలిగిస్తాయి.

8. గుమ్మడికాయ గింజలు

8. గుమ్మడికాయ గింజలు

ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్ మరియు ప్రోటీన్లు గుమ్మడికాయ గింజలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ ఆకలిని తీర్చి మీకు తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే, వీటిలో లభించే మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు జింక్ అనేవి అదనపు శక్తిని అందించేందుకు తోడ్పడతాయి.

9. డార్క్ చాకొలేట్

9. డార్క్ చాకొలేట్

డార్క్ చాకొలేట్ ని తీసుకోవడం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులో లభించే థియోబ్రొమైన్ అనే సహజ సిద్ధమైన స్టిములంట్ వలన మీకు తక్షణ శక్తి అందుతుంది. మీ మానసిక స్థితి కూడా మెరుగవుతుంది. చాకోలెట్ లో 60 శాతం కోకో కలిగి ఉంటుంది. చురుకుదనంతో పాటు ఏకాగ్రతను పెంపొందించేందుకు డార్క్ చాకొలేట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

10. ఓట్ మీల్

10. ఓట్ మీల్

శరీరానికి తక్షణ శక్తినందించే కాంప్లెక్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఓట్ మీల్ లో పుష్కలంగా లభిస్తాయి. దీనిని తీసుకోవటం ద్వారా ఎక్కువ సేపు శక్తి కలిగి ఉంటుంది. ఇందులో లభించే థియామైన్, ఫోలేట్, నియాసిన్ అనే బి విటమిన్స్ అనేవి కలిసికట్టుగా పనిచేసి మీ శరీరంలో మెటబాలిజం వ్యవస్థను పటిష్టం చేస్తాయి.

11. ఆపిల్స్

11. ఆపిల్స్

ఆపిల్స్ లో ఫైబర్ తో పాటు శరీరానికి అవసరమయ్యే విటమిన్లు అలాగే మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాక, ఫైబర్ అనేది జీర్ణమవటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆపిల్ అనేది మీకు తక్షణ శక్తిని అందిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో గాని స్నాక్స్ లో గాని ఆపిల్స్ ని తీసుకోవడం ద్వారా శక్తిని పెంపొందించుకోండి.

12. క్వినో

12. క్వినో

ప్రోటీన్లతో పాటు అమినో యాసిడ్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందువలన, రోజు మధ్యలో శక్తిని పెంపొందించే ఆహారంగా వీటిని పరిగణించవచ్చు. ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు మాంగనీస్ అనేవి క్వినోలో సమృద్ధిగా లభిస్తాయి. అందువలన, ఇది పోషకవిలువలు నిలయమని చెప్పుకోవచ్చు. ఎక్కువసేపు శక్తిగా ఉంచేలా ఈ పదార్థం ఉపయోగపడుతుంది.

ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే, దీనిని షేర్ చేయడం మరచిపోకండి.

English summary

12 Healthy Foods That Give You Energy To Boost You Up Instantly

The average minimum energy requirement per person, per day, is about 1800 kcal. Energy is required to fuel your body's internal functions, repairs, builds and maintain cells and body tissues. To keep your energy levels high, it is really important to never skip meals. The type of foods that you eat play an important role in your daily energy levels.
Story first published: Thursday, January 18, 2018, 14:00 [IST]