బటర్ నట్ స్క్వాష్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

బటర్ నట్ స్క్వాష్ అనే వెజిటబుల్ లో పోషక విలువలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో లభించే పోషక విలువల వలన ఈ వెజిటబుల్ హెల్త్ కాన్షియస్ కల్గిన వారికి ఫెవరెట్ వెజిటబుల్ గా మారింది. ఆ హెల్త్ బెనిఫిట్స్ గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం. స్క్వాష్ అనేది పేల్ బ్రౌన్ లేదా యెల్లో స్కిన్ కలిగి ఉంటుంది. లోపల నట్టీ ఫ్లేవర్ తో కూడిన ఆరెంజ్ ఫ్లెష్ ఉంటుంది.

బటర్ నట్ స్క్వాష్ ను వివిధ దేశాలలో అనేక రకాల వంటకాల తయారీలో వాడతారు. బటర్ నట్ స్క్వాష్ తో రుచికరమైన వంటకాలను తయారుచేసుకోవచ్చు. అంతేకాక, ఈ వెజిటబుల్ లో లభించే పోషకాలనేవి ఈ వెజిటబుల్ ను పాపులర్ చేస్తున్నాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, డైటరీ ఫైబర్, ప్రోటీన్, జింక్, ఫోలేట్ మరియు పొటాషియం ఇందులో పుష్కలంగా లభిస్తాయి.

10 Interesting Facts About Butternut Squash

బటర్ నట్ స్క్వాష్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

కీలకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ వెజిటబుల్ లో లభిస్తాయి. కాబట్టి, ఈ వెజిటబుల్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ప్రకారం, 205 గ్రాముల వండిన బటర్ నట్ స్క్వాష్ లో దాదాపు 82 కేలరీలు, 1.8 గ్రాముల ప్రోటీన్, 0.18 గ్రాముల ఫ్యాట్ తో పాటు 21.50 గ్రాముల కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి.

ఒక కప్పుడు క్యూబ్డ్ బటర్ నట్ స్క్వాష్ లో దాదాపు 582 మిల్లీగ్రాముల పొటాషియం లభిస్తుంది. అరటిపండులో లభించే పొటాషియం మోతాదు కంటే ఇది ఎక్కువ.

ఇప్పుడు బటర్ నట్ స్క్వాష్ కి సంబంధించిన ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం..

1. హై బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడానికి అలాగే అరికట్టడానికి తోడ్పడుతుంది.

1. హై బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడానికి అలాగే అరికట్టడానికి తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యానికి సంబంధించి బ్లడ్ ప్రెషర్ ను స్టేబుల్ గా ఉంచుకోవడం ముఖ్యమన్న విషయం తెలిసిందే. బటర్ నట్ స్క్వాష్ లో పొటాషియం ఎక్కువ స్థాయిలో లభిస్తుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడానికి తోడ్పడుతుంది. బ్లడ్ ప్రెషర్ ను పెరగకుండా అరికట్టుతుంది. పొటాషియం అనేది వేసోడిలేటర్ గా పనిచేస్తుంది. తద్వారా, బ్లడ్ వేసిల్స్ అలాగే ఆర్టెరీస్ పై ఒత్తిడి తగ్గుతుంది. దానివలన, హార్ట్ ఎటాక్ కి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అలాగే అథెరోస్క్లేరోసిస్, స్ట్రోక్ తో పాటు ఇతర కార్డియో వాస్క్యులార్ వ్యాధులు కూడా దరిచేరవు.

2. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

2. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

బటర్ నట్ స్క్వాష్ లో ఉండే ఆరెంజ్ కలర్ అనేది విటమిన్ ఏ ఈ వెజిటబుల్ లో ఎక్కువగా లభిస్తుందని తెలియచేస్తుంది. బటర్ నట్ స్క్వాష్ లో బీటా కెరోటిన్, అల్ఫా కెరోటీన్, ల్యూటెయిన్ మరియు జిగ్జాంథిన్ వంటి నాలుగు రకాల కెరోటినాయిడ్స్ లభ్యమవుతాయి. ల్యూటిన్, జిగ్జాంథిన్ వంటివి రెటినాపై పడే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడానికి అలాగే మ్యాక్యులర్ డిజెనెరేషన్ సమస్యను తొలగించడానికి తోడ్పడతాయి. బీటా కెరోటిన్ మరియు అల్ఫాయా కెరోటిన్ లు రెటినాల్ గా మారతాయి. అంటే, వీటిని శరీరం విటమిన్ ఏ రూపంలో వాడుకుంటుంది.

3. డైజెస్టివ్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది:

3. డైజెస్టివ్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది:

డైటరీ ఫైబర్ ఈ వెజిటబుల్ లో పుష్కలంగా లభిస్తుంది. అందువలన, జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. తద్వారా, బ్లోటింగ్ మరియు కాన్స్టిపేషన్ వంటి సమస్యలు దరిచేరవు. డైటరీ ఫైబర్ అనేది ఇంఫ్లేమేషన్ ను తగ్గించి ఇమ్యూన్ సిస్టమ్ ను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. అంటే కార్డియోవాస్క్యులార్ వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది. అంతేకాక, డయాబెటిస్, క్యాన్సర్ మరియు ఒబెసిటీ వంటి సమస్యలు కూడా దరిచేరవు.

4. బర్త్ డిఫెక్ట్స్ ను అరికడుతుంది:

4. బర్త్ డిఫెక్ట్స్ ను అరికడుతుంది:

బటర్ నట్ స్క్వాష్ లో గర్భిణీలకు అవసరమైన ముఖ్య విటమిన్లు లభిస్తాయి. న్యూరల్ ట్యూబ్ ఇష్యూల వంటి బర్త్ డిఫెక్ట్స్ ను అరికట్టేందుకు ఫోలిక్ యాసిడ్ అధిక స్థాయిలో అవసరపడుతుంది. ఫోలిక్ యాసిడ్ తో పాటు ఇతర బీ విటమిన్లు ఈ వెజిటబుల్ లో పుష్కలంగా లభించడం వలన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే, శరీరం కొత్త సెల్స్ ను ఉత్పత్తి చేసి మెయింటైన్ చేసేందుకు ఫోలిక్ యాసిడ్ అమితంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్ అనేది విటమిన్ల మోతాదులపై ఆధారపడి ఉంటుంది.

6. వెయిట్ లాస్ కి సహకరిస్తుంది:

6. వెయిట్ లాస్ కి సహకరిస్తుంది:

ఆరోగ్యకరమైన వెయిట్ ను మెయింటెయిన్ చేసేందుకు పోషకాలు పుష్కలంగా లభించే ఆహారాన్ని రోజువారీ డైట్ లో భాగంగా చేసుకోవాలి. అలాగే, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచి ఆలోచన. ఒక బటర్ నట్ స్క్వాష్ సెర్వింగ్ లో కేవలం 82 కేలరీలు మాత్రమే లభ్యమవుతాయి. అందువలన, లో కేలరీ డైట్ లో మీరు ఎక్కువ పోషకాలను తీసుకున్నవారవుతారు. తద్వారా, ఒబెసిటీకి గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఈ వెజిటబుల్ అనేది శరీరంలోని కొత్త ఫ్యాట్ సెల్స్ ను ఉత్పత్తి చేయడాన్ని అరికడుతుంది. బటర్ నట్ స్క్వాష్ లో ఫ్యాట్ ఫైటింగ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ వెయిట్ లాస్ కి ఎంతగానో సహకరిస్తాయి.

7. క్యాన్సర్ పై పోరాడుతుంది & క్యాన్సర్ ను అరికట్టుతుంది:

7. క్యాన్సర్ పై పోరాడుతుంది & క్యాన్సర్ ను అరికట్టుతుంది:

బ్లూబెర్రీస్, బ్రొకోలీ మరియు ఇతర ఆహారాలు క్యాన్సర్ ఫైటింగ్ సూపర్ ఫుడ్స్ గా ప్రాచుర్యం పొందాయి. ఈ లిస్ట్ లో బటర్ నట్ స్క్వాష్ కూడా చోటుచేసుకుంది. ఇది క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన పోషకాలను అందించి వ్యాధులపై అలాగే ఇన్ఫెక్షన్స్ పై పోరాడే సామర్థ్యాన్ని శరీరానికి కలుగచేస్తుంది. బటర్ నట్ స్క్వాష్ లో లభించే ఒక రకమైన ప్రోటీన్ అనేది మెలనోమా వంటి స్కిన్ క్యాన్సర్ సెల్స్ వృద్ధిని అడ్డుకునేందుకు తోడ్పడుతుందని తెలుస్తోంది. అంతేకాక, ఇందులో లభించే విటమిన్ సి అనేది లంగ్ మరియు ఒవేరియన్ క్యాన్సర్స్ ను ట్రీట్ చేసేందుకు తోడ్పడతాయి.

English summary

7 Interesting Facts About Butternut Squash

Butternut squash has nutrients which include a rich concentration of vitamin A, vitamin C, dietary fibre, protein, zinc, folate and potassium among many others. The interesting facts about butternut squash is that it lowers blood pressure, is good for eyes, improves bone density, aids in weight loss, fights cancer, among others.