For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందించే ఎనిమిది అద్భుతమైన కూరగాయలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని పెంపొందించే ఎనిమిది అద్భుతమైన కూరగాయలు

|

మీ రక్తం నుండి వ్యర్థ పదార్ధాలను తొలగించడానికి మరియు శరీరంలోని ద్రవ స్థాయిలను నియంత్రించడానికి మూత్రపిండాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మీ మూత్రపిండాలు మెరుగ్గా పని చేయడానికి, కొన్ని రకాల కూరగాయలను, మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

మీ మూత్రపిండాలు సరైన రీతిలో పని చేయాలంటే, కొవ్వులు, అధిక మొత్తంలో సోడియం మరియు సంతృప్త కొవ్వులను కలిగి ఉండే భారీగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను నిరోధించడం అవసరం.

8 Best Vegetables Good For Healthy Kidneys

కొన్ని కూరగాయలతో పోలిస్తే కొన్నిట్లో, మూత్రపిండాల పనితీరు మెరుగుపరిచి, శుభ్రపరచి, రక్షించే శక్తిని కలిగి ఉంటాయి.

మీ మూత్రపిండాలు మెరుగ్గా పని చేయడానికి సహకరించే కూరగాయలను గురించి తెలుసుకోవడానికి, ఈ వ్యాసాన్ని చదవండి.

1. ఎరుపు క్యాప్సికం:

1. ఎరుపు క్యాప్సికం:

ఎరుపు క్యాప్సికంలో పొటాషియం తక్కువగా ఉన్నందున, మూత్రపిండాలకు అనుకూలమైన కూరగాయగా చెప్పబడుతుంది. రక్తంలో, పొటాషియం అధిక స్థాయిలో ఉంటే, దానిని తొలగించడం మూత్రపిండాలకు కష్టతరమవుతుంది. ఇది దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుంది. ఎరుపు క్యాప్సికంలో విటమిన్ సి, ఏ మరియు బి6 వంటి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్లు మరియు ఫోలిక్ ఆమ్లం, పీచుపదార్ధం వంటి ఇతర పోషకాలు ఉంటాయి.

వీటిని మీ సలాడ్లతో కలిపి లేదా పచ్చిగా కూడా తినవచ్చు.

2. క్యాబేజీ:

2. క్యాబేజీ:

క్యాబేజీలు, మన కాలేయానికి మరియు మూత్రపిండాలకు చేటు చేసే పొటాషియం అస్సలు ఉండదు. ఈ క్రూసిఫెరా కుటుంబానికి చెందిన కూరగాయలో, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను కలిగించే ఫ్రీరాడికల్స్ కు వ్యతిరేకంగా పోరాడే ఫైటోకెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి.

క్యాబేజీల్లో పీచుపదార్ధం, విటమిన్ బి6, కే మరియు సి మరియు ఫోలిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. కనుక క్యాబేజీ మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా పేరు పొందింది.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

వెల్లుల్లిని ఆహార పదార్థాల తయారీలో ఉపయోగించవచ్చు లేదా పచ్చిగా తినవచ్చు. దీనిలోని అద్భుతమైన డయూరిటిక్ లక్షణాలు కారణంగా, ఇది మూత్రపిండాల సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందింపచేస్తుంది. డయూరిటిక్స్ మూత్రపిండాల ద్వారా, మీ శరీరంలో ఉండే అధిక సోడియం మరియు నీటిని, మూత్రవిసర్జన ద్వారా బయటకు పంపేందుకు సహాయ పడుతుంది.

వెల్లుల్లి, మూత్రపిండాలును సీసం వంటి భార లోహాల హానికరమైన ప్రభావాల నుండి కూడా కాపాడుతుంది. ఈ మసాలాదినుసుకి కూడా వాపు తగ్గించడం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం, శరీరాన్ని శుభ్రపరచడం, కొలెస్ట్రాల్ ను తగ్గించడం మరియు సహజ యాంటీబయాటిక్ గా పనిచేయడం చేస్తుంది.

4. కాలీఫ్లవర్:

4. కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్ మూత్రపిండాలకు అనుకూలంగా వుండే ఇంకొక అద్భుతమైన క్రూసిఫెరస్ కూరగాయ. ఇది మన శరీరానికి ఫోలిక్ ఆమ్లం మరియు పీచుపదార్ధం అందిస్తుంది. ఇది మూత్రపిండాలను శుభ్రపరచి, శక్తివంతంగా తయారు చేస్తుంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న వారు,ఈ పొటాషియం తక్కువగా కలిగిన కూరగాయను సేవించవచ్చు.

5. ఆస్పరాగస్:

5. ఆస్పరాగస్:

ఆస్పరాగస్ లో మూత్రపిండాల శుద్దికి అవసరం అయిన ఆస్పరాగైన్ ఉంటుంది. ఇది మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడటాన్ని నిరోధించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మూత్రపిండాల్లో కణచర్యను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

అంతేకాక, ఆస్పరాగస్ లో పీచుపదార్ధం, విటమిన్ ఎ విటమిన్ సి, విటమిన్ ఈ మరియు విటమిన్ కే సమృద్ధిగా ఉంటాయి.

6. కేల్:

6. కేల్:

కేల్ మూత్రపిండాల ఆరోగ్యానికి ఉపయోగపడే, మరొక క్రూసిఫెరస్ కూరగాయ. ఇది తక్కువ పొటాషియం ఉన్న ఆహార పదార్ధంగా పరిగణించబడుతుంది. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం, కేల్ విటమిన్ ఏ, విటమిన్ సి, కాల్షియం మరియు ఇతర ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది మూత్రపిండాలు సరైన తీరులో పనిచేయడానికి సహాయపడుతుంది

7. పాలకూర:

7. పాలకూర:

విటమిన్ ఏ సమృద్ధిగా ఉండే పాలకూర, మూత్రపిండాలు మరియు మూత్ర నాళంలోని చిన్న వడపోత గొట్టాల లైనింగ్ గా ఎపిథీలియల్ కణజాల ఉత్పత్తికి మరియు ఆరోగ్యానికి అవసరమైన ఒక అద్భుతమైన ఆకుకూర. ఈ కణజాలం స్రవించడం, శోషణ, రక్షణ, ట్రాన్సెల్యులర్ రవాణా మరియు పసిగట్టడం వంటి విధులు నిర్వహిస్తుంది.

8. బఠానీలు మరియు పచ్చని ఫ్రెంచ్ బీన్స్:

8. బఠానీలు మరియు పచ్చని ఫ్రెంచ్ బీన్స్:

ఈ రెండు ఆకుపచ్చని కూరగాయలలోనూ, పొటాషియంలో తక్కువగా ఉంటుంది మరియు పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకై పీచుపదార్ధం అవసరం. ఇది మూత్రపిండ వ్యాధులకు ప్రధాన కారణం అయిన ఊబకాయం మరియు మధుమేహాన్ని నిరోధిస్తుంది.

English summary

8 Best Vegetables Good For Healthy Kidneys

Excess amounts of sodium and saturated fats are bad for your kidneys. There are certain vegetables whose benefits stand out among others with their power to cleanse, purify, protect and improve the performance of your kidneys. These vegetables include kale, spinach, red bell pepper, cabbage, cauliflower, asparagus, peas and green beans.
Story first published:Monday, August 20, 2018, 17:25 [IST]
Desktop Bottom Promotion