For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వులనూనె యొక్క 8 ఆరోగ్య లాభాలు

By Deepthi
|

నువ్వులనూనెను నువ్వుల విత్తనాల నుంచి తీస్తారు. సెసమం ఇండికం అనేది నువ్వుల విత్తనాల శాస్త్రీయ నామం, ఈ నూనెను ప్రాచీనకాలం నుండి వాడుతున్నారు. 1500 బి.సి ప్రాచీన ఈజిప్టు కాలం నుండి నువ్వుల నూనెను నొప్పులు తగ్గించటానికి వాడేవారని తెలిసింది.

చైనాలో, 3000 ఏళ్లకి పైగా ఆహారం మరియు వైద్య అవసరాలకి నువ్వులనూనెను వాడుతున్నారు. నువ్వుల విత్తనాలు చూడటానికి సన్నగా ఉన్నా, ప్రొటీన్లు నిండుగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు,విటమిన్ ఇ, బి కాంప్లెక్స్ మరియు ఫాస్పరస్, మెగ్నీషియం,కాల్షియం వంటి ఖనిజలవణాలను కలిగిఉంటుంది.

 8 Health Benefits Of Sesame Oil

ఇది ఆరోగ్యకరమైన తినదగిన నూనెలలో ఒకటి. ఈ నూనెను వంటకి మాత్రమే కాదు వైద్యపరంగా కూడా వాడతారు. అందుకని ఆయుర్వేద చికిత్సలో విరివిగా వాడతారు.
ఇందులో ఉండే పోషక విలువల వలన, దీన్ని నూనెలకే రాణిగా భావిస్తారు. నువ్వులనూనె ఆరోగ్య లాభాలు కొన్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవేంటో చూడండి.

1.రక్తపోటును తగ్గిస్తుంది

1.రక్తపోటును తగ్గిస్తుంది

ఈ నూనె ఇతర వంటనూనెలకి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా వాడతారు, పరిశోధనల్లో కూడా రక్తపోటు స్థాయిలను ఇది తగ్గించగలదని నిరూపించబడింది. ఈ నూనెను వాడటం వలన పేషంట్లలో రక్తపోటు స్థాయిలు బాగానే తగ్గాయి. రక్తపోటును సహజంగా తగ్గించడానికి ఇది ఒక ప్రాకృతిక పదార్థం.

2.రక్తంలో చక్కెరస్థాయిని తగ్గిస్తుంది

2.రక్తంలో చక్కెరస్థాయిని తగ్గిస్తుంది

ఈ నూనెలో ఉండే మెగ్నీషియం రక్తంలో చక్కెరస్థాయిలను నియంత్రిస్తుంది. నువ్వులనూనెలో విటమిన్ ఇ ఉండి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. వివిధ అధ్యయనాలలో మధుమేహ రోగుల డైట్ లో నువ్వులనూనెను జతచేయటం వలన సానుకూల ఫలితాలు కన్పించాయని తేలింది.

3.చర్మానికి లాభాలు

3.చర్మానికి లాభాలు

నువ్వులను వాడటం వలన చర్మానికి తేమ లభిస్తుంది, మృదువుగా మారి ముడతలు నియంత్రించబడతాయి. ఈ నూనె అనేక చర్మసమస్యలను తగ్గించి, సహజ సన్ స్క్రీన్ గా కూడా వాడబడుతుంది.చర్మం ఈ నూనెను త్వరగా పీల్చుకుంటుంది,దానికి పోషణనిచ్చి, ఎండిపోవటం మరియు పగుళ్లను పోయేట్లా చేస్తుంది.

4.ఎముకలు పెరిగేలా ప్రోత్సహిస్తుంది

4.ఎముకలు పెరిగేలా ప్రోత్సహిస్తుంది

నువ్వులనూనెలో కాల్షియం ఉంటుంది, ఇది బలమైన ఎముకలు ఏర్పడటానికి చాలా ముఖ్యం. ఈ నూనెలో కాపర్, జింక్ మరియు మెగ్నీషియం ఉంటాయి, ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యం. ఈ నూనెను అనేక ఆయుర్వేద ఎముకల నిర్మాణ మసాజుల్లో విరివిగా వాడతారు. ఈ నూనె చర్మంలో లోపలికంటా ఇంకి, ఎముకలను బలంగా మార్చి, వయస్సుతో పాటు ఎముకల్లో వచ్చే బలహీనతలను నయం చేస్తుంది.

5.దంత సమస్యలను నయం చేస్తుంది

5.దంత సమస్యలను నయం చేస్తుంది

నువ్వులనూనెను నోటి ఆరోగ్యానికి, పరిశుభ్రతకి ప్రాచీన కాలం నుండి వాడుతూ వస్తున్నారు. నేరుగా నోటిలో నూనెను పోసుకుని,పుక్కిలి పట్టటం ( ఆయిల్ పుల్లింగ్ అని సాధారణంగా అంటారు) నోటి ఆరోగ్యానికి చాలా ప్రభావవంతమైనది. పళ్ళు పుచ్చిపోవటాన్ని నయం చేయటంతోపాటు ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మొత్తంగా నోటికి సంబంధించి అన్నీ ఆరోగ్యంగా మారతాయి.

6.గుండె ఆరోగ్యాన్ని మంచి స్థాయిలో ఉంచుతుంది

6.గుండె ఆరోగ్యాన్ని మంచి స్థాయిలో ఉంచుతుంది

నువ్వులనూనెలో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు గుండెపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మెరుగైన రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది. నూనెలో ఉండే ఫ్యాటీయాసిడ్లు- సెసమోల్ మరియు సెసమిన్ రెండూ హృదయ మరియు రక్తప్రసరణ వ్యవస్థను బలంగా ఉంచి, కొలస్ట్రాల్ స్థాయిని తక్కువగా ఉండేలా చేస్తాయి.

7.జుట్టు అందాన్ని పెంచుతుంది

7.జుట్టు అందాన్ని పెంచుతుంది

నువ్వులనూనె జుట్టును సంరక్షించి, పోషణను అందిస్తుంది. ఇది సహజమైన సన్ స్క్రీన్ పదార్థంగా ప్రసిద్ధి కాబట్టి ఇది జుట్టును హానికారక యువి కిరణాలు మరియు కాలుష్యం నుంచి కాపాడుతుంది. ఇది జుట్టు కుదుళ్ళకు, వెంట్రుకలకు పోషణనిచ్చి , తొందరగా వయస్సుకి ముందే నెరవటాన్ని నియంత్రిస్తుంది. మాడును నువ్వులనూనెతో మసాజ్ చేయటం వలన రక్తప్రసరణ పెరిగి జుట్టు పెరుగుతుంది.

8.ఆందోళన మరియు డిప్రెషన్ ను నియంత్రించుకోటానికి ఉపయోగపడుతుంది

8.ఆందోళన మరియు డిప్రెషన్ ను నియంత్రించుకోటానికి ఉపయోగపడుతుంది

నువ్వులనూనెలోని లక్షణాలు మన మూడ్ పై ప్రభావం చూపిస్తాయని అంటారు. మానసిక ఒత్తిడి మరియు ఆందోళన స్థాయిలను తగ్గించి, మూడ్ ను మెరుగుపర్చటంలో ఇది సాయపడగలదు. నిద్రపోయేముందు అరికాళ్లను, మడమలను ఈ నూనెతో మసాజ్ చేయటం వలన మంచి నిద్ర పడుతుంది. నువ్వులనూనెకి ఉన్న ఇన్ని ఆరోగ్యలాభాల వలన దీనిని ప్రాచీన కాలం నుండి వాడుతూ వస్తున్నారు. ఇక, ఇప్పుడు మీరు కూడా ఈ శక్తిమంతమైన నూనెను మూతతీసి శరీర ఆరోగ్యం, అందం కోసం వాడే సమయం వచ్చింది కదూ! ఈ ఆర్టికల్ పంచుకోండి!

English summary

8 Health Benefits Of Sesame Oil

Sesame oil is one of the wondrous oils with widely known health benefits. Sesame oil is known to be the oldest oil used by mankind. The usage of sesame oil in diet as well as for medicinal purposes can aid to holistic development of the body and overall health.
Story first published:Thursday, February 1, 2018, 17:56 [IST]
Desktop Bottom Promotion