For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆలివ్ ఆయిల్ వల్ల కలిగే 8 రకాల ఆరోగ్యప్రయోజనాలు !

  |

  ఆలివ్ ఆయిల్ (ఒలియా యూరోపియా) మన పురాతన కాలం నుండి ఉపయోగంలో ఉంది; అయితే, గత కొన్ని సంవత్సరాలుగా దాని వల్ల కలిగే ప్రయోజనాల వల్ల అది వార్తల్లో నిలుస్తుంది. ఈ నూనెను ఆలివ్ పండ్ల నుంచి తీయబడుతుంది మరియు అనేక గృహాల్లో వంట అవసరాల కోసం ఈ నూనెను సర్వసాధారణంగా వాడుతున్నట్లుగా గుర్తించబడినది.

  నేటి కాలంలో ఉన్న చెఫ్లు (నిష్ణాతులైన వంటవారు) సాధారణ వంటలకే కాకుండా, కొన్ని ప్రత్యేకమైన వంటలను సిద్ధం చెయ్యడానికి కూడా ఈ ఆయిల్నే సిఫార్సు చేస్తున్నారు, ఎందుకంటే ఈ ఆలివ్ ఆయిల్లో కలిగి ఉన్న అద్భుతమైన గుణాలు చికిత్సాపరమైన ప్రయోజనాలను కలిగి ఉండటమే కాకుండా, మరిన్ని సౌందర్య ప్రయోజనాలను కూడా కలుగ చేసేదిగా ఉన్నాయి.

  8 Magical Health Benefits Of Olive Oil

  ప్రాచీన కాలంలో ఈ నూనెను 'లిక్విడ్ గోల్డ్' అని పిలిచేవారు. అవును, దాని వల్ల కలిగే ప్రయోజనాలు అలా ఉన్నాయి మరి! ఈ రోజుల్లో, ఈ నూనె మన ఆరోగ్యాన్ని మరియు అందాన్ని పెంపొందించడంలో అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉండటం వలన మళ్లీ ఇది ప్రజాదరణను పొందింది.

  ఆలివ్ ఆయిల్ను మీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈ క్రింద వివరించిబడ్డాయి.

  1. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది :

  1. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది :

  ఇటీవలి చేపట్టిన అధ్యయనాలు ఆలివ్ ఆయిల్ గుండె యొక్క వృద్ధాప్యాన్ని తగ్గించగలదని తేలింది. ధమనుల పనితీరుకు అడ్డంకుగా, అక్రమంగా నిర్మితమైన కొవ్వును తొలగించి, ధమనుల యొక్క రక్త ప్రసరణలను మరింతగా మెరుగుపరచి, గుండెపోటును మరియు గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి, ఇది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంపొందిస్తుంది.

  2. క్యాన్సర్ నివారిణిగా :

  2. క్యాన్సర్ నివారిణిగా :

  మీ ఆహారంలో ఆలివ్ ఆయిల్ను ఉపయోగించడం వల్ల క్యాన్సర్ను నివారించవచ్చు. ఇది శరీరంలో వృద్ధి చెందుతున్న క్యాన్సర్ పెరుగుదలను మందగించేలా చేస్తుంది, ముఖ్యంగా ఇది పెద్ద ప్రేగు మరియు రొమ్ము క్యాన్సర్ను నివారించే ప్రధానమైన ఏజెంట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా పెద్దప్రేగుకు సంక్రమించే క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా ప్రతిఘటించేలా ఇవి పనిచేస్తాయని గమనించబడింది.

  3. జ్ఞాపక శక్తిని మరియు మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది :

  3. జ్ఞాపక శక్తిని మరియు మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది :

  ఆలివ్ ఆయిల్ యాంటిడిప్రెసెంట్గా పనిచేస్తుంది మరియు సెరోటోనిన్ యొక్క స్థాయిని పెంచుతుందని పేర్కొనబడినది. సెరోటోనిన్ అనేది, "ఆనందాన్ని కలిగించే హార్మోన్గా" కూడా పిలుస్తారు, అలాగే ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది. ఈ నూనెలో ఒమేగా-3 మరియు ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉండటం వల్ల, మెదడు యొక్క పనితీరును ప్రోత్సహిస్తూ, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా చేస్తుంది. ఇది అల్జీమర్స్ వ్యాధిని కూడా నిరోధిస్తుంది.

  4. డయాబెటిస్ తగ్గిస్తుంది :

  4. డయాబెటిస్ తగ్గిస్తుంది :

  మీ ఆహారంలో ఆలివ్ ఆయిల్ను కూడా ఒక భాగంగా చేర్చుకోవడం వల్ల రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల, 2 వ రకం మధుమేహం వల్ల రక్తంలో కలిగే గ్లూకోస్ స్థాయిలను తగ్గించడమే కాకుండా, ఇన్సులిన్ యొక్క సున్నితత్వాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది.

  5. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి :

  5. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి :

  ఈ ఆలివ్ నూనెలో శోథ నిరోధక లక్షణాలను కనుగొనబడిన కారణంగా, ఈ నూనెను నొప్పుల నుండి ఉపశమనాన్ని పొందేందుకు ఉపయోగిస్తారు. ఇది వాపుల నుండి అనగా కీళ్ల వాపులు, బాగా వాయడం మరియు ఇతర శారీరక నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కీళ్లనొప్పులను సడలిస్తుంది, బలమైన వాపులు కలిగిన ప్రదేశానికి చైతన్యాన్ని కలుగజేసి మెరుగుపరుస్తుంది. ఆలివ్ నూనెను వాడటం వల్ల ఆర్థరైటిస్లో వంటి రుగ్మతలను తగ్గిస్తుంది.

  6. యాంటీ-బాక్టీరియల్ & యాంటీ-మైక్రోబయల్ :

  6. యాంటీ-బాక్టీరియల్ & యాంటీ-మైక్రోబయల్ :

  ఆలివ్ ఆయిల్ను అనేక బ్యాక్టీరియా మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగిస్తారు. ఆలివ్ నూనెలో ఫెనోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉన్నాయి, ఇది వ్యాధికారక బాక్టీరియాల యొక్క పెరుగుదలను అడ్డుకుంటుంది. ఈ నూనెలో ఒలేయిరొప్రిన్ (Oleuropein) అనే మూలాకము యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ మరియు యాంటీ-వైరల్ ఏజెంట్గా పనిచేస్తుందని కనుగొనబడింది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ను నివారించడంలో కూడా ఆలివ్ నూనె ఉపయోగపడుతుంది.

  7. చర్మ ఆరోగ్యం కోసం :

  7. చర్మ ఆరోగ్యం కోసం :

  ఆలివ్ నూనె, విటమిన్ E మరియు యాంటీ-ఆక్సిడెంట్లతో నింపబడి, చర్మాన్ని తేమగా ఉంచుతూ, పునరుజ్జీవనాన్ని ప్రసాదించి, చర్మానికి కావలసిన పోషణను అందిస్తుంది. ఇది ముడుతలతో తగ్గిస్తుంది, వృద్ధాప్య ఛాయలను కలుగజేసే కారకాలతో పోరాడుతుంది మరియు మచ్చలను - మొటిమలను తేలికగా తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి చైతన్యపరచి, మృదువుగా మార్చి, చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. ఇది పొడి పెదవులు మరియు పగిలిపోయిన మడాలకు కూడా చికిత్సను అందించగలదు. ఇది గోళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని మేకప్ రిమూవర్గాను మరియు కాంతిని ప్రసరించే లిక్విడ్గాను కూడా ఉపయోగిస్తారు.

  8. కేశ సంరక్షణ కోసం :

  8. కేశ సంరక్షణ కోసం :

  ఈ ఆలివ్ ఆయిల్, జుట్టుకు కావలసిన పోషణను అందించి, జుట్టును తేమగా ఉంచుతూ, చుండ్రును పోగొట్టి, జుట్టును మరింతగా బలపరుస్తుంది. ఇది పొడిగా, నునుపుగా ఉన్న జుట్టును మృదువుగా చేస్తుంది. జుట్టును మరింత బలమైనదిగానూ మరియు మెరిసేలా చేస్తుంది. ఈ నూనెను జుట్టు మొదళ్ల నుండి మూలాల వరకు అవసరమైన అన్ని పోషకాలను అందించే " అసంతృప్త కొవ్వు ఆమ్లాలను" కలిగి ఉండటం వల్ల మీ జుట్టు మరింత వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

  English summary

  8 Magical Health Benefits Of Olive Oil

  Olive oil is used in most of the exotic cuisines, the benefits of olive oil extend to therapeutic and cosmetic uses. Read on to know the magical health benefits of olive oil.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more