ఆరోగ్యానికి ఏ పండ్ల రసాలు మంచివి

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

మీరు ఇంట్లో చేసే పండ్లరసాలను తీసుకోడానికి ఇష్టపడుతారా? లేక పాక్ చేసి నిల్వ ఉంచిన పండ్లరసాలను తీసుకోవడానికి మొగ్గు చూపుతారా?, ఇంట్లో తయారు చేసుకునే సమయం, తీరిక లేని వారు, ఇంట్లో పండ్లరసాల మీదే ఆలోచన ఉన్నా కూడా, పాక్ చేసిన నిల్వ పండ్లరసాలకే మొగ్గు చూపాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. కానీ అన్నివిధాలుగా ఇంట్లోని పండ్లరాసాలే శ్రేయస్కరం. పళ్లరసాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుటకు, మూత్రపిండాల పనితీరుకు, శరీరాన్ని చైతన్య పరచుటకు, తక్షణ శక్తికి ఎంతగానో దోహదం చేస్తాయి.

కొందరు అంటుంటారు, పండ్ల రసాలు అంత చెడ్డవి కాదు అని. కానీ మీరు బయట షాపుల నుండి కొనుగోలు చేసే నిల్వ ఉంచిన లేదా, షాపులలో తయారు చేసే పళ్లరసాలలో చక్కెరలు, లేదా కృత్రిమ చక్కెరలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి శరీరానికి బరువును, రక్తపోటుని పెంచడంలో వీటి పనితీరును చూపిస్తాయి. ఇవి శరీరానికి మంచి చెయ్యకపోగా ఖచ్చితంగా చెడును మాత్రం చేయగలదు. రోజులో 2,3 పండ్లరసాలు ఇలా తీసుకునే వారు మాత్రం అధిక కాలరీలకు గురికాక తప్పదు.

Best And Worst Foods To Juice For Your Health

2015 అమెరికన్ ఆహార ప్రణాళికా సంస్థ నివేదిక ప్రకారం 100శాతం ఇంట్లో తయారు చేసిన పండ్లరసాలు అన్నిటా శ్రేష్టం. అది కూడా రోజువారి ఆహార ప్రణాళికలో భాగంగా సూచించిన పండ్ల మోతాదును దాటకుండా తీసుకోవలసి ఉంటుంది. మరియు 19-30 మద్యన ఉన్న స్త్రీ, పురుషులు 2 కప్పుల పండ్లను తీసుకొనవలసి ఉంటుంది. 31సంవత్సరాల పైబడిన వారు ఒకటున్నర కప్పు కనీసం తీసుకోవలసి ఉంటుంది. ఒక కప్పు పండ్ల రసం ఒక పండుతో సమానంగా భావించవలసి ఉంటుంది.

ఇక్కడ మంచి మరియు చెడు పానీయాల గురించిన వివరణలు ఇవ్వబడినవి.

1.వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం మంచిదే :

1.వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం మంచిదే :

మీ రోజు వారీ ఆహార ప్రణాళికలో భాగంగా కూరగాయలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక్కొక్క రకం కూరగాయలో రకరకాల పోషకాలు, మినరల్స్ కలిగి ఉంటాయి. తద్వారా శరీర జీవక్రియలను నిర్వహించడంలో ఒక్కొక్కటి ఒక్కోరకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు టమోటాలలో lycopene ఎక్కువగా ఉంటుంది, దీనిద్వారానే టమోటాకు ఆ రంగు వస్తుంది. ఇందులో ఉండే carotenoids ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా నిరోధించుటలో సహాయం చేస్తుంది. అదే విధంగా బీట్రూట్ జ్యూస్ లో కూడా lycopene ఉంటుంది, ఇది రక్త పోటును తగ్గించడంలో సహాయం చేస్తుంది.

2.కాక్టైల్ :ఖచ్చితంగా చెడే

2.కాక్టైల్ :ఖచ్చితంగా చెడే

కాక్టైల్ లాంటి జ్యూసులను తీసుకోవడం మంచి అలవాటు ఎప్పటికీ కాదు. ఇలాంటివి పేరుకు రుచికరంగా ఉంటాయి కానీ, కృత్రిమ చక్కెరలతో నిండి ఉంటాయి. ఇలాంటి జ్యూసులలో పండ్లరసం తక్కువగా, నీటి శాతం ఎక్కువగా, కృత్రిమ చక్కెరలతో నిండి ఉంటుంది. మరియు high fructose corn syrup ను ఎక్కువగా కలుపుతారు. ఇది బరువు పెంచడంలో కీలకపాత్ర పోషిస్తూ, ఊబకాయానికి దోహదం చేస్తుంది. మరియు శరీరంలో క్రొవ్వుశాతం పెంచడంలో, కాన్సర్, మధుమేహం, రక్తపోటు వంటి అనేక తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది.

3.తాజా పండ్ల రసాలు అన్నిటికన్నా శ్రేష్టం:

3.తాజా పండ్ల రసాలు అన్నిటికన్నా శ్రేష్టం:

తాజా పండ్ల రసాలు అన్నిటికన్నా 100శాతం శ్రేయస్కరం. వీటిలో అనేకరకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్-C, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువగా జ్యూస్ తీసుకోవడం వలన శరీరానికి షుగర్, కాలరీస్ అందించిన వారిమి అవుతాము. కావున మోతాదును మించి తీసుకోవడం కూడా మంచిది కాదు. పండ్లరసాలలో ఫైబర్ మరియు phytonutrients పండ్లలో వలె ఎక్కువగా ఉండవు. అందువలనే నిపుణులు, రోజుకు ఒకే ఒక్క జ్యూస్ తీసుకునేలా ప్రణాళిక చేసుకోమని సలహా ఇస్తుంటారు.

4.దానిమ్మ రసం మంచిదే:

4.దానిమ్మ రసం మంచిదే:

పోషకాలు, మినరల్స్ లో దానిమ్మను మించిన పండు మరొకటి లేదు అనడం అతిశయోక్తి కాదు. అన్ని ఉత్తమ లక్షణాల మేలు కలయిక దానిమ్మ పండు. ఇందులో ఎక్కువగా ఆరోగ్యకరమైన చక్కెర మరియు కాలరీలు నిక్షిప్తమై ఉంటాయి. మరియు ఇతర పండ్లతో పోలిస్తే అధికశాతంలో రోగనిరోధక తత్వాలను కలిగి ఉంటుంది. ఈ దానిమ్మ పండ్లరసంలో red wine మరియు గ్రీన్ టీ కన్నా అధికమైన రోగనిరోధక తత్వాలు ఉన్నాయి. ఇవి శరీరంలో బాక్టీరియాను తొలగించుటలో ఎంతగానో సహాయపడుతాయి. మరియు కణ విచ్ఛిన్నాన్ని అడ్డుకోవడంలో మంటను తగ్గించుటలో కీలకపాత్ర పోషిస్తుంది.

5.క్రాన్ బెర్రీ జ్యూస్-విటమిన్-సి లో ఎక్కువ:

5.క్రాన్ బెర్రీ జ్యూస్-విటమిన్-సి లో ఎక్కువ:

క్రాన్ బెర్రీ జ్యూస్ ఎక్కువగా విటమిన్-C తో నిండి ఉంటుంది. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడంలో ఎంతగానో దోహదం చేస్తుంది. విటమిన్-సి ని అస్కోర్బిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరం ఎదుగుదలలో, రక్తనాళాల మరమ్మత్తులో కీలకపాత్ర పోషిస్తుంది. మరియు అనేకరకాల జీవక్రియల నిర్వహణలో కూడా ఎంతో సహాయం చేస్తుంది, ముఖ్యంగా కొల్లాజన్ ఏర్పడడంలో, ఐరన్ గ్రహించుటలో, రోగ నిరోధక శక్తి పెరగడంలో , గాయాలు తగ్గుముఖం పట్టడంలో మరియు ఎముకల పటుత్వానికి ఎంతగానో సహాయపడుతుంది.

6.పాక్ చేసి నిల్వ చేసిన పండ్లరసాలు వద్దనే వద్దు:

6.పాక్ చేసి నిల్వ చేసిన పండ్లరసాలు వద్దనే వద్దు:

ఈ పాక్ చేసి నిల్వచేసి ఉన్న పండ్ల రసాలలో ఎక్కువగా కృత్రిమ చక్కెరలతో నిండి ఉంటాయి. ఇవి స్థూలకాయానికి ప్రధాన హేతువులుగా పరిణమిస్తాయి. నెమ్మదిగా ఇతర రోగాలకు, అనగా మధుమేహం, కిడ్నీ సమస్యలు రక్త పోటు వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. వీటిలో జ్యూస్ పరిమాణం తక్కువగా, ఇతర అంశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో పోషకాల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది.

7.రెడ్ గ్రేప్ జ్యూస్ : ఎంతో మంచిది

7.రెడ్ గ్రేప్ జ్యూస్ : ఎంతో మంచిది

రెడ్ గ్రేప్ జ్యూస్ లో ఎక్కువగా ఫ్లేవనాయిడ్స్, resveratrol ఉండి శరీరానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. రోగ నిరోధక తత్వాలకు, కెరోటినాయిడ్స్ ను పాలిఫెనోల్ గా మార్చుటకు ఉపయోగపడే phytonutrients పుష్కలంగా ఉంటాయి. రెడ్ గ్రేప్ జ్యూస్ ఎక్కువ మోతాదులో పొటాషియం కలిగి ఉంటుంది. తద్వారా కడుపు ఉబ్బరం లేకుండా చూస్తుంది. మరియు కంటి సంరక్షణకు, మోకాళ్ళ సంరక్షణకు, మెదడు చురుకుగా పనిచేయుటకు ఎంతగానో దోహదం చేస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంట నుండి ఉపశమనాన్ని ఇస్తాయి.

8.పచ్చి కాబేజీ, కాలే & బ్రోకోలీ జ్యూసులు తాగకండి :

8.పచ్చి కాబేజీ, కాలే & బ్రోకోలీ జ్యూసులు తాగకండి :

ఈ కాల్సిఫెరోస్ కూరగాయలు అనగా కాబేజ్, కాలే, బ్రోకోలీ వంటివి గాయిట్రోజెనిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. తద్వారా థైరాయిడ్ సమస్యలకు హేతువులుగా ఉంటాయి. ఇవి పచ్చివిగా తీసుకోవడం వలన కడుపులో గాస్ పేరుకుపోవడం, తద్వారా కడుపు ఉబ్బరానికి దారితీయడం వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ కాల్సిఫెరోస్ కూరగాయలలో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నా, వీటిని జ్యూస్ లేదా పచ్చివిగా తీసుకోవడం వలన నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

English summary

Best And Worst Foods To Juice For Your Health

Juices that you buy from stores contain added amounts of sugar which can result in weight gain or high blood pressure. Instead, homemade fruit juice can count towards your daily recommended amount of fruit. The best foods to juice are vegetable juice, red grape juice, pomegranate juice and the worst juices are fruit cocktail, raw cabbage, kale and broccoli juice.