For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్సర్ నుండి కాన్సర్ చికిత్స వరకు పోరాడే అద్భుత పోషకాలు కలిగిన వంకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు..!

|

ఎగ్ ప్లాంట్, దీన్ని సాధారణంగా వంకాయ అని పిలుస్తారు, విస్తృతంగా ప్రజాదరణ పొందిన ఈ కూరగాయ భిన్న వంటకాలలో విభిన్న రుచులతో అలరిస్తూ కూరగాయలలోనే రారాజులా పేరెన్నిక కలిగి ఉంది. సాధారణంగా వంకాయలు రెండు రకాలు, ఆసియా వంకాయలు, మరియు వెస్టర్న్ వంకాయలు. వంకాయలు చాలా పుష్టికరమైన పోషకాలను కలిగి ఉన్నాయి. నేడు, మనం వంకాయ గురించిన కొన్ని వాస్తవాలను మరియు వంకాయ/వంగ చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.

From Treating Ulcers To Fighting Cancer, Brinjal And Its Many Health Benefits
వంకాయల గురించిన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు:

వంకాయల గురించిన కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు:

వంకాయలు కేవలం వంగపండు రంగులో మాత్రమే కాకుండా ఇతరములైన రంగులలో మరియు ఆకృతులలో కూడా లభిస్తుంటాయి.

ఉడకబెట్టడం, వేపుడు చేయడం, డీప్ ఫ్రై మొదలైన అనేక వంట పద్ధతుల ద్వారా వంకాయలను ఆహారంలో జత చేస్తుంటారు. కానీ ఉడకబెట్టిన వంకాయలలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిలు సమర్థవంతముగా సంరక్షించబడుతాయి.

వంకాయలలోని ఆంథోసియానిన్స్ ఉనికి గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. వంకాయలలోని మరొక సమ్మేళనం నాసునిన్ మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

వంకాయలలోని పోషక తత్వాలు:

వంకాయలలోని పోషక తత్వాలు:

వంకాయలో ఉండే విత్తనాలు అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. నీటి మోతాదులు అధికంగా ఉండే వంకాయలు జీర్ణవ్యవస్థకు మరియు మూత్రాశయ పనితీరుకు చక్కగా సహాయపడుతుంది.

వంకాయలో పాస్పరస్ ఐరన్ క్యాల్షియంలతో పాటు, బి కాంప్లెక్స్ సమ్మేళనాలైన విటమిన్ బి1, బి2, బి3, మరియు బి6 ‌లను కూడా కలిగి ఉంటాయి.

మెడికల్ న్యూస్ టుడే ప్రకారం 99 గ్రాముల ఒక కప్పు వండిన వంకాయలో 35 కేలరీల శక్తి, 0.82 గ్రాముల మాంసకృత్తులు, 8.64 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 0.23 గ్రాముల కొవ్వు, 2.5 గ్రాముల ఫైబర్, 6 మి.గ్రా కాల్షియం, 1 మి.గ్రా. సోడియం, 188 మి.గ్రా పొటాషియం, 0.12 మి.గ్రా జింక్, 1.3 మి.గ్రా విటమిన్ సి, 0.25 మి.గ్రా ఇనుము, 11 మి.గ్రా మెగ్నీషియం, 14 మైక్రో గ్రామ్స్ ఫోలేట్, 15 మి.గ్రా ఫాస్పరస్, 85 మైక్రో గ్రామ్స్ విటమిన్ బి6 మరియు 2.9 మైక్రో గ్రామ్స్ విటమిన్ కె నిక్షేపాలు ఉన్నట్లుగా తెలిపింది.

వంకాయ తొక్కలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం నిక్షేపాలే కాకుండా, అధిక మోతాదులో అనామ్లజనకాలను కలిగి ఉంటుంది.

వంకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

వంకాయ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

1. గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

కొన్ని అధ్యయనాల ప్రకారం, వంకాయలో ఉన్న అనామ్లజనకాలు గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వంకాయ వినియోగం చెడు (ఎల్.డి.ఎల్) కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇవి గుండె జబ్బులకు ప్రధాన కారకాలుగా ఉన్నాయి. కావున, మంచి హృదయ ఆరోగ్యానికి తరచుగా వంకాయలను తినడం శ్రేయస్కరంగా చెప్పబడింది.

2. రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది

2. రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది

వంకాయలలో అధికమైన ఫైబర్ నిక్షేపాల కారణంగా, శరీరంలోని చక్కెర స్థాయిల శోషణను తగ్గించి, జీవక్రియలను క్రమబద్ధీకరించగలుగుతుంది. క్రమంగా రక్తంలోని చక్కెర స్థాయిలు కూడా తగ్గుముఖం పడతాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం వంకాయలో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో ఉత్తమంగా సహాయపడగలవు.

3. ఊబకాయం నియంత్రించడంలో :

3. ఊబకాయం నియంత్రించడంలో :

వంకాయలో ఉండే అధికమైన ఫైబర్ నిక్షేపాలు జీవక్రియలు సక్రమంగా కొనసాగుటకు దోహదపడతాయి. క్రమంగా జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం, హార్మోన్ల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడం మూలముగా శరీరంలోని చెడు క్రొవ్వులు తగ్గుముఖం పడతాయి‌. వంకాయలలోని ఫైబర్ నిక్షేపాలు ఆకలి కాకుండా చేసి ఆహారం మీదకు మనసు వెళ్లకుండా చేయగలవు. క్రమముగా శరీరానికి అందే కేలరీల సంఖ్య తగ్గుతుంది.

4. క్యాన్సర్ తో పోరాడుతుంది :

4. క్యాన్సర్ తో పోరాడుతుంది :

క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలతో పోరాడగలిగే శక్తి వంతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉన్న 13 రకాల ఫినోలిక్ సమ్మేళనాలను వంకాయలు కలిగి ఉంటాయి. ప్రత్యేకమైన ట్యూబ్ టెస్ట్ అధ్యయనాల ప్రకారం క్యాన్సర్ చికిత్సలో సహాయపడే సోలాసొడిన్ రాంనోసిల్ గ్లైకోసైడ్లను కూడా ఇవి కలిగి ఉంటాయి.

అంతేకాకుండా, వంకాయలో కనిపించే నాసునిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ మరియు యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్తో పోరాడడంలో ప్రభావవంతముగా సహాయపడుతుంది.

వంకాయలు, వివిధ రకాల ఆరోగ్య సమస్యల చికిత్సకు ఏవిధంగా సహాయపడగలవు :

వంకాయలు, వివిధ రకాల ఆరోగ్య సమస్యల చికిత్సకు ఏవిధంగా సహాయపడగలవు :

వంకాయలు వంట కోసం మాత్రమే కాకుండా కొన్ని రకాల ఆరోగ్యప్రయోజనాలకై ఉపయోగిస్తుంటారు కూడా. ఇక్కడ వంకాయతో కూడిన గృహ నివారణల గురించి పొందుపరచబడినది.

1. ఊబకాయం తగ్గుదలకోసం : వంకాయ, పైనాపిల్ & ముల్లంగి

ఒక తురిమిన వంకాయ, ముక్కలుగా కోసిన మూడు ముల్లంగి, మరియు ఒక స్లైస్ పైనాపిల్ ముక్కను కలిపి, కొద్దిగా నీటిని జోడించి బ్లెండర్లో జ్యూస్ వలె చేయవలెను.

ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో ఈ పానీయమును స్వీకరించిన యెడల మంచి ఫలితాలను పొందగలరు.

2. ట్రైగ్లిజెరైడ్స్ తగ్గుదలకోసం: వంకాయ మరియు కీరదోసకాయ

2. ట్రైగ్లిజెరైడ్స్ తగ్గుదలకోసం: వంకాయ మరియు కీరదోసకాయ

సగం వంకాయ ముక్కను ఒక కీరదోసకాయతో కలిపి నీటిని జోడించి బ్లెండర్లో జ్యూస్ వలె చేయవలెను. ప్రతిరోజు ఉదయం అల్పాహారానికి ముందు ఈ పానీయమును పదిహేను రోజులపాటు వరుసగా స్వీకరించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందగలరు.

3. హైపర్ టెన్షన్ తగ్గించుట కొరకు :

3. హైపర్ టెన్షన్ తగ్గించుట కొరకు :

తురిమిన వంకాయను బ్లెండర్ లో కొద్దిగా నీటిని కలిపి జ్యూస్ వలె చేసి పది రోజులపాటు క్రమముగా ఉదయం తీసుకొనడం మూలముగా మంచి ఫలితాలను పొందగలరు.

4. అల్సర్స్ తగ్గించుటలో : సీవీడ్ మరియు వంకాయ

4. అల్సర్స్ తగ్గించుటలో : సీవీడ్ మరియు వంకాయ

ఒక టేబుల్ స్పూన్ సీవీడ్, చిటికెడు ఉప్పు మరియు రెండు టేబుల్ స్పూన్ల బ్రింజాల్ పౌడర్ తీసుకోండి. ఈ మూడింటిని కలిపి ఒక గ్లాస్ కంటైనర్లు లోకి తీసుకొని బాగా గిలక్కొట్టండి. ఈ సమ్మేళనాన్ని సగం కప్పు నీటిలో కలిపి రోజులో కనీసం ఒక్కసారి కాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, ఆద్యాత్మిక, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

From Treating Ulcers To Fighting Cancer, Brinjal And Its Many Health Benefits

Eggplant, commonly known as brinjal, is a widely popular and a versatile vegetable used in a variety of cuisines. Brinjals are usually of two types - Asian Brinjals and Western Brinjals. Brinjals are very nutritious and today, we will be writing about the nutrition facts and health benefits of brinjal or eggplant.
Story first published: Friday, August 17, 2018, 18:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more