For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజంగా ఏర్పడే విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలి ?

|

సాధారణంగా మనం అనేక కారణాల వల్ల తరచుగా జబ్బు పడుతున్నాము. అలా జబ్బు పడటానికి గల కారణం మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది. మందులు తీసుకోవటం ద్వారా ఆ రోగ లక్షణాలకు చికిత్సను అందిస్తున్నాము. అయితే ఈ విధానం, వ్యాధుల లక్షణాలను కొంతవరకు అణిచివేస్తుంది కానీ, పూర్తిగా అనారోగ్యాన్ని నయం చేయదు. మేము ఈ వ్యాసం ద్వారా, సహజంగా ఏర్పడే విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలో అనే విషయాన్ని గూర్చి తెలియజేయబోతున్నాము.

ఉదాహరణకు:- మీరు శరీర నొప్పులతో బాధపడితే, పెయిన్ కిల్లర్స్ను ఆశ్రయిస్తారు, అంతే గాని మీకు తరచుగా ఎదురయ్యే ఈ నొప్పికి కారణమైన విటమిన్ లోపాలు గూర్చి నిర్లక్ష్యం చేస్తారు.

ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాల తయారీలో విటమిన్-B12 కీలక పాత్ర పోషిస్తుంది, ఆరోగ్యవంతమైన రోగనిరోధక వ్యవస్థకు కూడా ఇది చాలా అవసరం. ఇది రెగ్యులర్గా ఎర్ర రక్తకణాల ఉత్పత్తి ప్రక్రియకు సహాయపడుతుంది & విటమిన్-B12 పైనే మెదడు పనితీరు ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

How To Overcome Vitamin B12 Deficiency Naturally

మీ శరీరం ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి ఈ విటమిన్ తగినంత స్థాయిలో లేనప్పుడు, విటమిన్-B12 లోపం సంభవిస్తుంది. ఇది కండరాల బలహీనత, నరాల సమస్యలు, ఆకలి లేకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం, అలసట & రక్తహీనత వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది.

పాలు, షెల్ల్ఫిష్, గుడ్లు, మాంసం మొదలైన ఆహారాలలో విటమిన్-B12 సమృద్ధిగా దొరుకుతుంది. ఎక్కువ మంది శాకాహారులు విటమిన్-B12 లోపంతో బాధపడుతున్నారు. అయితే బాదంపాలు, కొబ్బరిపాలు, సోయా ఉత్పత్తులు, తృణధాన్యాలు, పుట్టగొడుగులు, మజ్జిగ తేట, జున్ను & పెరుగుల వంటి మరి కొన్ని శాఖాహారాలలో విటమిన్-B12 చాలా సమృద్ధిగా దొరుకుతుంది.

విటమిన్-B12 ఎంత మోతాదులో తీసుకోవాలి ?

విటమిన్-B12 ఎంత మోతాదులో తీసుకోవాలి ?

50 ఏళ్ల పైబడిన వారంతా విటమిన్-B12 ను కలిగి ఉన్న ఆహారాలను తినడం (లేదా) విటమిన్ B12 సప్లిమెంట్స్ను తీసుకోవాలి. రోజుకి పెద్దలకు సిఫార్సు చేయబడిన మోతాదు 25-100 mcg.

విటమిన్-B12 లక్షణాలు :

విటమిన్-B12 లక్షణాలు :

1. ఎక్కువగా అలసిపోవడం :

విటమిన్-B12 లోపం కారణంగా మీరు తీవ్రమైన అలసటను కలిగి ఉండవచ్చు. మీ శరీరంలో ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి ఈ విటమిన్ను ఉపయోగించుకుంటుంది ఎందుకంటే ఇవి రక్తంలో ఆక్సిజన్ను సరఫరా చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి, మీ శరీర కణాలు తగినంత ఆక్సిజన్ను పొందకపోతే, మీరు అలసట & నీరసంతో బాధపడుతుంటారు.

2. చురుకుదనం కోల్పోవడం :

2. చురుకుదనం కోల్పోవడం :

మీలో చురుకుదనం తగ్గి, నెమ్మదించిన అనుభూతిని పొందడానికి గల ముఖ్య కారణం విటమిన్-B12 లోపం. ఈ కారణం చేతనే మీ కండరాలు బలహీనమవుతాయి & అది తీవ్రమైన ఆయాసానికి దారితీయవచ్చు.

3. పిన్నులు & సూదుల వంటి సెన్సేషన్ :

3. పిన్నులు & సూదుల వంటి సెన్సేషన్ :

విటమిన్-B12 లోపం వల్ల కలిగే తీవ్రమైన దుష్ప్రభావాలలో నరాల-సమస్యలు ఎదురవ్వడం ఒకటి. ఈ విటమిన్ లేకుండా, మైలిన్, కొవ్వు పదార్ధములను భిన్నంమైన రీతిలో ఉత్పత్తి కాబడుతుంది. మైలీన్ మీ నరాలను సంరక్షించడానికి చుట్టుముట్టిన రక్షణ వారధిగా ఉంటుంది. మరొక సంకేతం ఏమిటంటే, మీ కాళ్ళు, చేతులలో కలిగే సంచలనము పిన్నులు & సూదులతో పొడుస్తున్నట్లుగా ఉన్న అనుభూతిని పోలి ఉంటుంది.

4. కదలికలలో మార్పులు :

4. కదలికలలో మార్పులు :

విటమిన్-B12 లోపమును సరైన చికిత్సను చేయకపోవడం వల్ల మీ నడకలోనూ, కదలికలలోనూ అనేక మార్పులు ఏర్పడవచ్చు. ఇది మీ శరీర బ్యాలెన్స్ను, సమన్వయతను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు, దానివల్ల మీరు కిందకు పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

5. చర్మ కాంతిని కోల్పోవడం :

5. చర్మ కాంతిని కోల్పోవడం :

మీ శారీరక ఛాయ అకస్మాత్తుగా పసుపులోకి / పాలిపోయిన రంగులోకి మారినట్లుగా మీరు గమనించవచ్చు; ఇది కూడా విటమిన్-B12 లోపానికి నిదర్శనం. విటమిన్-B12 లేకపోవడం వల్ల మీ శరీరంలో ఉన్న ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పై ప్రభావం చూపుతుంది. ఇలా ఇది బిలిరుబిన్ అనే పదార్థం విడుదలకు కారణమవుతున్నందున మీ చర్మము - పసుపు రంగులోకి మారుతుంది,

6. నాలుక రుచిని కోల్పోవడం :

6. నాలుక రుచిని కోల్పోవడం :

నాలుకలో పిప్మిల్లా అని పిలువబడే ఎర్రటి చిన్న బొబ్బలు ఉంటాయి, అయితే విటమిన్-B12 లోపంతో బాధపడేవారు వీరిని ఎక్కువగా కోల్పోతారు. ఇది రుచిని గుర్తించే జ్ఞానశక్తిని కోల్పోయేలా చేస్తుంది, ఎందుకంటే వీటిలో ఎక్కువ భాగం రుచి మొగ్గలను కలిగి ఉంటాయి.

7. మానసిక స్థితిలో మార్పులు :

7. మానసిక స్థితిలో మార్పులు :

విటమిన్-B12 లోపంతో ఉన్నప్పుడు, మీరు ఎక్కువగా ఆందోళనకు గురవుతారు. ఎందుకంటే మెదడు రెండు రసాయనాలయిన డోపామైన్ & సెరోటోనిన్ సంశ్లేషణకు విటమిన్-B12 అనేది చాలా అవసరం. అలాగే విటమిన్-B12 తక్కువ స్థాయిలో ఉండటం వల్ల, అస్థిరమైన మానసిక స్థితికి & డిప్రెషన్ & జ్ఞాపకశక్తి తగ్గటం వంటి పరిస్థితులకు కారణమవుతుంది.

విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలి ?

విటమిన్-B12 లోపాన్ని ఎలా అధిగమించాలి ?

విటమిన్-B12 లోపాన్ని అధిగమించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి:

1. పాల ఉత్పత్తులు విటమిన్-B12 కి అద్భుతమైన వనరులుగా ఉన్నాయి. ముడి పాలు, పెరుగు, జున్ను వంటి ఆహార పదార్థాలను తింటూ ఉండండి.

2. మీ ఆహారంలో పౌల్ట్రీ ఉత్పత్తులను, చేపలను, బీన్స్, గుడ్లు & నట్స్ వంటి ఆహారాలను చేర్చుకోవడం మంచిది.

3. చేపలు & ఎర్రని మాంసం వంటివి విటమిన్-B12 ను అధిక నాణ్యతతో కలిగి ఉంటాయి.

4. కొన్ని అల్పాహార తృణధాన్యాలు, పోషకాలను కలిగిన ఈస్ట్, మజ్జిగ తేట & బ్రెడ్ వంటి ఇతర ఆహార ఉత్పత్తులు విటమిన్-B12 తో మరింతగా బలపడతాయి.

5. పులియబెట్టిన సోయాబీన్లు కూడా విటమిన్-B12 కు అద్భుతమైన మూలాలు.

6. కెల్ప్ అనే నాచు, బ్లూ-గ్రీన్ ఆల్గే, బ్రూవర్ అనే ఈస్ట్ & పులియబెట్టిన మొక్కల ఆహారాలు; టేంపే-మిసో-టోఫు వంటి సముద్రపు మొక్కల వంటి వాటిలో విటమిన్-B12 సమృద్ధిగా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా వినియోగిస్తారు.

7. మీరు లాక్టోస్కు విరుద్ధంగా గానీ ఉంటే, మీరు కనీసం 10 మైక్రోగ్రామ్ల విటమిన్-B12 సప్లిమెంట్స్ను రోజువారీగా తీసుకోవాలి (లేదా) ఒక వారానికి గానూ 2000 మైక్రోగ్రామ్ల విటమిన్-B12 సప్లిమెంట్స్ను తీసుకోవచ్చు.

English summary

How To Overcome Vitamin B12 Deficiency Naturally

A deficiency in vitamin B12 occurs when your body doesn't have enough of this vitamin to make red blood cells. Vitamin B12 helps in making healthy red blood cells. Eating foods rich in vitamin B12 like dairy products, fish, eggs, red meat, Brewer's yeast, etc. are some of the ways to overcome vitamin B12 deficiency naturally.
Story first published: Sunday, May 13, 2018, 12:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more