ఖాళీ కడుపుతో అరటిపండును తినడమనేది, మీ ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది ?

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

అల్పాహారమనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అవసరమయ్యే భోజనం. ఒక పెద్ద ప్లేటు నిండా పోషకాలను కలిగిన ఉన్న ఆరోగ్యకరమైన వంటకాలను తింటారు. కానీ నేటి జీవన విధానంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల మద్య చాలామంది అల్పాహారాన్ని తీసుకోవడం మానేస్తున్నారు.

ఆఫీసుల్లో పనిచేసే చాలామంది తీవ్రమైన ఆకలిని కలిగి ఉన్నందున, వారు తరచుగా అరటిని (లేదా) ఆపిల్ను పట్టుకుని ఆఫీసుకు బయలుదేరుతారు. కానీ ఇది చాలా తప్పు అలవాటు. ఉత్తమ పోషక ఆహారాలలో అరటి ఒకటిగా ఉన్నప్పటికీ, ఖాళీ కడుపుతో అరటి పండును తినడం వల్ల దానిలో అధికంగా వున్న పొటాషియం & మెగ్నీషియంలు మీ శరీరంలో ఉన్న మినరల్స్ స్థాయిలో అసమతుల్యతను కలిగిస్తుంది.

Is It Healthy To Eat Bananas In Empty Stomach?

అందుకే ఖాళీ కడుపుతో అరటిని తినడాన్ని మానివేయడం చాలా ఉత్తమం. ఈ అరటి మీ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది; రక్తపోటును నియంత్రిస్తుంది, అలసట, మలబద్ధకం, అల్సర్ వంటి ఇతర వ్యాధులను చాలా తగ్గిస్తుంది. ఇది హేమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రేరేపించి, రక్తహీనతను తగ్గిస్తుంది.

కానీ ఈ పోషక ప్రయోజనాలన్నింటినీ మీ శరీరం పొందాలంటే, మీరు సరైన సమయంలో అరటిని వినియోగించాలి. ఖాళీ కడుపుతో అరటిని తినడం వల్ల మెగ్నీషియం & పొటాషియంల స్థాయిలలో అసమతుల్యతను సృష్టించడంతో పాటు, ఆమ్లత్వముకు దారితీసి ప్రేగు సమస్యలను తీవ్రతరం చేస్తుంది. అరటి అనేది చాలా మంచి అల్పాహారము, కానీ దాన్ని సరైన సమయంలో వినియోగించాలని గుర్తుంచుకోవడం చాలా మంచిది.

అరటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :-

అరటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :-

అరటిలో ఉండే పోషక విలువలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవి పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి సమ్మేళనాలను సమృద్ధిగా కలిగి ఉన్నందు వల్ల డాక్టర్లు అరటినే ఎక్కువగా సిఫారసు చేస్తారు. ఇది మీ ఆకలిని తీరుస్తూ, మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. అరటిలో 25% వరకు చక్కెర పదార్థాలు ఉండటం వల్ల మీ శరీర పనితీరుకి అవసరమైన శక్తి బూస్టర్లను అందించేవిగా మారుతాయి. అంతేకాకుండా అరటి పండులో విటమిన్ B, విటమిన్ B6, ఐరన్ వంటి వాటిని కూడా కలిగి ఉన్నాయి.

ఖాళీ కడుపుతో అరటిపండును తినడానికి 'నో' చెప్పండి :

ఖాళీ కడుపుతో అరటిపండును తినడానికి 'నో' చెప్పండి :

అరటి అన్ని రకాల పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి కాబట్టి ఇతర ఆహార పదార్థాలతో కలిపి తినడం వల్ల ఎక్కువ పోషకాలను అందిస్తుంది, అరటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల అంతటి గొప్ప ప్రయోజనాలు ఏమీ కలుగవు. కొన్ని పరిశోధనల ప్రకారం, అరటి లో చాలా ఎక్కువ మొత్తంలో చక్కెరను కలిగి ఉంటాయి, ఇది శరీరంలో శక్తిని ప్రేరేపిస్తుంది. అయితే అరటిని ఖాళీ కడుపుతో తినటం వల్ల కొన్ని గంటల వ్యవధిలోనే పొందిన శక్తి క్రమక్రమంగా క్షీణించిపోతోంది. అంతేకాకుండా ఇది మీలో ఉన్న చురుకుదనాన్ని నెమ్మదించేలా చేసి, మీలో నిద్రావస్థ అనుభూతిని కలిగిస్తుంది.

పౌష్టికాహార నిపుణులు అభిప్రాయం ప్రకారం,

పౌష్టికాహార నిపుణులు అభిప్రాయం ప్రకారం,

అనేక మంది పౌష్టికాహార నిపుణులు అభిప్రాయం ప్రకారం, అరటిని తినడం ద్వారా రోజును ప్రారంభించడానికి చాలా మంచి మార్గమని, కానీ అరటిని ఇతర ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవాలి. అరటిలో ఉండే ఆమ్ల స్వభావం గురించి ముందు చెప్పినట్లుగా, అరటిని కొన్ని ఎండబెట్టిన పొడి పండ్లతో కలిపి తీసుకున్నట్లయితే, దాని ఆమ్లత్వ స్వభావమును తీవ్రంగా తగ్గించవచ్చు. కాకుండా, ఖాళీ కడుపుతో ఒక అరటి తినడం వల్ల హృదయ సంబంధ రుగ్మతలకు దారితీస్తుంది, అలాగే అది అధిక స్థాయి మెగ్నీషియం యొక్క అసమతుల్యతకు కారణమవుతుంది.

ఆయుర్వేదము ఏమని చెప్పింది ?

ఆయుర్వేదము ఏమని చెప్పింది ?

ఆరోగ్యం, వెల్నెస్ & పోషణ గురించి మాట్లాడే ప్రాచీన పుస్తకాలలో "ఆయుర్వేదము" ఒకటి, మనము ఖాళీ కడుపుతో ఏ పండు వినియోగాన్ని నివారించవచ్చో అని కూడా సూచిస్తుంది. ఇది కేవలం అరటి మాత్రమే నివారించాలి అని చెప్పడటం లేదు, కానీ సాధారణంగా మనం వినియోగించే అన్ని రకాల పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవటం మానివేయాలి.

సహజసిద్ధమైన పండ్లను

సహజసిద్ధమైన పండ్లను

ఎందుకంటే, ఈ రోజుల్లో సహజసిద్ధమైన పండ్లను తెలుసుకోవడం చాలా అరుదు. మనము తినే పండ్లు ఎక్కువగా రసాయనాలతో కృత్రిమంగా పెంచబడుతున్నాయి. కాబట్టి, అలాంటి పండ్లను మనము ఖాళీ కడుపుతో తినేటప్పుడు, ఈ రసాయనాలు మన శరీరంలోకి నేరుగా ప్రవేశిస్తాయి, అలాగే అవి పండ్లలో ఉన్న పోషకాలను అందించడానికి బదులుగా ఆరోగ్య సమస్యలను కలిగించేవిగా ఉండవచ్చు.

కాబట్టి మనము వీటి వినియోగాన్ని మానుకోవాలా (లేదా) మానకూడదా?

కాబట్టి మనము వీటి వినియోగాన్ని మానుకోవాలా (లేదా) మానకూడదా?

అరటి వంటి ప్రత్యేకమైన ఆహార పదార్థాలను రోజును ప్రారంభించడానికి ముందుగా వినియోగించటమనేది చాలా మంచి అలవాటు. కానీ, మీరు ఈ అరటిని వేరొక అల్పాహార భోజనముతో కలిపి తప్పనిసరిగా తీసుకోవాలి. అరటిని ఇతర పండ్లు (లేదా) ఆహార పదార్థాలతో జతచేసి తినటంవల్ల మీ భోజనంలో పోషకాల స్థాయిని అద్భుతంగా పెంచబడతాయి. ఈ విధంగా మీరు అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు, అలాగే ఆరోగ్యకరమైన భోజనంతో మీ రోజును ప్రారంభించవచ్చు.

అరటితో మీ అల్పాహారాన్ని మరింత ఆరోగ్యవంతంగా చేయడం :-

అరటితో మీ అల్పాహారాన్ని మరింత ఆరోగ్యవంతంగా చేయడం :-

మీ రోజును అరటితో మరింత ఆరోగ్యంగా ప్రారంభించడానికి గానూ ఈ కింద చెప్పిన కొన్ని అరటి వంటకాలను మీరు మీ ఇంట్లోనే తప్పక ప్రయత్నించండి !

అరటితో చేసిన ఓట్మీల్ కుక్కీలు:

అరటితో చేసిన ఓట్మీల్ కుక్కీలు:

ఈ రుచికరమైన వంటకంతో, మీ శరీరాన్ని బాగా ఉత్తేజపరిచి, మంచి కిక్కుతో మీ రోజును ప్రారంభించండి. అందుకోసం మీరు అరటిపళ్లను, ఒక కప్పు ఓట్స్ను, మాపుల్ సిరప్ను, నట్స్ బట్టర్ను తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ బాగా కలిపి, ఆరోగ్యకరమైన - రుచికరమైన కుక్కీలుగా తయారుచేసుకొని వినియోగించండి.

బెర్రీస్-బనానా-సిరీల్:

బెర్రీస్-బనానా-సిరీల్:

ఎల్లప్పుడు ఆకలిని కలిగి ఉన్నవారికి సులభంగా లభించే ఒక అల్పాహారం. దీని కోసం, మీరు ఒక కప్పు వెచ్చగా ఉన్న పాలు (వెన్నతీసినవి), అరటి ముక్కలు, అలాగే కొన్ని బెర్రీ ముక్కలు అవసరం అవుతాయి. ఇలా తీసుకొని పదార్థాలను బాగా కలపండి, అలా తయారు చేసుకొన్న మిశ్రమాన్ని మరుసటిరోజు ఉదయం ఒక రుచికరమైన అల్పాహారంగా తీసుకొని, ఆనందించండి.

చాక్లెట్-బనానా-స్మూతీ:

చాక్లెట్-బనానా-స్మూతీ:

స్మూతీస్ను పిల్లలతో సహా అందరూ ఇష్టపడతారు. కాబట్టి, మీరు మీ పిల్లలకు ఒక రుచికరమైన & పోషకాలను కలిగిన ఆహారాన్ని ఇవ్వాలనుకుంటే, వారికి ఒక గ్లాసు చాక్లెట్-బనానా-స్మూతీనూ అందించండి.

దీని తయారీ కోసం మీకు బ్లెండర్ అవసరమవుతుంది. బ్లెండర్లో ఒక గ్లాసు పాలను, కోకో పౌడర్ & అరటి ముక్కలు పోయాలి. అది జావలాంటి రూపాన్ని పొందే వరకు బాగా కలపండి. అలా తయారు కాబడిన ఈ స్మూతీ, మీ నోటిని ఊరించడం తోపాటు ఆకలిని కూడా నివారిస్తుంది.

English summary

Is It Healthy To Eat Bananas In Empty Stomach?

Bananas are a great source of minerals like potassium and magnesium and many other nutrients. Consuming the fruit on empty stomach can trigger imbalance in the levels of potassium and magnesium in our body. Eating bananas on empty stomach will leave you feeling lethargic, sleepy and fatigued, hence it should be avoided.