Latest Updates
-
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్ -
పెళ్లై ఏళ్లు గడిచాక చాలా జంటలు భార్యాభర్తలుగా కాదు, రూమ్మేట్లలా జీవిస్తున్నారు మీరూ ఇలాంటివారేనా? -
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట!
ప్యాకెట్ పాలను మరిగించకుండా తాగితే మన ఆరోగ్యానికి ఏమవుతుంది ?
మనం రోజు తీసుకొనే ఆహారంలో పాలు అనేవి చాలా ముఖ్యమైన, ఖచ్చితమైన ద్రవరూప ఆహారంగా మారిపోయింది. కొన్ని వేల సంవత్సరాలకు ముందు నుండి ప్రతి రోజు పాలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఒక అలవాటుగా పాటిస్తూ ఉన్నాం. ఎందుకంటే, అందులో ఉండే కాల్షియమ్ ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండటానికి, పళ్ళు దృఢంగా తయారవ్వడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
కండరాలు పెరగడానికి కూడా పాలు ఎంతగానో సహాయపడుతుంది. అంతే కాకుండా కండరాల కణజాలాలు దృఢంగా అవ్వడానికి, బాగు చేసే గుణాలు ఎన్నో పాలలో ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో తరాల నుండి పచ్చిపాలలో ఆరోగ్యవంతమైన లాభాలు ఉన్నాయనే ఉద్దేశ్యంతో అలానే తాగేవారు.

పచ్చిపాలను అలానే తాగడం వల్ల అందులో ఉండే ఎన్నో పోషక విలువలు తమకు లభిస్తాయని చాలా మంది నమ్మకం. అయితే, అందులో కొన్ని ప్రాణాంతక క్రిమికీటకాలు కూడా ఉంటాయి. వీటి వల్ల ఎన్నో భయంకర వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. వీటన్నింటి మూలంగానే పచ్చిపాలను మరగపెట్టడం అనే ప్రక్రియను మనం అలవర్చుకున్నాం.
ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు పాలను పాల ప్యాకెట్ల ద్వారానే తెచ్చుకోవడం జరుగుతుంది. పచ్చిపాలను పాశ్చరైజేషన్ అనే కాగబెట్టే ప్రక్రియ ద్వారా పాల జీవితకాలం పెంచడం జరిగింది. ఈ ప్రక్రియలో భాగంగా 135 డిగ్రీల ఉష్ణోగ్రతలో కొన్ని సెకండ్ల పాటు లేదా 71 డిగ్రీల దగ్గ 20 నుండి 30 సెకండ్ల పాటు మారగించడం జరుగుతుంది. ఈ ప్రక్రియనే అల్ట్రా హీట్ ట్రీట్మెంట్ లేదా హై టెంపరేచర్ షార్ట్ టైం అనే పేర్లుతో వీటిని ఆంగ్లంలో పిలుస్తారు.
ఈ రెండు వేడి చేసే ప్రక్రియల ద్వారా పాలలో ఉండే చెడు సూక్ష్మజీవులను అంతమొందించవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వివిధరకాల ప్యాకెట్ల లో పాలను ప్యాక్ చేసి వినియోగదారులకు అమ్మడం జరుగుతుంది.
ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న మరొక ప్రశ్న ఏమిటంటే, పచ్చిపాలను ఎలా అయితే కాగబెడతామో, అలానే పాల ప్యాకెట్ల లో పాలను కూడా మరగబెట్టాలా ? లేక అలానే మరగపెట్టకుండా తాగవచ్చా ?

ఇక్కడ ఉత్పన్నం అవుతున్న మరిన్ని అర్ధవంతమైన ప్రశ్నలు ఏమిటంటే, పాలను మళ్ళీ మరగబెట్టడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు అన్ని పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందా ? మరి అటువంటి సమయంలో పాలు తీసుకోవడం వల్ల కలిగే లాభం ఏమిటి ?
ఈ ప్రశ్నలకు సమాధానం అలా కావొచ్చు, కాకపోవచ్చు. ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే, మనం వేడి చేసే విధానం పై ఇది ఆధారపడి ఉంటుంది. పాలల్లో కాల్షియమ్ లాంటి ఎన్నో ఖనిజాలతో పాటు విటమిన్లు ఏ, డి, బి 1, బి 2, బి 12, కె కూడా అధికంగా ఉంటాయి. వీటికితోడు ఎన్నో పోషక విలువలతో పాటు పోషకాలు కూడా ఉంటాయి. వీటన్నింటి పై ప్రభావం చూపకుండా వ్యవహరించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్యాకెట్ పాలను మరిగించే క్రమంలో కొన్ని పద్దతులను పాటించడం ద్వారా మనం అవసరమైన పోషకాలు ఏవి కోల్పోకుండా కాపాడుకోవచ్చు.

1. తరచూ పాలను వేడిచేయడం లేదా మరిగించడం చేయకండి. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న పోషక విలువలపై ప్రభావం చూపుతుంది.
2. పాలు మరుగుతున్న సమయంలో అప్పుడప్పుడు పాలను అలా కలుపుతూ ఉండటం మంచిది.
3. పాలను తక్కువ వేడి పై వేడిచేయండి లేదా మరిగించండి. ఎందుకంటే, ఎక్కువ వేడి పై కనుక మరిగిస్తే అది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
4. ఒకసారి పాలను మరిగించి చల్లార్చిన తర్వాత అలానే ఎక్కువ సేపు బయట ఉంచకండి, త్వరగా ఫ్రిడ్జ్ లో పెట్టేయండి. ఆ తర్వాత అవసరమైనప్పుడు వాడుకోండి. ఇలా చేయడం వల్ల పాలు మరింత తాజాగా ఉంటాయి.
5. పాలను మంటపై మాత్రమే మరిగించండి. మైక్రో ఒవేన్ లలో అస్సలు మరిగించకండి.
పైన చెప్పబడిన వివిధ మరిగించే మార్గాలను మనం పాటించడం ద్వారా ప్యాకెట్ పాలలో ఉండే పోషక విలువలను కోల్పోకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ఇలా చేయడం వల్ల పాలల్లో ఉండే విటమిన్లు, పోషక విలువల యొక్క సమతుల్యత దెబ్బతినదు. అంతే కాకుండా ఇలా మరిగిస్తే పాల రుచి కూడా మరింతగా పెరుగుతుంది.
వేడి వేడి పాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. పైన చెప్పబడిన విధంగా పాలను మరిగించి ఫ్రిడ్జిలో పెట్టినట్లయితే, పాల యొక్క జీవిత కాలం మరింతగా పెరుగుతుంది. అదే మరిగించకుండా అలానే ఫ్రిడ్జిలో పెట్టేస్తే పాల జీవితకాలం తగ్గిపోతుంది.
అందుచేతనే, ప్యాకెట్ పాలను కూడా మరిగించడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల పాలల్లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు మరణిస్తాయి. మనకు కూడా భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications