For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 7రకాల రోజూవారీ ఆహార పదార్ధాలు సహజ సిద్దమైన రోగనిరోధకతత్వాలను కలిగి ఉంటాయని తెలుసా?

|

కాలానుగుణంగా ఋతువులు మారడం సహజమైన ప్రక్రియగా ఉండవచ్చు, కానీ ఈ కాలాల మార్పిడుల కారణంగా తరచుగా ప్రజలు, జలుబు, ఫ్లూ, జ్వరం, చర్మ రోగాలు, వైరల్ ఫీవర్స్ మరియు అలెర్జీల వంటి అనేక అనారోగ్యాల బారిన పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మన శరీరం యొక్క రోగనిరోధకత బలహీనంగా ఉంటుంది.

ఎందుకంటే మారుతున్న శీతోష్ణస్థితికి అనుగుణంగా శరీరం మారడానికి ప్రయత్నిస్తుంటుంది కాబట్టి. క్రమంగా రోగాల బారినుండి కాపాడుకోవటానికి, మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అంటువ్యాధులతో పోరాడేందుదుకు, క్రిమినాశకరంగా శరీరంలోని రోగనిరోధకతత్వాలు గణనీయంగా ఉండేలా సమర్థవంతమైన నివారణా చర్యలు చేపట్టుటకు కొన్ని సహజ సిద్దమైన ఆహార పదార్ధాలను క్రమం తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడగల యాంటిబాడీస్ పెంపొందించడం ద్వారా, ఈ ఆహార పదార్ధాలలోని సహజ సిద్దమైన క్రిమిసంహారకాలు ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో సహాయపడుతాయి.

వాస్తవానికి మన వంటగది మనకు తెలీని, అనేక రకాల అద్భుతమైన నివారణులతో కూడిన స్టోర్ హౌస్ వంటిది. సహజమైన వైద్య విధానాలను ఆచరించాలని భావిస్తున్న ఎడల, మరిన్ని ప్రయోజనకరమైన లక్షణాల గురించిన అవగాహన కోసం ఈ వ్యాసం దోహదపడుతుంది. DK పబ్లిషింగ్ హౌస్ వారి “హీలింగ్ ఫుడ్స్” అనే పుస్తకం ప్రకారం, "ఆరోగ్యకరమైన జీవితం సరైన ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది, ఒత్తిడి, ఆందోళనలు మరియు పెరుగుతున్న విష వాతావరణం యొక్క ప్రతికూల దాడికి వ్యతిరేకంగా శరీరంలో పోరాడగలిగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది."

1. రోజ్మేరీ :

1. రోజ్మేరీ :

రోజ్మేరీలో కఫేక్ మరియు రోస్మరినిక్ ఆమ్లాల వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎజెంట్లు ఉన్నాయి. ఇవి బలమైన క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. వాటి యాంటీ ఆక్సిడెంట్ చర్యలు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా ఆస్తమా, కాలేయ వ్యాధి మరియు గుండె జబ్బు యొక్క ప్రమాదాలను సైతం తగ్గిస్తుంది. ఒక టీ లేదా గార్గిల్ లో వినియోగించినట్లయితే, ఇది గమ్ డిసీజ్ తగ్గడంలోనే కాకుండా గొంతు నొప్పి ఉపశమనానికి కూడా సహాయం చేస్తుంది. ఇది అనేక రకాల ఆరోగ్యకరమైన అస్థిర నూనెలను కలిగి ఉంటుంది, ఇవి నరాలని శాంతపరచి, కడుపు నొప్పి తగ్గించడానికి సహాయపడే ఉపశమన ప్రభావాలను కలిగి ఉంటాయి.

2. మెంతులు :

2. మెంతులు :

మెంతులు సహజసిద్దమైన డై యురెటిక్ మరియు యాంటీ బాక్టీరియల్ తత్వాలను కలిగి ఉంటుంది. ఇది సిస్టిటిస్ మరియు మూత్రాశయ సంబంధిత అంటువ్యాధులకు వ్యతిరేకంగా పని చేస్తుంది. మెంతులలోని చమురు ప్రభావాలు, జీర్ణవ్యవస్థపై శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. క్రమంగా పురాతన కాలం నుండి దీర్ఘకాలిక కడుపు నొప్పి మరియు ఉబ్బరానికి చికిత్సగా అనేక సాంప్రదాయక ఔషద విధానాలలో ఉపయోగించబడుతుంది. జంతువులపై చేసిన అధ్యయనాలలో రక్తంలో చక్కెర మరియు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సమర్ధనీయమైన పాత్రను కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి.

Most Read: హస్త సాముద్రిక శాస్త్రంలో చేతి రేఖలు వృత్తిపరమైన అంశాల గురించి ఏం చెబుతున్నాయి ?

3. ఒరిగానో :

3. ఒరిగానో :

ఒరిగానోలోని అస్థిర నూనెలైన థైమాల్ మరియు కార్వక్రోల్ శరీరంలోని స్వేచ్ఛా రాశుల (ఫ్రీ రాడికల్స్) వలన తలెత్తే ఆక్సీకరణల ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడేందుకు సహాయపడుతాయి. ఈ అస్థిర నూనెలు సూడోమోనాస్ ఎరుగినోసా, స్టెఫిలోకాకస్ ఆరియస్ మరియు కాండిడా అల్బికాన్స్ వంటి బాక్టీరియా మరియు ఫంగస్ యొక్క పెరుగుదలను సైతం నిరోధించగలవని తేలింది.

 4. దాల్చిన చెక్క:

4. దాల్చిన చెక్క:

దాల్చినచెక్క ఒక సుగంధ ద్రవ్యం. ఇది బాక్టీరియా, వైరస్ మరియు ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే గొప్ప క్రిమినాశకంగా చెప్పవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్లో సమృద్ధిగా ఉంటుంది. ఇది అనాల్జేసిక్ లక్షణాలతో పాటుగా, వాపును తగ్గించగలిగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని సైతం కలిగి ఉంటుంది. క్రమంగా ఇది జలుబు, ఫ్లూ, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్స్, జ్వరం మరియు తలనొప్పి వంటి సమస్యలతో పోరాడడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్కను వాసన చూడడం ద్వారా కూడా, అభిజ్ఞాత్మకత (ఆలోచనా శక్తి), మరియు జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెప్పబడింది.

Most Read: నా భార్యతో ఇబ్బందిపడుతున్నా, బెడ్రూమ్ లో నాకు చుక్కలు కనపడతాయి, శృంగార కోర్కెలు ఎక్కువ

5. స్టార్ ఆనిస్ :

5. స్టార్ ఆనిస్ :

సాధారణ సమస్యలైన ఎక్కిళ్ళు మరియు దప్పికను నిలువరించడానికి ఈ స్టార్ ఆనిస్ వినియోగించినప్పటికీ, వైరస్ సంక్రమణల నుండి వేగవంతమైన రికవరీకి సహాయం చేయడంలో కూడా స్టార్ ఆనిస్ ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది. హెర్పెస్ మరియు ఫ్లూ వైరస్ రెండింటికీ, దానిలోని శక్తివంతమైన యాంటివైరల్ లక్షణాలు ప్రభావవంతంగా ఉంటాయి – క్రమంగా ఫ్లూ ఔషధాలను ఉత్పత్తి చేసేందుకు, ఔషధ సంస్థలు సైతం దీనిని ఉపయోగిస్తున్నాయి అంటేనే అర్ధం చేసుకోవచ్చు, దీని పనితనం గురించి.

6. తేనె :

6. తేనె :

తేనె అధిక మోతాదులో సేంద్రీయ చక్కెరలు మరియు నీటిని కలిగి ఉంటుంది. మరియు ఇది అనేక ఔషధ గుణాలకు ప్రసిద్ది చెందింది. చర్మ గాయాలు మరియు పూతలను సైతం నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తేనె విటమిన్లు, ఖనిజాలు, ఎంజైములు మరికొన్ని ముఖ్యమైన నూనెలకు గొప్ప మూలంగా ఉంది. దీనిలోని హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటెంట్ చర్మం మీది బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుందని చెప్పబడింది. సమయోచితంగా ఉపయోగించినప్పుడు, ఇది గాయాన్ని వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

నిజానికి గాయం ఏర్పడిన వెంటనే మనం ముందుగా వెతికేది, హైడ్రోజన్ పెరాక్సైడ్. కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేని పక్షాన, తేనె అందుకు బదులుగా ఉపయోగపడుతుందని గుర్తుంచుకోవలసి ఉంటుంది.

Most Read: మనస్సు మీ మాట వినట్లేదా? చీ ఇదేమీ జీవితం అనిపిస్తుందా? ఇలా చేసి చూడండి

7. దానిమ్మపండు రసం :

7. దానిమ్మపండు రసం :

దానిమ్మ పండు దాని అద్భుతమైన ప్రయోజనాలకు ప్రసిద్ది. మొక్కలోని అన్ని భాగాలను ఆయుర్వేద సంప్రదాయక ఔషదాలలో ఉపయోగిస్తారు; దానిమ్మ రసం, దాని యాంటి వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ది చెందింది. పండు యొక్క సారములు దంత ఫలకాన్ని సైతం నిరోధించగలవని అధ్యయనాలు చూపిస్తున్నాయి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవన శైలి, ఆహార,హస్త సాముద్రిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Natural Healing: 7 Everyday Foods That Are Also Effective Antiseptics

Changing seasons may be a natural process, but it also results in various illnesses, as people suffer from common cold, flu, fever, skin infections and allergies. This is mostly because at this time our body's immunity is weak as it tries to adapt itself to the changing climate.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more