మితిమీరిన ఆహరం లేదా నీరు మిమ్మల్ని చంపుతుందా?

Posted By: Gandiva Prasad Naraparaju
Subscribe to Boldsky

మితిమీరి నీరు తీసుకుంటే మీరు చనిపోతారా? ఏదైనా మితిమీరి తీసుకోవడ౦ అనేది మంచిది కాదు! అవును, మోతాదు ఎక్కువైతే మంచి పనులు కూడా చెడు అవుతాయి. పరిమితిని దాటితే ఆరోగ్యకరమైన ఆహరం కూడా ప్రాణాంతకం కావొచ్చు.

అధిక వినియోగం అనేది ప్రతికూల పరిణామాలను కలుగ చేస్తుంది. మనందరికీ తెలుసు. కానీ కొన్ని ఆహార పదార్ధాలు లేదా వాటికి చెందినవి మోతాదు ఎక్కువైతే మనిషిని చంపేయవచ్చు.

మీరు మితిమీరి తీసుకున్నపుడు ప్రాణాంతకమయ్యే ఆహారపదార్ధాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది. ఈ కింద ఇచ్చిన ఆహార పదార్ధాలను ఎక్కువగా తినడం అనే తప్పు ఎప్పటికీ చేయకండి.

మోతాదు మించి నీరు తాగడం

మోతాదు మించి నీరు తాగడం

ఒకేసారి మీరు 7-10 లీటర్ల కంటే ఎక్కువ నీరు తాగితే, మూత్రపిండాలు మీ వ్యవస్ధ నుండి నీరు బయటికి పంపడానికి చాలా కష్టపడతాయి. కొన్ని అరుదైన సందర్భాలలో, దీనివల్ల అవయవాల నష్టం లేదా మెదడు వాపు లేదా చివరికి శ్వాసకు ఇబ్బంది కూడా కలగవచ్చు. తద్వారా మరణం కూడా కలగవచ్చు.

మోతాదు మించి కెఫీన్

మోతాదు మించి కెఫీన్

మితిమీరి అంటే ఎంత? సరే, శక్తినిచ్చే పానీయాలలో అధిక మోతాదులో కెఫీన్ ని తీసుకొని చనిపోయినవారు ఉన్నారు. కాఫీ విషయానికి వస్తే, ఒక వ్యక్తి ఒకదాని తర్వాత ఒకటిగా 100 కంటే ఎక్కువ కప్పులు కాఫీ తాగితే, బతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కిడ్నీ ఆరోగ్యంగా వుండాలంటే నీరు ఎంత తాగాలి?

మోతాదు మించి చాకొలేట్స్

మోతాదు మించి చాకొలేట్స్

ఒక వ్యక్తి ఒకసారి దాదాపు 10 కిలోగ్రాముల చాక్లెట్లు తింటే, అంతర్గత రక్తస్రావం, ఎపిలేప్టిక్ ఫాట్స్, డయేరియా, వికారం, చివరికి మృత్యువు కూడా సంభవించే ప్రమాదాలు ఉన్నాయి.

మోతాదు మించి మద్యం

మోతాదు మించి మద్యం

ఒక డ్రింక్ లో 40% ఆల్కాహాల్ ఉంటుందనుకోండి. ఒక వ్యక్తి ఒక గంటలో 1.5 లీటర్ల కంటే ఎక్కువ మద్యాన్ని తాగితే, అది ప్రాణాంతకం! మృత్యువు సంభవిస్తుంది!

మోతాదు మించి సిగరెట్

మోతాదు మించి సిగరెట్

ఒకదాని తరువాత ఒకటిగా 75 సిగరెట్లు తాగితే చనిపోవచ్చు. ప్రతి సిగరెట్ దాదాపు 0.8 మిల్లీగ్రాముల నికోటిన్ ని కలిగి ఉంటుంది!

కడుపులో అదనంగా ఉన్న యాసిడ్లను (ఆమ్లత్వమును) తగ్గించే 10 రకాల ఆహార పదార్థాలు !

మోతాదు మించి యాపిల్

మోతాదు మించి యాపిల్

ఏమిటి? యాపిల్స్ ప్రమాదకరమా? ఏమైనా, ఒకేసారి 18 యాపిల్స్ విత్తనాల కంటే ఎక్కువ తిన్నా ప్రాణాంతకం కాదు. అందులో ఉండే సైనైడ్ కొన్ని సందర్భాలలో మృత్యువుని కలిగించవచ్చు.

మోతాదు మించి అరటిపండు

మోతాదు మించి అరటిపండు

అరటిపండు ఆరోగ్యకరం. అందులో పొటాషియం ఉంటుంది. కానీ మీరు పొటాషియం ఎక్కువగా తీసుకుంటే. అది ప్రమాదకరం కావొచ్చు. మితిమీరి అంటే ఎంత? ఏమైనా, ఒకదాని తరువాత ఒకటి 400 అరటిపండ్లు తింటే జీవితం దూరమవ్వొచ్చు.

మోతాదు మించి ఉప్పు

మోతాదు మించి ఉప్పు

ఒకేసారి దాదాపు 50 టీస్పూన్ల ఉప్పు తింటే అది ప్రాణాంతకం. అది చాలా బాధతో కూడుకున్నది కూడా.

మోతాదు మించి షుగర్

మోతాదు మించి షుగర్

ఒకేసారి 500 టీస్పూన్ల మించి షుగర్ తింటే ప్రాణాంతకం కావొచ్చు. అంతేకాదు, ప్రతి ఒక్క దానిలో నియంత్రణ అనేది ఆరోగ్యకరమైన జీవితానికి కీలకమైనది.

English summary

Overdose Of Water And Food

Does overdose of water kill you? Too much of anything is bad! Yes, even the good things may turn bad when the dosage is high. Even healthy foods can be deadly if you cross the limit. Read this!
Story first published: Monday, January 15, 2018, 13:00 [IST]