For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫాస్పరస్ ఎక్కువగా ఉండే మేటి 13 ఆహారపదార్థాలు

|

ఫాస్పరస్ చాలా ముఖ్యమైన ఖనిజలవణాలలో ఒకటి మరియు మానవశరీరంలో ఎక్కువ దొరికే ఖనిజలవణాలలో రెండవది. ఇది ఎముకలను మరియు పళ్లను గట్టిగా తయారుచేయటంలో మరియు మీ మెటబాలిజం ప్రక్రియ సజావుగా కొనసాగుతూ ఆహారాన్ని శక్తిగా మారుస్తూ ఉంటుంది.

శరీరంలో ముఖ్య అవయవాలైన, మెదడు, గుండె, కిడ్నీలు మరియు కాలేయం అన్నీ సరిగ్గా పనిచేయటానికి ఫాస్పరస్ ఆధారం. ఈ ఖనిజలవణం అస్థిపంజర నిర్మాణంలోనూ, హార్మోన్లు సహజంగా సమతుల్యంగా ఉండేట్లు సాయపడుతుంది.

పసిపిల్లల శరీరంలో 0.5 శాతం, పెద్దవారిలో 1 శాతం ఈ ఫాస్పరస్ ఉంటుంది. చిన్నపేగు ఇతర లవణాలతో పోలిస్తే, ఫాస్పరస్ ను సులభంగా పీల్చుకోగలదు.

ఫాస్పరస్ లోపం వలన బలహీనమైన ఎముకలు, ఆస్టియోపోరోసిస్, ఆకలిలో మార్పులు, కండరాల నొప్పులు, పళ్ళు క్షీణించటం, ఆందోళన, బరువు తగ్గటం లేదా పెరగటం మరియు ఇతర ఎదిగే సమస్యలు కూడా కలుగుతాయి.

మీ వంటిలో ఫాస్పరస్ ను ఈ ఫాస్పరస్ ఎక్కువ ఉండే 13 ఆహారపదార్థాలను తింటూ పెంచుకోండి.

1.సోయాబీన్స్

1.సోయాబీన్స్

సోయాబీన్స్ ప్రొటీన్ మరియు ఫాస్పరస్ కి మంచి వనరు. 1 కప్పు సోయాబీన్స్ లో 1309మిగ్రాల ఫాస్పరస్ ఉండి మీరు రోజూ తీసుకోవాల్సిన ఫాస్పరస్ లో 131 శాతం అందిస్తుంది. సోయాబీన్స్ లో కాపర్, మాంగనీస్, జింక్, కాల్షియం వంటి ఇతర ఖనిజలవణాలు కూడా ఉంటాయి.

2.అవిసె గింజలు

2.అవిసె గింజలు

అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. 1చెంచా అవిసె గింజల్లో 65.8మిగ్రాల ఫాస్పరస్ ఉండి మీరు రోజూ తీసుకోవాల్సిన దాంట్లో 7 శాతం పూర్తవుతుంది. మీరు అవిసె గింజల్ని మీ స్మూతీలలో కానీ, సలాడ్ లో కానీ జతచేసుకుని ఫాస్పరస్ ను పెంచుకోవచ్చు.

3.పప్పు ధాన్యాలు

3.పప్పు ధాన్యాలు

తెల్లబీన్స్ మరియు పెసలు వంటి ధాన్యపుగింజల్లో ఎక్కువ ఫాస్పరస్ మరియు ప్రొటీన్ ఉంటుంది. 1 కప్పు పప్పుధాన్యాలలో 866మిగ్రాల ఫాస్పరస్ ఉంటుంది, ఇది రోజూ తీసుకోవాల్సిన దాంట్లో 87శాతాన్ని పూర్తి చేస్తుంది. పప్పుధాన్యాల్లో పీచుపదార్థం, ఫోలేట్ మరియు పొటాషియం కూడా ఉండి గుండె ఆరోగ్యానికి మంచివి.

4.ఓట్’స్

4.ఓట్’స్

ఓట్’స్ చాలామందికి ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్. అందులో ఉండే ఫాస్పరస్ మరియు పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారించి, రక్తంలో చక్కెరస్థాయిలను స్థిరంగా ఉంచి రక్తపోటును నియంత్రిస్తాయి. 1 కప్పు ఓట్’స్ లో 816మిగ్రాల ఫాస్పరస్ ఉండి రోజూ తీసుకోవాల్సిన ఫాస్పరస్ లో 82 శాతాన్ని పూర్తి చేస్తుంది.

5.పింటో బీన్స్

5.పింటో బీన్స్

పింటో బీన్స్ లో ఫాస్పరస్ మరియు పాలీఫినోల్స్ కణుతులు పెరగటాన్ని నిరోధిస్తాయి. ఒక కప్పు పింటో బీన్స్ లో 793 మిగ్రాల ఫాస్పరస్ ఉండి రోజుకి కావాల్సిన 79 శాతం లభిస్తుంది.

6.బాదం

6.బాదం

బాదం పప్పులో ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ ఇ, ప్రొటీన్ మరియు ఫైబర్ ఉంటాయి. ఇవి చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. 23 బాదంపప్పులలో 137మిగ్రాల ఫాస్పరస్ ఉండి రోజువారీ తీసుకోవాల్సిన 14 శాతంను పూర్తి చేస్తుంది.

7.గుడ్లు

7.గుడ్లు

గుడ్లలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి, అవి ఫాస్పరస్, ప్రొటీన్, విటమిన్ బి2 మరియు ఇతర ముఖ్య పోషకాలు. 1 మధ్యసైజు గుడ్డులో 84మిగ్రాల ఫాస్పరస్ మీరు రోజువారీ తీసుకోవాల్సిన 8 శాతాన్ని పూర్తి చేస్తుంది.

8. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు

8. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు

పొద్దుతిరుగుడు పువ్వుల విత్తనాలలో ఫాస్పరస్ మరియు విటమిన్ ఇ ఉంటుంది, ఇవి ఫ్రీ రాడికల్స్ విషపదార్థాల నుంచి కణాలను రక్షిస్తాయి. 1 కప్పు పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలలో 304 మిగ్రాల ఫాస్పరస్ ఉండి మీ రోజువారీ తీసుకోవాల్సిన దాంట్లో 30 శాతం పూర్తి చేస్తుంది. ఈ విత్తనాలను మీ ఓట్ మీల్ లేదా స్మూతీలలో జతచేసుకోండి.

9.ట్యూనా

9.ట్యూనా

ట్యూనా చేపలో ఫాస్పరస్, ఒమేగా-3- ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉండి, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ట్యూనాలో ఎక్కువ ప్రొటీన్ ఉండి, తక్కువ క్యాలరీలు ఉంటాయి మరియు ఒక క్యాన్ ట్యూనాలో 269మిగ్రాల ఫాస్పరస్ ఉండి 27శాతం మీరు రోజూ తీసుకోవాల్సిన ఫాస్పరస్ ను పూర్తి చేస్తుంది.

10.బ్రౌన్ రైస్

10.బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో ఫాస్పరస్,మెగ్నీషియం మరియు ఇతర ముఖ్యమైన ఖనిజలవణాలు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. 1 కప్పు బ్రౌన్ రైస్ లో 185 మిగ్రాల ఫాస్పరస్ ఉండి మీరు రోజూ తీసుకోవాల్సిన ఫాస్పరస్ లో 62 శాతాన్ని పూర్తి చేస్తాయి.

11. చికెన్ బ్రెస్ట్

11. చికెన్ బ్రెస్ట్

చికెన్ బ్రెస్ట్ సన్నని మాంసం కిందకి వస్తుంది, ఇందులో ఫాస్పరస్ మరియు ప్రొటీన్ ఉండి కండరాలు పెరగటానికి, అస్థిపంజర కణజాలాలు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతాయి. ½ చికెన్ బ్రెస్ట్ లో 196 మిగ్రాల ఫాస్పరస్ ఉండి అది మీరు రోజూ తీసుకోవాల్సిన ఫాస్పరస్ లో 20 శాతాన్ని పూర్తి చేస్తుంది.

12.బంగాళదుంపలు

12.బంగాళదుంపలు

బంగాళదుంపలలో ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ సి ఉంటాయి, ఇవి రక్తపోటును నియంత్రించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒక పెద్ద బంగాళదుంపలో 210మిగ్రాల ఫాస్పరస్ ఉండి మీరు రోజూ తీసుకోవాల్సిన దాంట్లో 21 శాతాన్ని పూర్తి చేస్తుంది.

13. పచ్చిపాలు

13. పచ్చిపాలు

ముఖ్య ఖనిజ లవణాలైన ఫాస్పరస్, కాల్షియం, సోడియం మరియు పొటాషియం పాలల్లో పుష్కలంగా ఉంటాయి. 1 కప్పు పచ్చిపాలల్లో 212మిగ్రాల ఫాస్పరస్ ఉంటుంది. రోజూ పాలు తాగటం వలన మీ శరీరపు కణాలు, కణజాలలను రిపేర్ చేసి అలాగే బాగా పనిచేయిస్తూ, కండరాల నొప్పిని కూడా తగ్గిస్తుంది.

English summary

Top 13 Foods Rich In Phosphorus

Top 13 Foods Rich In Phosphorus,Phosphorous is an essential mineral and the second most abundant mineral found in the human body. Know about the foods that are rich in phosphorous.
Desktop Bottom Promotion