దట్టమైన గడ్డాన్ని కోరుకుంటున్నారా ? అయితే మీ ఆహారప్రణాళికలలో ఈ పోషకాలు ఉండేలా చూసుకోండి.

Subscribe to Boldsky

కొందరు పురుషులు క్లీన్-షేవెన్ ముఖాన్ని ఇష్టపడుతుంటారు, కొందరు గడ్డానికి అధిక ప్రాధాన్యతని ఇస్తుంటారు. ఈ ప్రాధాన్యతలకు కూడా కారణాలు ఉంటాయి. గడ్డం, కాలుష్య కోరలకు గురికాకుండా ముఖాన్ని కాపాడుతుంది. మొటిమలను, ఆక్నే సమస్యను కనపడనీయకుండా దాచేస్తుంది. అంతేకాకుండా, కొందరికి గడ్డమే అందం అన్నట్లుగా ఉంటుంది. క్రమంగా అనేకమంది మందపాటి గడ్డాన్ని పొందే క్రమంలో భాగంగా, మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేకరకాల ఉత్పత్తులను ఉపయోగించడం జరుగుతుంటుంది. బీర్డ్ ఆయిల్స్, క్రీమ్స్ అంటూ. కానీ ఈ ఉత్పత్తులు దీర్ఘకాల ప్రయోజనాలను ఇస్తాయి అనుకోవడం పొరపాటే. కావున దట్టమైన గడ్డాన్ని పొందే క్రమంలో భాగంగా దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందేలా ఆచరణలు చేపట్టవలసి ఉంటుంది. అందులో భాగంగా మీరు మీ ఆహార ప్రణాళికలో జోడించుకోవలసిన పోషకాల జాబితాను ఇచ్చట పొందుపరచడం జరిగింది.

అమెరికన్ డైటీటిక్ అసోసియేషన్ ప్రకారం, మీ గుండె మరియు ఇతర ప్రధాన అవయవాలమీద సానుకూల ప్రభావాన్ని కలిగి ఉండే పోషకాలు మీ చర్మం మరియు జుట్టు మీద కూడా అదే ప్రభావాన్ని చూపుతాయి.

8 Must Know Foods That Promote Beard Growth

ముఖం మీది జుట్టు పెరుగుదల పూర్తిగా పురుషుల సంబంధిత హార్మోన్లు అయిన DHT మరియు టెస్టోస్టెరాన్ ద్వారా నియంత్రించబడుతుంది. మీ ప్రణాళికలో కొన్ని ఆహార పదార్ధాల పెరుగుదల కూడా ఈ రెండు హార్మోన్ల స్థాయిలను పెంచుతుందని సూచించబడింది. వీటిని అండ్రోజెన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి ముఖం మీది గడ్డాన్ని ఉద్దీపనగావించడానికి ఉపయోగించబడుతాయి.

మీరు మందపాటి గడ్డాన్ని పొందే క్రమంలో సహాయపడగల పోషకాల గురించిన వివరాలను తెలుసుకునేందుకు ఈ వ్యాసం ఎంతగానో సహకరిస్తుంది.

1. విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ :

1. విటమిన్ ఎ మరియు బీటా కెరోటిన్ :

పాలకూర, గుడ్డు పచ్చసొన మరియు చీజ్ వంటి వాటిలో విటమిన్ ఎ విరివిగా లభిస్తుంది. అదేక్రమంలో బీటాకెరోటిన్, పసుపు మరియు నారింజ రంగులలోని, క్యారట్లు, చిలగడదుంపలు, గుమ్మడికాయ మరియు బచ్చలి కూర, కాలే వంటి ఆకుపచ్చని ఆకుకూరలు వంటి ఆహారాలలో లభిస్తుంది. ఈ ఆహారాలు తరచుగా తీసుకోవడం ద్వారా, ఒకపక్క గడ్డం పెరుగుదలకు సహకరిస్తూనే, మరోపక్క చర్మ కణజాలాలను నిర్వహించడానికి మరియు రిపేర్ చేయడానికి మీకు సహాయపడుతుంది.

2. విటమిన్ సి :

2. విటమిన్ సి :

సిట్రస్ పండ్లు, గ్రీన్ పెప్పర్, మరియు ముదురు ఆకుపచ్చని ఆకుకూరల్లో ప్రధానంగా విటమిన్ సి లభిస్తుంది. శరీరానికి యాంటీఆక్సిడెంట్ల వలె పనిచేస్తుంది. శరీరంలో సెబం ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా విటమిన్ సి పనిచేస్తుంది. ఇది శరీరం ఉత్పత్తిచేసే సహజసిద్దమైన నూనెల ద్వారా, చర్మాన్ని మరింత మెరుగుపరుస్తుంది మరియు జుట్టుకు తేమను అందిస్తుంది. క్రమంగా మీ గడ్డం దట్టంగా పెరుగుతుంది.

3. ప్రోటీన్ :

3. ప్రోటీన్ :

గుడ్లు, లీన్-మీట్, చేపలు, బీన్స్, పాలు వంటి వాటిలో ప్రోటీన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ గడ్డం పెరుగుదలలో సహాయపడుతుంది. చర్మం మరియు జుట్టు ప్రధానంగా కెరాటిన్ అనే ఒక నిర్మాణాత్మకమైన ప్రోటీన్తో తయారు చేయబడుతుంది. ఇది గ్లైసిన్ మరియు ప్రోలిన్ అని పిలువబడే అమైనో ఆమ్లాలతో తయారు చేయబడుతుంది. అంతేకాకుండా జుట్టు, గోర్లు మరియు చర్మం నిర్మించడానికి ఉపయోగపడే ప్రోటీన్లుగా ఉంటాయి.

4. బయోటిన్ :

4. బయోటిన్ :

గడ్డం పెరుగుదలలో అధికంగా సహాయపడే బయోటిన్ యొక్క ఉత్తమ మూలాలుగా గుడ్లు ఉంటాయి. ఇది ఎక్కువకాలం గడ్డం దట్టంగా పెరగడంలో సహాయపడుతుంది. మరియు కొన్ని అధ్యయనాలు, బయోటిన్ లోపం, గడ్డం పెరుగుదలను తగ్గించినట్లుగా చూపించాయి కూడా.

5. విటమిన్ ఇ :

5. విటమిన్ ఇ :

విటమిన్ E అనేది గడ్డం మృదువుగా పెరిగేందుకు మరియు వెంట్రుకల ఉపరితలంపై రక్తప్రవాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది. క్రమంగా ముఖంపై గడ్డం దట్టంగా పెరగడంలో సహాయం చేస్తుంది. మృదువుగా ఉన్న కారణంగా షేవింగ్ సమయంలో మీకు ఎంతో సౌకర్యంగా కూడా ఉంటుంది. మీ ఆహార ప్రణాళికలో కాయగూరలు, బీన్స్, ఆకుపచ్చని ఆకుకూరలు జోడించడం ద్వారా, పుష్కలంగా విటమిన్ E ని పొందగలరు.

6. విటమిన్ B6, B3 మరియు B12 :

6. విటమిన్ B6, B3 మరియు B12 :

ఈ B విటమిన్లు మీ శరీరం ప్రోటీన్ సంశ్లేషణా ప్రక్రియలో సహాయం చేయడం ద్వారా చర్మకణాలను నిర్మించడానికి మరియు గడ్డం పెరుగుదలలో సహాయపడుతుంది. అంతేకాకుండా గడ్డం కుదుళ్ళలో రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతూ, క్రమంగా గడ్డం దట్టంగా పెరగడంలో సహాయం చేస్తుంది. మరియు పురుష హార్మోన్ల ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుంది.

చికెన్ కాలేయం, వేరుశెనగ, కాయగూరలు, తృణధాన్యాలు, గుడ్లు మొదలైన ఆహారాలలో ఈ B విటమిన్లను గుర్తించవచ్చు.

7. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు :

7. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు :

చేప నూనెలో పుష్కలంగా ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, శరీరంలో ప్రోటీన్ ఉత్పత్తిని ప్రోత్సహించే కొవ్వులకు మంచి మూలాలుగా ఉన్నాయి. ఇవి, గడ్డం దట్టంగా పెరగడంలో సహాయం చేస్తాయి. మేకరేల్, ట్యూనా, సాల్మోన్, సార్డినెస్, మొదలైన వాటిలో ఈ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.

8. జింక్ :

8. జింక్ :

జింక్ గుడ్లు, ఆకుపచ్చని ఆకుకూరలు, చేపలు, తదితర ఆహార పదార్థాలలో పుష్కలంగా లభిస్తుంది. మరియు ఈ ఆహార పదార్ధాలు తీసుకోవడం మూలంగా మీ జుట్టు ఫొలికల్స్ అభివృద్ధిలో సహాయపడుతూ. గడ్డం దట్టంగా పెరగడంలో మద్దతిస్తుంది. ఆహారంలో జింక్ లేకపోవడం గడ్డం ఎదుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తుంది.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, వ్యాయామ, లైంగిక, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    8 Must Know Foods That Promote Beard Growth

    The nutrients that have a positive effect on your heart and other major organs have the same effect on your skin and hair. The facial hair growth is completely regulated by the male hormones DHT and testosterone. Increasing the intake of certain foods escalates the levels of these two hormones also called androgens which the body utilizes to stimulate facial hair growth naturally.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more