For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరెంజ్ మరియు ట్యాంజెరైన్ మధ్య గల తేడా

|

ట్యాంజెరైన్స్ కి అలాగే ఆరెంజ్ ల మధ్య కలిగిన తేడా మీకు తెలుసా? ఈ రెండూ సిట్రస్ ఫ్రూట్స్ అయినప్పటికీ కొంతమంది ఈ రెండిటి మధ్య తేడాను గమనించేందుకు ఇబ్బంది పడతారు. ఈ ఫ్రూట్స్ లో శరీరానికి అవసరమైనటువంటి అత్యవసర పోషకాలు లభిస్తాయి. అలాగే, ఇవి స్వీట్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. అదే సమయంలో వీటిలో కేలరీలు తక్కువగా లభిస్తాయి.

ట్యాంజెరైన్స్ అలాగే ఆరెంజ్ లు ఒకే రకంగా అనిపించినప్పటికీ కాస్త గమనిస్తే వీటిలోనున్న తేడాలను మనం గుర్తించవచ్చు. ఈ రెండూ వేరు వేరు పండ్లు.

ఆరెంజ్ లు తమ లోని స్వీట్ ఫ్లేవర్ వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అందుకే ఇది ప్రపంచంలోకెల్లా అతి ప్రాముఖ్యత కలిగిన పండ్లలో ఒకటిగా స్థానం పొందింది. ఈ విషయాన్ని "ఫ్రూట్స్ ఆఫ్ వార్మ్ క్లైమేట్స్" స్పష్టం చేసింది. మరోవైపు, ట్యాంజెరైన్ లు కూడా ప్రాముఖ్యత పొందిన పండ్లే. వీటి స్కిన్ పలచగా రెడ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉంటుంది.

ఈ ఆర్టికల్ లో ఆరెంజ్ మరియు ట్యాంజెరైన్ ల మధ్య గల తేడాను తెలుసుకోవచ్చు.

ట్యాంజెరైన్:

ట్యాంజెరైన్:

ట్యాంజెరైన్ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఫోలేట్, బీటా కెరోటిన్ కూడా లభిస్తుంది. ఇందులో 40 కేలరీలు, 1.5 గ్రాముల ఫైబర్ అలాగే పుష్కలంగా ఫ్లెవనాయిడ్స్ లభిస్తాయి. ట్యాంజెరైన్ లో లభించే విటమిన్ ఏ ఆరెంజ్ లో లభించే మోతాదు కంటే కనీసం మూడు రెట్లు అధికంగా ఉంటుంది. సలాడ్స్, డిజెర్ట్స్, జ్యూస్ లలో ట్యాంజెరైన్ ను తీసుకోవచ్చు. లేదంటే నేరుగా కూడా ఈ పండుని తీసుకోవచ్చు.

ట్యాంజెరైన్ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

1. కంటిచూపుకు మంచిది:

1. కంటిచూపుకు మంచిది:

60 ఏళ్ళ వయసు పైబడిన వారిలో మ్యాకులర్ డీజెనెరేషన్ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇది కంటిచూపుని కోల్పోయే ప్రమాదపు స్థాయిని పెంచుతుంది. ట్యాంజెరైన్ లో విటమిన్ సి అలాగే విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. తద్వారా, మ్యాకులర్ డీజెనెరేషన్ సమస్య బారిన పడే ప్రమాదాన్ని తగ్గించి కంటిచూపును సంరక్షిస్తుంది. తాజా ట్యాంజెరైన్ ను తీసుకుంటే ఫలితం ఉంటుంది.

2. ఎముకలను బలంగా ఉంచుతుంది:

2. ఎముకలను బలంగా ఉంచుతుంది:

ట్యాంజెరైన్ లో పొటాషియం తో పాటు విటమిన్ సి లభిస్తుంది. ఇది బోన్ డెన్సిటీను పెంచి ఫ్రాక్చర్స్ ను తగ్గిస్తుంది. అర్త్రైటిస్ అలాగే స్కిన్ డిసీజ్ లతో పోరాడే శక్తి ఈ పండుకు కలదు. కాబట్టి, తరచూ ఈ పండుని తీసుకోవడం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా అలాగే దృఢంగా ఉంచుకోవచ్చు.

3. ఐరన్ అబ్సర్ప్షన్ కి తోడ్పడుతుంది:

3. ఐరన్ అబ్సర్ప్షన్ కి తోడ్పడుతుంది:

ఆహారం ద్వారా లభించే ఐరన్ ని శరీరం గ్రహించేందుకు ఈ పండు తోడ్పడుతుంది. స్పినాచ్ వంటి ఫుడ్స్ లోంచి ఐరన్ ని శరీరం సులభంగా సులభంగా గ్రహించేందుకు ట్యాంజెరైన్ తోడ్పడుతుంది. శరీరంలో ఐరన్ లోపాన్ని అరికట్టేందుకు ఇదొక మంచి రెమెడీ. తద్వారా, శరీరానికి తగినంత ఐరన్ లభిస్తుంది.

4. యాంటిస్పాస్మాడిక్ నేచర్:

4. యాంటిస్పాస్మాడిక్ నేచర్:

స్పాస్మ్స్ అనేవి అనేక హెల్త్ కాంప్లికేషన్స్ ని అలాగే శరీరంపై ప్రతీకూల ప్రభావాన్ని చూపిస్తాయి. రెస్పిరేటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్ అలాగే నెర్వస్ సిస్టమ్ పనితీరును దెబ్బతీస్తాయి. తద్వారా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆస్త్మాకి గురవడంతో పాటు కంజెషన్ సమస్య ఎదురవుతుంది. ట్యాంజెరైన్ ను తీసుకోవడం లేదా ట్యాంజెరైన్ ఎసెన్షియల్ ఆయిల్ ను అప్లై చేసుకోవడం ద్వారా యాంటీస్పాస్మోడిక్ ఎఫెక్ట్ ను పొంది స్పాస్మ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.

5. వివిధ స్కిన్ కండిషన్స్ పై పోరాడుతుంది

5. వివిధ స్కిన్ కండిషన్స్ పై పోరాడుతుంది

ట్యాంజెరైన్ లో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. అందువలన, యాక్నే, పింపుల్స్ మరియు బ్లేమిషెస్ వంటి వివిధ చర్మ సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. అందుకే, ఈ పండులో గున్న గుణాలు వివిధ చర్మ సమస్యలతో పోరాడేందుకు తోడ్పడతాయి. గాయాలను నయం చేసి టిష్యూలను రీబిల్డ్ చేసేందుకు ఇందులో లభించే విటమిన్ ఏ తోడ్పడుతుంది. అలాగే, ముడతలు, డల్ స్కిన్ అలాగే ఫైన్ లైన్స్ ను అరికట్టేందుకు ఇందులో లభించే విటమిన్ ఏ తోడ్పడుతుంది.

ఆరెంజ్:

ఆరెంజ్:

యూ ఎస్ డి ఏ నేషనల్ న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం ఒక ఆరెంజ్ లో 62 కేలరీలు లభిస్తాయి. అలాగే ఒక ఆరెంజ్ లో 15 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1 గ్రాము ప్రోటీన్ అలాగే ఒక గ్రాము కంటే తక్కువ ఫ్యాట్ లభిస్తుంది. ఈ సిట్రస్ ఫ్రూట్ లో 70 ఎంజీ విటమిన్ సి, 39 ఎంజీ ఫోలేట్, మరియు 93 ఎంజీ బీటా కెరోటిన్ లభ్యమవుతుంది. ఆరెంజ్ లో 52 గ్రాముల కేల్షియం, 13 గ్రాముల మెగ్నీషియం, 18 గ్రాముల ఫాస్ఫరస్ అలాగే 237 గ్రాముల పొటాషియం లభిస్తుంది.

ఆరెంజ్ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరెంజ్ ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరెంజెస్ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి:

ఆరెంజ్ వంటి సిట్రస్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వలన మహిళల్లో ఇస్కెమిక్ స్ట్రోక్ కి గురయ్యే ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలున్నాయి. ఆరెంజ్ లో లభించే హెస్పెరిడిన్, ఫోలేట్ మరియు ఫైబర్ వంటి పదార్థాలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. సిట్రస్ ఫ్రూట్స్ ని అధిక మొత్తంలో తీసుకునే మహిళల్లో ఇస్కెమిక్ స్ట్రోక్ కి గురయ్యే ప్రమాదం 19 శాతం తక్కువగా ఉంది. ఈ పండును తక్కువగా తీసుకునే వారికంటే ఈ పండును తరచూ తీసుకునే వారిలో ఇస్కెమిక్ స్ట్రోక్ ప్రమాదం తక్కువ.

 బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది:

బ్లడ్ ప్రెషర్ ని తగ్గించేందుకు ఆరెంజ్ లు తోడ్పడతాయి. ఎలాగో మీకు తెలుసా? ఈ అద్భుతమైన సిట్రస్ ఫ్రూట్ లో హెస్పెరిడిన్ మరియు మెగ్నీషియం లభిస్తుంది. ఇవి బ్లడ్ ప్రెషర్ ని సమర్థవంతంగా నియంత్రిస్తాయి.

క్యాన్సర్ ని అరికడుతుంది:

క్యాన్సర్ ని అరికడుతుంది:

అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియోలజీ లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం, మొదటి రెండు సంవత్సరాలలో ఆరెంజ్ ను పండు రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా చైల్డ్ హుడ్ లుకేమియా బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. విటమిన్ సి ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ ను తగ్గిస్తుంది. తద్వారా క్యాన్సర్ కి గురయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలోన్, స్కిన్, లంగ్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదాల నుంచి పోరాడేందుకు తోడ్పడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి:

యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి:

ఆరెంజ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ ను అరికట్టి అనవసరమైన ఆక్సిడేషన్స్ ను తొలగిస్తాయి. ఈ ఆక్సిడేషన్ రియాక్షన్స్ వలెనే వివిధ వ్యాధులు అలాగే ఇంఫ్లేమేటరీ ఎక్స్పీరియన్స్ లకు గురవుతాము. ఆరెంజ్ లో లభ్యమయ్యే పోలీఫెనాల్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది.

English summary

What Is The Difference Between Orange And Tangerine

Tangerines and oranges are closely related, but they are actually two separate fruits with some notable differences. Tangerine fruit benefits include preventing vision loss, keeping bones strong, antispasmodic in nature, helping in iron absorption, etc. The benefits of orange include good for heart health, preventing cancer, lowering blood pressure, etc.
Story first published: Tuesday, May 8, 2018, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more