వర్క్ ప్లేస్ లంచ్ లో వేటికి ప్రాధాన్యతనివ్వాలో తెలిపే 9 సులభమైన చిట్కాలు

Posted By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

వృత్తి రీత్యా మీరు డెస్క్ జాబ్ కే అంకితమవ్వాల్సి వస్తోందా? అలాగే కొన్ని గంటలు క్యూబికల్స్ లో కూర్చోని కంప్యూటర్ కి అతుక్కోవలసి వస్తోందా?

పై ప్రశ్నలకి మీ సమాధానం అవునని వస్తే మీరు ఆరోగ్యంపై ఇప్పటినుంచైనా మరింత శ్రద్ధ వహించాలి. ఇటువంటి జాబ్స్ ఆరోగ్యకరం కావని తెలుసుకుని ఇకనుంచి ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

9 టు 6 డెస్క్ జాబ్స్ అనేవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తీసుకువస్తాయి. వీటిలో ఒత్తిడిపూర్వకమైన జాబ్స్ అయితే మరిన్ని సమస్యలను తెచ్చిపెడతాయి.

ఒకే ప్లేస్ లో ఎక్కువ సమయం కూర్చుని కనీస కదలికలు కూడా లేకుండా కంప్యూటర్ స్క్రీన్ కే పరిమితమైతే మీరు ఆరోగ్యాన్ని అన్నివిధాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని గుర్తించాలి.

అటువంటి డెస్క్ జాబ్స్ వలన కలిగే అనర్థాలని అరికట్టుకుని తద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పెంపొందించుకోవాలి.

ఇప్పటికే, ఇటువంటి జాబ్స్ కి అంకితమైపోయిన చాలా మందికి రోజులో కనీసం ఆరేడు గంటలు కదలకుండా కూర్చోవలసి రావడం అనుభవమే. మధ్య మధ్య ఆహారాన్ని మూడు సార్లు తీసుకుంటూ అదనంగా స్నాక్స్ ను కూడా తీసుకుంటూ రావడం తెలిసిన విషయమే కదా?

అధిక బరువు పెరగటం, హై కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, అజీర్ణ సమస్యలు, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి వర్క్ ప్లేస్ లో సరైన ఆహారనియమాలను పాటించకపోవడం వలన అలాగే సరైన శారీరక వ్యాయామాలు లేకపోవడం వలన కలిగే కొన్ని అనారోగ్య సమస్యలు.

కాబట్టి, ఇక్కడ వర్క్ ప్లేస్ లో తీసుకోవలసిన ఆహారాల గురించి తెలియచేసాము. వీటి ద్వారా కొంత వరకు అనారోగ్య సమస్యలను నిర్మూలించవచ్చు.

చిట్కా 1: జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేయండి

చిట్కా 1: జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేయండి

అవును, ఈ చిట్కా అనేది మీకు అనేక మంది ద్వారా అంది ఉండుంటుంది. ఈ చిట్కాని పాటిస్తే అనేకరకాల ఆరోగ్యసమస్యలను అరికట్టవచ్చు. జంక్ ఫుడ్ అనేది సులభంగా లభించే ఫుడ్. ఉద్యోగస్తులకు దీని వలన ఎంతో సౌకర్యం కలుగుతుంది. ఒత్తిడిని అలాగే విసుగుని తగ్గించే లక్షణం కలిగి వలన జంక్ ఫుడ్ ని ఎక్కువ మంది ఇష్టపడతారు. అయినప్పటికీ, జంక్ ఫుడ్స్ లో విషపదార్థాలు అలాగే కేలరీలు అధికంగా ఉంటాయి. అందువలన, వీటిని తీసుకోవడం వలన బరువు అధికంగా పెరుగుతారు.

చిట్కా 2: ఇంటివంటకే ప్రాధాన్యం ఇవ్వండి

చిట్కా 2: ఇంటివంటకే ప్రాధాన్యం ఇవ్వండి

ఇంటివంటే అన్నివిధాలా ఆరోగ్యకరం. అయితే ఆరోగ్యకరమైన ఇంటి వంట మీద ఆధారపడటం ఉద్యోగస్తులకు కాస్తంత కష్టతరమైన పనే. అయితే, ఆరోగ్యమే మహాభాగ్యమన్న పెద్దల మాటను దృష్టిలో పెట్టుకుని ఇంటివంటకే ప్రాధాన్యతను ఇవ్వడం వలన అనేకమైన అనారోగ్యసమస్యలను దూరంగా ఉంచుకోవచ్చు. బయట లభించే ఆహారపదార్థాల వలన అనేక అనారోగ్యసమస్యలు తలెత్తుతాయి. కాస్తంత శ్రమ పెట్టి ఇంటివంటపైనే ఆధారపడటం వలన అజీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, స్టమక్ క్యాన్సర్ తో పాటు అధిక బరువు వంటి వివిధ రకాల సమస్యలను అరికట్టవచ్చు.

చిట్కా 3: ఆరోగ్యకర పానీయాలను తీసుకుంటూ ఉండండి

చిట్కా 3: ఆరోగ్యకర పానీయాలను తీసుకుంటూ ఉండండి

ఒక పరిశోధన ప్రకారం డెస్క్ జాబ్ కి అంకితమైన వారు అలాగే కంప్యూటర్ కి అతుక్కునే వారు డీహైడ్రేషన్ సమస్యకు త్వరగా గురవుతారు. తద్వారా, డ్రై స్కిన్, మలబద్ధకం, విపరీతమైన అలసటతో పాటు అనేకరకాల ఆరోగ్యసమస్యలు బారిన పడతారు. కాబట్టి, తరచూ నీటిని తీసుకుంటూ ఉండడంతో పాటు వివిధ రకాల ఆరోగ్యకరమైన జ్యూస్ లను తీసుకుంటూ ఉంటే రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటారు!

చిట్కా 4: కేఫైనేటెడ్ డ్రింక్స్ ను దూరంగా ఉంచండి

చిట్కా 4: కేఫైనేటెడ్ డ్రింక్స్ ను దూరంగా ఉంచండి

ఆఫీస్ లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు తరచూ కాఫీలతో పాటు అనేక రకాల కేఫైనేటెడ్ డ్రింక్స్ కు అలవాటు పడతారు. అందువలన వారు పని ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. తద్వారా, పనిని చక్కగా చేయగలుగుతారు. అయితే, ఎక్కువగా కెఫైన్ ను, ప్రత్యేకించి చక్కెరతో తీసుకోవడం వలన అధిక బరువు పెరగటం తో పాటు, ఒత్తిడి, డయాబెటిస్ మరియు ఇతర సమస్యల బారిన పడే ప్రమాదం ఉంది.

చిట్కా 5: ఆరోగ్యకరమైన స్నాక్స్ కే ప్రాధాన్యతనివ్వండి

చిట్కా 5: ఆరోగ్యకరమైన స్నాక్స్ కే ప్రాధాన్యతనివ్వండి

జీడిపప్పు, బాదం, పిస్తా, ముయెస్లీ బార్లు, పళ్ళు, వెజిటబుల్ సలాడ్స్ వంటివి డెస్క్ వద్ద ఉంచుకుని స్నాక్స్ లా తింటూ ఉండండి. ఈ విధంగా చిరు ఆకలిని సంతృప్తి పరుస్తూ ఆరోగ్యంగా ఉండవచ్చు. బయటి ఆహారపదార్థాలపై ఆధారపడే కంటే ఈ విధంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఎంతో ఉత్తమం. తద్వారా, అదనపు బరువు సమస్యతో పాటు దాంతో అనుసంధానమైన సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.

చిట్కా 6: ఆకలిని డైవర్ట్ చేయండి

చిట్కా 6: ఆకలిని డైవర్ట్ చేయండి

వర్క్ ప్లేస్ లో కొంతమందికి తరచూ ఆకలి వేస్తూ ఉంటుంది. అందువలన, ఇటువంటి వారు జంక్ ఫుడ్స్ కి అడిక్ట్ అయిపోతారు. పని ఒత్తిడి మరీ ఎక్కువైతే జంక్ ఫుడ్స్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ఆకలిని డైవర్ట్ చేసుకోవడం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా, అనవసరంగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోరు. తరచూ ఆకలి వేసినప్పుడల్లా, జంక్ ఫుడ్స్ ని తీసుకోకుండా నడకకు వెళ్లడం లేదా కొలీగ్ తో మాట్లాడడం ద్వారా ఆకలిని కాస్తంత నిరోధించవచ్చు.

చిట్కా 7: ఆహారం తీసుకునే మోతాదును గమనించండి

చిట్కా 7: ఆహారం తీసుకునే మోతాదును గమనించండి

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అలాగే స్నాక్స్ ని తీసుకుంటూ ఉన్నా వాటి మోతాదుని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కువగా వీటిని తీసుకోవడం కూడా మంచిది కాదు. పనిలో నిమగ్నమైపోయి ఎంత ఆహారాన్ని తీసుకుంటున్నారో గమనించని స్థితిలో ఉంటారు. అందువలన, ఎంత మోతాదులో ఆహారాన్ని తీసుకుంటున్నారో ట్రాక్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా అదనపు బరువును తగ్గించుకోవచ్చు.

చిట్కా 8: నడకకు ప్రాధాన్యతనివ్వండి

చిట్కా 8: నడకకు ప్రాధాన్యతనివ్వండి

ఎప్పుడో ఒక్కసారి మీరు ఇంటి ఆహారాన్ని ఎదో ఒక కారణం చేత ప్యాక్ చేసుకోలేకపోవచ్చు. అలాంటి సమయంలో, ఆఫీస్ కు రీజనబుల్ డిస్టెన్స్ లో ఉన్న హోటల్ కి గాని రెస్టారెంట్ కి గాని నడిచి చేరుకోండి. వెహికల్ ద్వారా వెళ్లే బదులు నడకకు ప్రాధాన్యమిస్తే మంచిది. ఇలా చేయడం ద్వారా కొన్ని కేలరీలను కరిగించవచ్చు. అలాగే, మెనూ లోంచి ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలనే ఎంచుకోండి.

చిట్కా 9: సులభంగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోండి

చిట్కా 9: సులభంగా జీర్ణమయ్యే పదార్థాలనే తీసుకోండి

డెస్క్ జాబ్ అంటేనే శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి, సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలకు ప్రాధాన్యతనివ్వండి. జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పట్టే భారీ మీల్స్ ను తీసుకోకపోవడం ద్వారా జీర్ణ సమస్యలను అలాగే అదనపు బరువు సమస్యలను అరికట్టవచ్చు. చేప, కూరగాయలు, అవొకాడో, ఓట్స్, ఎగ్స్ వంటివి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు.

ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి

English summary

What To Eat At Work For Lunch? 9 Simple Tips And Ideas

Desk-bound jobs which require people to work in front of the computer for hours have many health hazards. And your eating habits at work can have a major impact on your health. So are a few tips to help you eat healthy at work.
Story first published: Thursday, January 11, 2018, 13:00 [IST]