For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ కాఫీ మంచిదా? బ్లాక్ కాఫీ మంచిదా?

|

మీరు కాఫీ ప్రేమికులా? మరియు రోజూ మీ ఉదయం కప్పు కాఫీతో ప్రారంభించేలా ఉంటారా? నిజమే అనేక మందికి కాఫీ పడనిదే, అడుగు కూడా వేయలేము అన్నట్లుగా ఉంటారు. కొంతమంది కాఫీ ప్రేమికులైతే రోజూవారీ ప్రణాళికలో భాగంగా కాఫీని జతచేసుకుంటూ ఉంటారు. కానీ, మీరు కాఫీ ఎలా తీసుకుంటారు సాధారణ కాఫీనా, లేక బ్లాక్ కాఫీనా? పోషకవిలువల ప్రకారం, శరీరానికి అవసరమయ్యే అంశాలు దేనిలో ఉన్నాయి అని తెలుపడంలో ఈ వ్యాసం సహాయం చేస్తుంది.

మీ జ్ఞాపకశక్తి మెరుగుపరచడం మరియు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది కాఫీ. ఎంతో మంది వ్యక్తుల విజయ రహస్యంలో తెలీకుండా తనవంతు కృషిని అందించిన ఒకే ఒక్క పదార్ధం కాఫీ. అంతగొప్ప ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, ఏకంగా కాఫీ మీద కవితలు, పాటలు, గేయాలు కూడా రాసేస్తున్నారు కాఫీ ప్రియులు. ఈ ప్రపంచంలోని వ్యక్తులందరికి తమకు నచ్చిన అంశాల మీద ఓటు వేయమని చెప్తే కాఫీ మొదటి 5 స్థానాలలో ఉంటుందని మాలాంటి కాఫీ ప్రియుల ప్రఘాడ నమ్మకం.

Which One Is Better? Regular Coffee Or Black Coffee

అదంతా సరే, అసలు బ్లాక్ కాఫీ అంటే ఏమిటి?

పాలు కలపకుండా, కేవలం నీళ్ళలో కాఫీ గింజలను లేదా కాఫీ పొడి వేసి మరగబెట్టి, వడకట్టిన కాఫీని బ్లాక్ కాఫీ అంటారు. రుచికోసం చక్కర మాత్రమే కాకుండా అనేక పదార్ధాలను కూడా జోడిస్తున్నారు ప్రస్తుత కాలంలో.

సాధారణ కాఫీ అంటే ఏమిటి?

రెగ్యులర్ కాఫీని క్రీమ్ లేదా పాలు మరియు చక్కెరతో తయారు చేస్తారు.

బ్లాక్ కాఫీ మరియు సాధారణ కాఫీ(పాలు-చక్కెర కలిసిన) మధ్య ఉన్న తేడా:

సాధారణ కాఫీ మంచిదా? బ్లాక్ కాఫీ మంచిదా?

# బ్లాక్ కాఫీ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

# బ్లాక్ కాఫీ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

మీరు సమర్థవంతంగా బరువు కోల్పోవాలని చూస్తున్నట్లయితే, అప్పుడు మీకు ఖచ్చితంగా సూచించదగిన కాఫీ, బ్లాక్ కాఫీ. ఎందుకంటే పాలు మరియు చక్కెర కలిపిన కాఫీతో పోలిస్తే బ్లాక్-కాఫీలో తక్కువ కేలరీలు ఉంటాయి,. ఒక కప్పు బ్లాక్ కాఫీలో 4.7 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. ఇదే, సాధారణ కాఫీలో 56.6 కేలరీలుగా ఉంది.

సాయంత్రం వేళ చక్కెర మరియు పాలతో కాఫీ:

సాయంత్రం వేళ చక్కెర మరియు పాలతో కాఫీ:

ఆరోగ్య నిపుణులు చెప్తున్న ప్రకారం, మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సాధారణ కాఫీ కన్నా, బ్లాక్ కాఫీ ఎక్కువగా సహాయం చేస్తుంది. దీనికి కారణం పాలు, క్రీం, చక్కర వంటివి లేకపోవడమే అని అంటున్నారు.

మరియు సాయంత్రం వేళల్లో కాఫీ తాగడం కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. అనేకులకు ఈ సమస్య వేళ కాని వేళల్లో కాఫీ తీసుకోవడం వలన వస్తుంది అన్న అవగాహన కూడా ఉండదు. మీరు సాయంత్రం వేళల్లో కాఫీ తీసుకుంటూ నిద్ర లేమి సమస్యలకు గురవుతున్నారని భావిస్తే, వీలైనంత త్వరగా సమయాన్ని మార్చుకోవడం లేదా సాయంత్రం వేళల్లో కాఫీ మానివేయడం వంటివి చేయడం మంచిది. ఒకవేళ సాయంత్రం వేళ కాఫీపైకి మనసు వెళ్తున్నట్లయితే బ్లాక్ కాఫీ ఎంపిక చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మీకు ఎసిడిటీ సమస్య ఉంటే సాధారణ కాఫీ తీసుకోవడం ఉత్తమం:

మీకు ఎసిడిటీ సమస్య ఉంటే సాధారణ కాఫీ తీసుకోవడం ఉత్తమం:

మీరు ఎసిడిటీ సమస్యలను కలిగి ఉంటే, బ్లాక్ కాఫీకి దూరంగా ఉండడం మంచిది. దీనికి కారణం బ్లాక్ కాఫీలో పిహెచ్ స్థాయిలు అధికంగా ఉండడమే. మరియు, సాధారణ కాఫీ కూడా మీ మూత్రంలో ఆమ్ల గాఢతను పెంచుతుంది. కాబట్టి మీరు దాని ప్రభావం తటస్తం చేయుటకు నీరు, పండ్ల రసాలు మరియు సరైన మోతాదులో కూరగాయలను శరీరానికి అందిస్తుoడాలి. ఒకవేళ కాఫీ తీసుకోవాలి అనిపిస్తే తక్కువ మోతాదులో సాధారణ కాఫీవైపుకు మొగ్గు చూపడం మంచిది.

# కాఫీలో పాలు కలిపి తీసుకోవడం ద్వారా వెన్నెముక క్యాన్సర్ నిరోధించవచ్చు

# కాఫీలో పాలు కలిపి తీసుకోవడం ద్వారా వెన్నెముక క్యాన్సర్ నిరోధించవచ్చు

రోజూవారీ క్రమంలో భాగంగా రెగ్యులర్ కాఫీ తీసుకోవడం మూలంగా, వెన్నెముక కణజాలాలలో మంటను, వాపును తగ్గించే క్రమంలో సహాయపడడమే కాకుండా, వెన్నెముక కాన్సర్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకోగలదు. వేడి కాఫీలో, చల్లటి పాలు వేడిని క్రమబద్దీకరిస్తుంది.

బ్లాక్ కాఫీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

బ్లాక్ కాఫీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు:

సాధారణ కాఫీ కన్నా బ్లాక్ కాఫీ అధిక ఆరోగ్యప్రయోజనాలను కలిగి ఉంటుంది.

బ్లాక్ కాఫీ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ వివరించబడింది.

1. ఆరోగ్యకర కాలేయం:

బ్లాక్ కాఫీ తీసుకోవడం మీ కాలేయం యొక్క పరిస్థితిని మెరుగుపరుస్తుంది మరియు రోజులో 4 నుండి 5 కప్పుల బ్లాక్ కాఫీ తీసుకునే వారిలో 80 శాతం తక్కువగా కాలేయ సంబంధిత సిర్రోసిస్ సమస్య ప్రభావాన్ని కలిగి ఉన్నారని తేలింది. మరియు కాలేయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 40 శాతం తక్కువగా ఉన్నట్లు తేలింది.

2. మీ జీవక్రియలను పెంచుతుంది:

2. మీ జీవక్రియలను పెంచుతుంది:

మీరు బరువు కోల్పోవాలనుకుంటున్నారా? ఊబకాయం నేరుగా శరీరంలోని కొవ్వుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. కావున బ్లాక్ కాఫీ తీసుకోవడం మంచిదిగా సూచిస్తుంటారు. అలాగని కాఫీ ఒక్కటే తాగి మిగిలిన పోషకాలకు దూరంగా ఉండమని కాదు. కాఫీ కేవలం 11 శాతం మాత్రమే జీవక్రియల రేటును పెంచుతుంది.

3. మిమ్ములను స్మార్ట్ గా చేస్తుంది:

3. మిమ్ములను స్మార్ట్ గా చేస్తుంది:

కాఫీ మానసిక ఉత్తేజానికి ప్రధాన కారకంగా ఉంటుందని చెప్తారు. మీరు కాఫీని తాగితే, కెఫీన్ మీ జీర్ణ వ్యవస్థలోకి వెళ్లి, రక్త ప్రసరణ ద్వారా చివరకు మీ మెదడుకు చేరుతుంది. కెఫీన్ మెదడును తాకినప్పుడు, అడెనోసిన్ అనే చెడు న్యూరోట్రాన్స్మిటర్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.

నోరోపైన్ఫ్రైన్ మరియు డోపమైన్ అని పిలువబడే ఇతర మంచి న్యూరోట్రాన్స్మిటర్ల పెరుగుదలకు కారణమవుతుంది. దీనివలన మెదడులోని న్యూరాన్లు వేగవంతంగా స్పందించడానికి, ఉత్తెజితమవడానికి కారణమవుతాయి. ఈ న్యూరాన్లు మీ శక్తి, మానసికస్థితి, జ్ఞాపకశక్తి మరియు ఆలోచనా విధానం పెంచడానికి సహాయపడతాయి.

4. పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

4. పార్కిన్సన్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

పార్కిన్సన్స్ వ్యాధి, నాడీ సంబంధిత వ్యాధి. అది డోపమైన్ తో సంబంధం కలిగి ఉంటుంది. కెఫీన్ డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. కావున, బ్లాక్ కాఫీని తీసుకోవడం మూలంగా పార్కిన్సన్స్ వ్యాధి పెరిగే అవకాశాలు తగ్గిస్తుంది.

అలాగే, కాఫీని రోజూవారీ తీసుకునే వ్యక్తులలో ఈవ్యాధి 32 నుంచి 60 శాతం తక్కువ ఉన్నట్లు నిరూపించబడింది.

5. ఇది ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది:

5. ఇది ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది:

కాఫీ, అనామ్లజనకాలు మరియు విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, మెగ్నీషియం, పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఇతర పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే, ఆశ్చర్యకరంగా, మానవ శరీరం పండ్లు మరియు కూరగాయల కన్నా కాఫీ నుండి ఎక్కువ పోషకాలను పొందగలుగుతున్నాయని తేలింది.

6. ఇది డిప్రెషన్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది:

6. ఇది డిప్రెషన్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది:

'హ్యాపీ హార్మోన్' అని పిలువబడే మెదడులో డోపమైన్ స్థాయిలను పెంచడంలో కెఫీన్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. కావున, బ్లాక్ కాఫీ తీసుకోవడం మూలంగా రోజంతా ఆహ్లాదకరంగా సంతోషంగా మరియు ఉత్తేజభరితంగా ఉండడంలో సహాయం చేస్తుంది. బ్లాక్ కాఫీని తీసుకునే వారిలో 20 శాతానికి పైగా మానసిక సమస్యలు, ముఖ్యంగా డిప్రెషన్ సమస్యలు తగ్గుముఖం పట్టాయని నిరూపించబడింది.

7. టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

7. టైప్ 2 మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

మీరు పాలు మరియు చక్కెరతో కలిపి తీసుకునే రెగ్యులర్ కాఫీ అభిమాని అయితే, మీరు మధుమేహం పొందే అవకాశాలు పెరుగుతుంటాయి. మరోవైపు, బ్లాక్ కాఫీ తీసుకునేవారు, పాలు మరియు చక్కెరతో కాఫీని తీసుకునే వారితో పోలిస్తే 7 శాతం వరకు తక్కువగా టైప్ 2 డయాబెటీస్ వ్యాధిని కలిగి ఉన్నట్లు తేలింది.

8. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

8. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:

బ్లాక్ కాఫీని రోజులో నాలుగు కప్పులు తీసుకునే వారిలో పెద్దప్రేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశం 15 శాతం తక్కువగా ఉంది. ప్రపంచంలోని మరణాలలో నాలుగో ప్రధాన కారణం పెద్దపేగు క్యాన్సర్. బ్లాక్ కాఫీ చర్మ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది, ప్రత్యేకించి 20 శాతం మంది మహిళల్లో.

9. ప్రశాంతతను పెంచడంలో సహాయం చేస్తుంది

9. ప్రశాంతతను పెంచడంలో సహాయం చేస్తుంది

మీ మెదడును ప్రశాంత పరచి ఒత్తిడిని తగ్గించడంలో కాఫీ సహాయం చేస్తుంది. మెదడులో ప్రోటీన్ యొక్క కూర్పులో మార్పులు ఉన్నప్పుడు ఒత్తిడి అనేది సర్వసాధారణంగా ఉంటుంది. కావున ఒత్తిడిని తగ్గించే క్రమంలో బ్లాక్ కాఫీ మీకు చక్కగా సహాయపడగలదు.

10 గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తుంది

10 గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తుంది

కాఫీని త్రాగే వ్యక్తులలో 20 శాతం మందికన్నా తక్కువగా స్ట్రోక్ కలిగి ఉంటారు. బ్లాక్ కాఫీ హృదయ ఆరోగ్యానికి మంచిది. మరియు గుండె జబ్బు యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు రెండు నుండి మూడు బ్లాక్ కాఫీ కప్పులు తీసుకోవడం ద్వారా గుండెకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

11. మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది

11. మీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది

కాఫీని డైయురెటిక్ అని పిలుస్తారు. దీనికి కారణం కాఫీ, మూత్రాశయాన్ని తరచూ మూత్ర విసర్జనకు ప్రేరేపిస్తుంది. ఇది ఒకరకంగా మంచిదే, ఎందుకంటే ఇది మీ జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది మరియు మూత్రం ద్వారా మీ శరీరంలోని బ్యాక్టీరియా మరియు వైరస్లను బయటకు పంపుతుంది.

కావున పరిమిత మోతాదులో రోజులో 2, 3 కప్పుల బ్లాక్ కాఫీని ప్రణాళికలో భాగం చేయడం మంచిది

English summary

Which One Is Better? Regular Coffee Or Black Coffee

Are you a coffee lover and can't start your day without a cup of your morning coffee? It is the most essential component for your survival, isn't it? But, how do you like your coffee, black or with milk? This article will tell you which one is better, regular coffee or black coffee in terms of their nutritional value.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more