For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Weight Loss Fruits: బరువు తగ్గడమే మీ లక్ష్యమా? చలికాలంలో ఈ పండ్లు తినండి

మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఈ చలికాలంలో ఎలాంటి పండ్లు తినాలో ఇప్పుడు చూద్దాం.

|

Weight Loss Fruits: బరువు తగ్గాలని, శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోరుకుంటారు అంతే.. దానికి తగ్గ కసరత్తులు చేయరు. ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, లేట్ నైట్ లోనూ మసాలా దట్టించిన బిర్యానీలు తినడం చేస్తుంటారు. ఇక శారీరక శ్రమ కూడా అంతగా ఉండదు.

Weight Loss Fruits

ఇలాంటి జీవన శైలి వల్ల బరువు పెరుగుతారు. బరువ తగ్గాలనుకున్నప్పుడు డైట్ మెయింటైన్ చేయాలి. వ్యాయామం చేస్తుండాలి. తక్కువ కేలరీలు తీసుకుంటూ ఉండాలి. తాజా పండ్లు, కూరగాయలు తినాలి. ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారాలను తీసుకోవాలి.

మరికొందరు బరువు తగ్గాలని తినడం మానేస్తుంటారు. నెల లేదా రెండు నెలలు ఏమీ తినకపోతే బరువు తగ్గుతారని ఫ్రెండో, మరొకరు ఇచ్చిన సలహాలతో తినడం మానేస్తారు. దీని వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక కసరత్తులే ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గేందుకు సహాయపడతాయి. కొన్ని రకాల పండ్లు తీసుకోవడం వల్ల ఒంట్లోని కొలెస్ట్రాల్ కరుగుతుంది.

మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే ఈ చలికాలంలో ఎలాంటి పండ్లు తినాలో ఇప్పుడు చూద్దాం.

అంజీర్:

అంజీర్:

అంజీర్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించి ఎక్కువగా తినకుండా చేస్తుంది. దీంతో పాటు అంజీర్ లో జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి.

నారింజ:

నారింజ:

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది. ఇందులోని అధిక నీరు కొలెస్ట్రాల్ ను కరిగించడంతో పాటు చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

జామ

జామ

చలికాలంలో జామ కాయలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని పోషకాలు కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఇంక అనేక ఆరోగ్య ప్రయోజనాలు కల్పిస్తాయి.

దానిమ్మ

దానిమ్మ

ఆహారంలో దానిమ్మను చేర్చుకోవడాన్ని అస్సలే మరచిపోవద్దు. ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

సీతాఫలం

సీతాఫలం

సీతాఫలాల్లో విటమిన్ ఎ, సి మరియు పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం తింటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. సీతాఫలంలోని ఇతర పోషకాలు బరువు తగ్గేందుకు సాయపడతాయి. సీతాఫలం తినడం వల్ల మలబద్ధకం సమస్య వేధించదు.

English summary

Very effective fruits for weight loss this winter in Telugu

read on to know Very effective fruits for weight loss this winter in Telugu
Story first published:Sunday, December 4, 2022, 17:19 [IST]
Desktop Bottom Promotion