For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆందోళన తొలగింపుకు నాలుగే సూత్రాలు!

By B N Sharma
|

Four ways to come out of tension
ఆధునిక సమాజంలో చాలామంది ఒత్తిడికి లోనవుతున్నారు. వీరిలో తొంభై శాతం ప్రజలు ఒత్తిడి కారణంగా వచ్చే పలు జబ్బులతో బాధపడేవారు వైద్యుల వద్దకు వెళుతున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. మన శరీరం లేదా మనస్సు ఏదైనా పనిలో లగ్నమై దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైనప్పుడు మనిషి శరీరంలో మెటబాలిజమ్ అత్యంత వేగంగా పెరుగుతుందని వైద్యులు తెలిపారు. దీంతో రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం పెరిగిపోయి మానసికంగా, శారీరకంగాను పలు సమస్యలు ఉత్పన్నమౌతాయంటున్నారు వైద్యులు. టెన్షన్ నుండి బయటపడేందుకు దిగువ అంశాలు పరిశీలించండి.

1. ఒత్తిడిని తగ్గించే ఆహారం : మన శరీరానికి తగ్గట్టు కొన్ని ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాల్సివుంటుంది. దీంతో శరీరంలో ఏర్పడే ఒత్తిడిని తగ్గించవచ్చు. వీటిలో కమలాపండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుండాలి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనిషిలోని మెదడుకు బలాన్ని చేకూర్చుతుంది. బంగాళా దుంపలో విటమిన్ బీ గ్రూపునకు చెందిన విటమిన్లుంటాయి. దీంతో ఒత్తిడిని దూరం చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2. ఆహారం తీసుకోవడంలో మెళుకువలు : ఒత్తిడిని దూరం చేసేందుకు కొద్ది-కొద్దిగా ఆహారాన్ని చాలాసార్లు తీసుకోవాలంటున్నారు వైద్యులు. కొద్ది-కొద్దిగా ఆహారాన్ని తీసుకోవడంతో శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది. మనసులో ఏదీ ఉంచుకోకండి: ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒత్తిడికి గురవ్వడం సహజం. దీంతో మీ సమస్య ఏంటో మీ జీవిత భాగస్వామికి తెలపడం ఉత్తమం. లేదా ఏవరైనా మీ సన్నిహితుడు, అత్యంత ఆప్తమిత్రునితో సంభాషించండి.

3. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించండి : ఎవరైతే ఎక్కువ ఒత్తిడికి గురౌతుంటారో వారు ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొందరు ఒంటరిగా షికారు కొట్టేందుకు ఇష్టపడుతుంటారు. కొందరికేమో ఒంటరిగా కూర్చుని పుస్తక పఠనం చేసే అలవాటుంటుంది. చాలావరకు చీకటి గదిలో శయనించడంతో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కాని ఎక్కువసేపటి వరకు ఒంటరిగా ఉండటం కూడా అంత మంచిది కాదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎవరైతే వెంటనే ఒత్తిడికి లోనవుతారో అలాంటి వారు ఒంటరిగా ఉండకూడదని వైద్యులు సూచిస్తున్నారు.

4. కాసేపు ధ్యానం చేయండి : ప్రశాంతంగా కుర్చీలోనే కూర్చొని ధ్యానం చేయండి. కళ్ళు మూసుకుని కూర్చోండి. మెలమెల్లగా శ్వాసను తీసుకోండి. మీరు తీసుకునే శ్వాసనే గమనిస్తూ ఉండండి. మధ్యలో అంతరాయం కలిగించే ఆలోచనను మానేయండి. మళ్ళీ యధావిధిగా ధ్యానం చేసేందుకు ప్రయత్నించండి. ఇలా ప్రతి రోజు ఇరవై నిమిషాలపాటు ధ్యానం చేయండి. ఏకాగ్రత అలవరచుకుంటే అన్నిరకాల మంచిది.

English summary

Four ways to come out of tension | ఆందోళన తొలగింపుకు నాలుగే సూత్రాలు!

In this modern age, many people are facing tension. 90 percent of them are suffering from various diseases and are getting treatment. Anything we face create tension in us and increases metabolism. Consequently, blood pressure, heart beat increases. Mentally and Physically various problems crop up.
Story first published:Thursday, September 8, 2011, 16:47 [IST]
Desktop Bottom Promotion