For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్ర వల్ల సర్ ప్రైజింగ్ హెల్త్ బెనిఫిట్స్- వరల్డ్ స్లీప్ డే స్పెషల్

By Sindhu
|

ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు ఎవరయా అంటే కంటినిండా నిద్రపోయేవాళ్లే. ఉదయం లేచింది మొదలు అనేక ఒత్తిడులతో జీవనం గడిపేవారు నిద్రలేమిని ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారు. ఫలితం శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలెన్నో చుట్టుముడుతున్నాయి. యాంత్రిక జీవనంలో చాలామందికి మంచి నిద్ర అన్నదే గగనమవుతోంది. తగినంత నిద్రలేకుంటే మానసిక, శారీరక సమస్యలు తప్పవు. నిద్రలేమి చాలా ఆరోగ్య సమస్యలకు హేతువని వైద్య నిపుణులు హెచ్చరిస్తునే ఉన్నారు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరవెూ నిద్ర కూడా అవసరమే. మంచి ఆరోగ్యముతో ఉండాలంటే రోజుకు 8 గంటల నిద్ర అవసరం. అలా అని ఎక్కువ సేపు నిద్ర పోవడం, ఎక్కువగా తినటం రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. నిద్ర తక్కువ వలన మనిషి పడే అనారోగ్యం బయటకు కనపడదు. అది మన శరీరంలోని అన్ని అవయవాలను బాధిస్తాయి. అందువలన మనం ఫలానా రోజున నిద్ర పోలేమనో, నిద్ర తక్కువవుతుందనో తెలుసుకోగలిగినప్పుడు ఆ రాబోవు నిద్ర కొరతని ముందురోజే ఎక్కువ సేపు నిద్ర పోయి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇలా చేస్తే నిద్ర తక్కువవడం వల్ల కలిగే అనారోగ్యం తగ్గుతుంది. ఒక గంట సేపు పొద్దున నిద్ర పోతే అది ఒక రాత్రి నిద్రతో సమానమని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమే, కానీ ఎప్పుడో తెలుసా ఆ పగటి నిద్ర మంచి నిద్ర అయితేనే... అయినా రాత్రంతా నిద్ర పోవడం చాలా ముఖ్యం. నిద్ర వల్ల విశ్రాంతిని పొందడమే కాదు మన శరీరంలోని అతి ముఖ్య పనులకు సహాయపడుతుంది... అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగిస్తుంది మరి విలువైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

అందానికి: ఆరోగ్యానికి, నిద్రకు ప్రత్యక్ష సంభందం ఉన్నది. తగినంత నిద్ర లేకపోతె దాని ప్రభావం శరీర ఆరోగ్యంపై పడుతుంది. నిద్ర లేమి కళ్లు అలసటగా కనిపిస్తాయి. అందవిహీనంగా కనిపిస్తాయి. నిద్రలో అనేక శరీర కణాలు రిపేరు జరుగు తాయి. కొత్తకనాలు తయారవుతాయి. కొత్త కణాలు కొత్త అందాన్ని నిస్తాయి.

మెమరీ పవర్: నిద్ర సమయంలో మెదడు విశ్రాంతి పొందడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. ఏదైన ఒక మంచి పని చేయాలనుకొన్నా, నేర్చుకోవాలనుకొన్నా మంచిగా నిద్రపోయి లేవడం వల్ల కొత్త ఐడియాలతో చురుకుగా పనిచేయగలుగుతారు.

ఎక్కువ కాలం జీవించగలుగుతారు: అతి నిద్ర మరియు నిద్రలేమి జీవితాని రెండూ ప్రమాదమే. కాబట్టి మనిషి ఒక రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంట నిద్ర చాలా అవసరం. సరైన నిద్రపొందడం వల్ల అనే అనారోగ్య సమస్యల ఎదుర్కోవచ్చు.

వాపులను నిరోధిస్తుంది: వయస్సు పెరిగే కొద్ది లేదా ఏదైనా గాయాలు అయినప్పుడు అనుకోకుండా ఏర్పడే వాపులను నివారిస్తుంది. గుండె సంబంధిత వ్యాదులు, డయాబెటిస్, కీళ్ళనొప్పులు, ప్రీమెచ్యూర్ ఏజింగ్ వంటి సమస్యలన్నీ నిద్రలేమి వల్ల కలుగుతాయని కొన్ని అధ్యయనాలు కూడా తెలుపుతున్నాయి. వ్యాధినిరోధకతను పెంచుతుంది.

సృజనాత్మకత: మంచి నిద్రను పొందడం వల్ల మెదడు పునఃవ్యవస్థీకరణ మరియు వాటిని పునరుద్ధరించుకునేందుకు అలాగే మరింత సృజనాత్మకత కారణం కావచ్చు. కళాకారులకు మాత్రమే కాదు పనిచేసే ప్రతి ఒక్కరికీ సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త కొత్త ఐడియాలను పొంది వారిలో దాగున్న సృజనాత్మకత బయటకు తీస్తారు.

విజేత మీరే అవుతారు: మీరు కనుక అథ్లెట్స్ లో ఉంటే, మీ పనితీరు మెరుగుపరచడానికి ఒక అధ్బుతమైన సాధారణ మార్గం నిద్ర. ఒక స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం ఏడు నుంచి పది వారాల పాటు ప్రతి రోజూ రాత్రి కనీసం 10గంటలు నిద్రపోవడం వల్ల ఫుట్ బాల్ క్రీడాకారల్లో వారిలో ని యావరేజ్ స్పిరిట్ అభివృద్ధి చెంది పగలు అతి తక్కువ అలసట పొంది మరింత సామర్థ్యాన్ని పెంచుకొన్నారని తెయజేసింది.

గ్రేడ్స్ పెరగుతాయి: 10-16సంవత్సరంలోపు పిల్లలు మంచి నిద్రలో ఎటువంటి ఇబ్బందుల ఎదుర్కొన్నా వారిలో శ్రద్ద మరియు జ్ఞానార్జన సమస్యలు ఎక్కువగా ఉంటుంది. దాంతో బలహీనత చెంది క్లాసులో వెనుకబడుతారు. కాబట్టి నిద్ర పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వారు వరకూ ప్రతి ఒక్కరికీ చాలా అవసరం.

ఆరోగ్యరమైన బరువును కలిగి ఉంటారు: మీరు బరువు తగ్గడానికి డైయట్ ప్లాన్ చేస్తున్నట్లైతే ఖచ్చితంగా నిద్రవేళ కూడా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. నిద్ర సమయంలో శరీరంలోని జీవక్రియలన్నీ నియంత్రణలో ఉంటాయి. కొన్ని హార్మోన్లు రక్తంలో కలిసి, ఆకలిని పెంచుతాయి. సరైన నిద్రలేనప్పుడు ఆకలి పెరగడం వల్ల బరువు తగ్గే ఛాన్సే ఉండదు. కాబట్టి నిద్ర చాలా అవసరం.

ఒత్తిడి: మన ఆరోగ్యకరమైన ఒత్తిడి మరియు నిద్ర రెండూ ఒకే రకంలాంటివే. ఈ రెండూ హృదయ ఆరోగ్యం మీద ప్రభావం చూపించవచ్చు. సరైన నిద్ర పొందడం వల్ల ఒత్తిడిని ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. దాంతో బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.

డిప్రెషన్: సరైన నిద్ర లేకపోవడం వల్ల మన ఓవరాల్స్ హెల్త్ కు చాలా శ్రేయస్కరం. నిద్రలేమితో నిరాశనిస్ప్రుహలకు గురిఅవుతారు. మంచి నిద్రను పొండ పొందడం వల్ల వ్యక్తి మూడ్ మారుతుంది. ఆందోళన తగ్గుతుంది. భావోద్వేగాలను తగ్గించుకొంటారు.

మధుమేహం: నిద్రలేమితో టైప్ 2 డయాబెటిస్ దారితీస్తుంది. రక్తంలోని ఇన్సులిన్ స్తాయి తగ్గి హార్మోన్లపై ప్రభావం చూపెడుతుంది. కాబట్టి సరైన నిద్రను పొండం వల్ల మధుమేహానికి దూరంగా ఉండవచ్చు.

హెయిర్ ఫాల్: నిద్రలేమితో వివిధ ఆలోచనలు మన మెదుడులో మెదలడం వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల మెదడు మీదు ఎక్కువ ఒత్తిడి కలిగి హార్మోన్ల లోపంతో హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.

హార్ట్ డిసీజ్: సరైన నిద్రలేకపోవడం వల్ల హృదయ వ్యవస్థ మందగిస్తుంది. రక్తనాళాలు మరియు ధమనుల రక్తం సరిగా ప్రసరణ జరుగక గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.

English summary

13 Surprising Health Benefits of Sleep | మంచి నిద్రతో ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు బోలెడు..!

Sleep deprivation takes a toll on your mind, body, and overall health in ways that may surprise you.Sleep makes you feel better, but its importance goes way beyond just boosting your mood or banishing under-eye circles. Adequate sleep is a key part of a healthy lifestyle, and can benefit your heart, weight, mind, and more.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more