For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జింక్ లోపం వల్ల పురుషుల్లో ముఖ్య ప్రక్రియలు ఆగిపోతాయా?

|

జింక్ అనేది ఆరోగ్యాన్ని నిర్వహించడానికి ఒక క్రమ పద్ధతిలో ప్రజలకు అవసరమైన ఖనిజం. శరీరానికి ఎక్కువ పరిమాణంలో జింక్ అవసరం లేనప్పటికీ తగినంత మోతాదులో అవసరం ఉంటుంది. జింక్ తగినంత మోతాదులో లేకపోతె తీవ్రమైన మరియు చెడు ప్రభావాలు కలుగుతాయి. జుట్టు కోల్పోవడం,రుచి లేదా వాసన కోల్పోవడం,గాయాలకు స్వస్థత లేకుండుట వంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

జింక్ 300 ఎంజైమ్ ల నిర్మాణాలలో పాలుపంచుకుంటుంది. వందల కొద్దీ శరీర ప్రక్రియల సరైన పనితీరులో సహాయపడుతుంది. DNA ఉత్పత్తి చేసే కణాలను మరమత్తు చేయడానికి సహాయపడుతుంది. ఇది చాలా ఉపయోగకరమైన ఖనిజం. రాత్రి పూట నిద్ర బాగా పట్టటానికి సహాయపడుతుంది. ఉదయం పూట మంచి శక్తి స్థాయిలను మరియు బరువు కోల్పోయే ప్రక్రియను వేగవంతం చేయటం వంటి అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

జింక్ అనారోగ్యంతో పోరాడటానికి, అలాగే ఆరోగ్యకరమైన కణ పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడటం,రోగనిరోధక పనితీరు ప్రోత్సహించటం వంటి ఇతర ముఖ్యమైన విధులను కలిగి ఉంటుంది. జింక్ ముఖ్యంగా పురుషులకు అవసరం. ఎందుకంటే సాధారణంగా ప్రోస్టేట్ ఆరోగ్యం,టెస్టోస్టెరాన్ స్థాయిలు, లైంగిక ఆరోగ్య నిర్వహణ దాని పనితీరుకు అవసరం అవుతుంది. మీరు జింక్ ను ప్రతి రోజు తగినంత మోతాదులో సులభంగా పొందవచ్చు. ఎరుపు మాంసం,చిక్కుళ్ళు,పాల ఉత్పత్తులు చికెన్,సముద్రపు ఆహారం మరియు నట్స్ లలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు జింక్ యొక్క 20 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము.

కణాల విభజన

కణాల విభజన

గర్భధారణ సమయంలో పెరుగుతున్న పిండం కోసం కణాలను వేగంగా విభజించడం చాలా ముఖ్యం. మీ సాధారణ ఆహారంలోకి జింక్ చొప్పించడం ద్వారా పిండం అభివృద్ధి కణాల విభజన ఏ అవాంతరాలు లేకుండా సజావుగా సాగుతుంది.

.రోగనిరోధక వ్యవస్థ

.రోగనిరోధక వ్యవస్థ

జింక్ రోగనిరోధక వ్యవస్థ మీద బలమైన ప్రభావం చూపిస్తుంది. అంతేకాక ఇది చాలా ముఖ్యమైనదిగా నిరూపించబడింది. జింక్ T-కణాలలో ఒక విలక్షణమైన పాత్రను పోషిస్తుంది. తక్కువ జింక్ స్థాయిల కారణంగా T-కణాలు తగ్గటం మరియు బలహీనపడటం జరుగుతుంది. అసమర్థత మరియు అయోగ్యత ఫలితాలను గుర్తించమని చెప్పారు. కొన్ని అంటువ్యాధుల మీద పోరాటం జరుపుతుంది

ఆరోగ్యకరమైన గర్భం

ఆరోగ్యకరమైన గర్భం

జింక్ గర్భం ధరించిన సమయంలో పుట్టుకతో వచ్చే అసాధారణతలు మరియు ముందుగానే డెలివరీని తప్పించడం వంటి సమస్యలలో కీలక పాత్ర పోషిస్తోంది. జింక్ వనరులు కలిగిన ఆహారం తగినంత తీసుకోవడం అనేది అత్యధిక ప్రాముఖ్యత కలిగి ఉంది.

శారీరక అభివృద్ధి

శారీరక అభివృద్ధి

జింక్ అనేది శిశువులు,పిల్లలు మరియు టీనేజర్లలో ఎత్తు,బరువు మరియు ఎముక అభివృద్ధికి మరియు పెరుగుదలను ఆక్టివేట్ చెయ్యడానికి చాలా ముఖ్యమైనది.

రుతు సమస్యలు

రుతు సమస్యలు

మహిళలల్లో రుతు సమస్యల చికిత్సలో సహాయం మరియు బహిష్టుకు పూర్వ లక్షణాలు (PMS) నుంచి ఉపశమనం ద్వారా జింక్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

ప్రోస్టేట్ రక్షణ

ప్రోస్టేట్ రక్షణ

పురుషుల విషయంలో ఆహారంలో తగినంత జింక్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ నుండి ప్రోస్టేట్ గ్రంధి రక్షణలో సహాయపడుతుంది. దీనిని ప్రోస్తాతెస్ అంటారు. అంతేకాక పెద్దది అవ్వటం వలన ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అని కూడా పిలుస్తారు.

సంతాన సాఫల్యత నిర్వహించడానికి

సంతాన సాఫల్యత నిర్వహించడానికి

జింక్ పురుషుల విషయంలో ఆరోగ్యకరమైన వీర్యకణాల సంఖ్యకు భరోసా ఇవ్వటానికి మరియు సంతానోత్పత్తి నిర్వహించడంలో సహాయపడుతుంది.శరీరంలో జింక్ తగినంత మొత్తంలో ఉంటె వీర్యకణాల యొక్క కదలికను బాగుంటుంది. అలాగే సీరం టెస్టోస్టెరోన్ యొక్క సాధారణ స్థాయిలో ఉండేలా చేస్తుంది.

శరీరంలో ఇన్ఫెక్షన్

శరీరంలో ఇన్ఫెక్షన్

శరీరంలో జింక్ ఎక్కువ స్థాయిల్లో ఉంటె న్యుమోనియా,అతిసారం మరియు ఇతర అంటురోగాల మీద సమర్థవంతంగా పోరాటం చేస్తుందని నిరూపించబడింది. అంతేకాక జింక్ ఒక సాధారణ జలుబు యొక్క వ్యవధి మరియు తీవ్రత తగ్గించడంలో సహాయపడుతుంది.

రుచి మీద ప్రభావం చూపుతుంది

రుచి మీద ప్రభావం చూపుతుంది

శరీరం యొక్క ఆకలి మరియు రుచి ప్రాధాన్యతలు జింక్ చేత ప్రభావితం అవుతుంటాయి. ఈ ప్లాస్మాలో జింక్ స్థాయి కారణంగా మరియు రాగి మరియు మాంగనీస్ వంటి ఇతర పోషక విలువలపై జింక్ యొక్క ప్రభావం ఉంటుంది. జింక్ అనోరెక్సియా (ఆకలిలేకపోవడం) చికిత్సకు కూడా ఉపయోగించవచ్చు.

వాసన ప్రభావితం

వాసన ప్రభావితం

జింక్ లోపం ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. వివిధ వాసనలు ప్రాసెస్ చేసే సామర్ధ్యం మీద పడుతుంది. ఎందుకంటే జింక్ వాసన సెన్సార్లు అందుకున్న సమాచారం మరియు ప్రాసెస్ కొరకు మెదడును ప్రేరేపిస్తుంది.

గాయాల స్వస్థత

గాయాల స్వస్థత

జింక్ చర్మకణాలు పునరుద్ధరణ రేటు వేగవంతం చేయటంలో సహాయపడుతుంది. జింక్ క్రీములు పిల్లలలో డైపర్ వల్ల వచ్చే దద్దుర్లు ఉపశమనానికి మరియు గాయాలు నయం చేయటానికి ఎంతో ప్రయోజనకరమని నిరూపించబడ్డాయి.

మోటిమల చికిత్స

మోటిమల చికిత్స

జింక్ మోటిమలు చికిత్సలో చాలా సమర్థవంతంగా పని చేస్తుందని నిరూపించబడింది. ఇది యుక్తవయస్కులు మరియు కొన్ని సందర్భాల్లో పెద్దలలో కూడా ప్రభావితం చేసే ఒక సమస్యగా ఉందని చెప్పవచ్చు.

చర్మ ప్రయోజనాలు

చర్మ ప్రయోజనాలు

జింక్ యొక్క అదనపు ఆరోగ్య ప్రయోజనం చర్మంనకు ఉపయోగకరంగా ఉంటుంది. జింక్ ను రెగ్యులర్ గా వినియోగం చేస్తే సోరియాసిస్ మరియు న్యూరోదేర్మితిస్ వంటి వాటికీ సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది.

.హెయిర్ ఫాల్

.హెయిర్ ఫాల్

మీరు మీ సాధారణ ఆహారంలో భాగంగా జింక్ తగినంత స్థాయిలో తినకపోతే మీ జుట్టు నిస్తేజంగా అవుతుంది. అంతేకాక మెరుపు తగ్గుతుంది. జింక్ లోపం వలన మీరు జుట్టు తీవ్రంగా కోల్పోవటం అనేది అనుభవమునకు వస్తుంది.

చర్మం వాపు

చర్మం వాపు

జింక్ ఒక శోథ నిరోధక ఏజంట్ గా ఉపయోగించవచ్చని నిరూపితమైంది.ఇది చర్మం యొక్క కణజాలం ఉపశమనానికి సహాయపడుతుంది.

దృష్టి క్షీణత

దృష్టి క్షీణత

రెటీనా లో కు జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది వయస్సు సంబంధిత దృష్టి క్షీణత (AMD) మరియు అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయి. జింక్ తగ్గితే దృష్టి పాక్షిక లేదా పూర్తి నష్టాలు ఏర్పడతాయి.

గ్రే హెయిర్

గ్రే హెయిర్

మీ ఆహారంలో తగినంత జింక్ ఉంటె మీ జుట్టు మంచి రంగులో ఉంటుంది. మీరు జింక్ లోపంతో బాధపడుతూ ఉంటే కనుక మీ జుట్టు నెరిసిన(బూడిద రంగు) రంగులోకి మారుతుంది.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

తీవ్రమైన ఎండలో అతినీలలోహిత కిరణ ధాటికి చర్మము కందిపోవుట,బొబ్బలు మరియు చర్మం యొక్క ప్రభావిత ప్రాంతం ఉపశమనానికి,కొన్ని చిగుళ్ళ వ్యాధులకు జింక్ కలిగి ఉన్న పాయిజన్ ఐవీ వంటి చర్మం క్రీములు ఉపయోగపడతాయి.

చుండ్రు

చుండ్రు

జింక్ ఉన్న షాంపూ లను వాడుట వల్ల చుండ్రు నియంత్రణ మరియు నివారణలో సహాయపడుతుందని నిరూపితమైంది.

ఆరోగ్యకరమైన దృష్టి

ఆరోగ్యకరమైన దృష్టి

ప్రస్తుతం రెటీనా లో జింక్ విస్తారమైన మొత్తంలో ఉండుట వలన రేచీకటి వ్యక్తులను రక్షించడానికి సహాయపడుతుంది. అంతేకాక శుక్లాల అభివృద్ధిని నిరోధిస్తుంది.

English summary

20 Health Benefits Of Zinc

Zinc is an essential mineral that is required by people on a regular basis to maintain their health.
Desktop Bottom Promotion