For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆఫీసులో వెన్నునొప్పికి తక్షణ ఉపశనం ఇలా..!

|

మీరు వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లయితే, మీకు పని మీద దృష్టి నిలపటం చాలా కష్టంగా ఉంటుంది. నిర్మాణం, కర్మాగారంలో పని, నర్సింగ్ వంటి అనేక ఉద్యోగాల వలన మీ యొక్క వెన్నెముక మీద తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతున్నది. అలాగే, రోజువారీ ఆఫీసు పని కూడా ఈ వెన్ను నొప్పికి కారణమవుతున్నది. మనం ఈ వెన్ను నొప్పికి కారణాలేమిటో ఈ క్రింద వ్యాసంలో చర్చిద్దాం.

పని వొద్ద వెన్ను నొప్పికి కారణాలు
వెన్ను నొప్పికి కొన్ని కారణాలు:

Back Pain at Work

పునరావృతం

ఒకే పనిని పదేపదే చేయటంవలన కండరాలలో గాయం ఏర్పడవొచ్చు లేదా కండరాలు అలిసిపోవొచ్చు. ప్రత్యేకంగా, మీరు శరీరాన్ని, దాని పరిమితి దాటి కదిలించటం, వంగటం, సాగదీయటం లేదా మీ శరీరాన్ని ఇబ్బందికరమైన స్థానంలో ఉంచి పని చేయటం వంటివి మీ వెన్ను నొప్పికి కారణం కావొచ్చు.

బలవంతం

అధిక బరువైన వస్తువులను బలవంతంగా కదల్చటం లేదా ఎత్తటం కూడా మీ వెన్నెముకలో గాయానికి కారణం కావొచ్చు.

ఒత్తిడి

మీ వెన్నెముక మీద ఒత్తిడి పెరగటంవలన మీ కండరాలలో సంకోచ వ్యాకోచాలలో వ్యత్యాసమేర్పడి వెన్ను నొప్పికి కారణమవవొచ్చు. దీని ఫలితంగా మీ వెన్ను నొప్పి తీవ్రతరం కావొచ్చు.

సరైన భంగిమ

అధిక ఒత్తిడి వలన వెన్నుపూసలలో గాయం కావొచ్చు మరియు కండరాలకు అలసట కలగవొచ్చు.

పని వొద్ద వెన్ను నొప్పిని నివారించటానికి కొన్ని సూచనలు

పని వద్ద వెన్ను నొప్పి నివారించడానికి అనుసరించవలసిన కొన్ని సూచనలు:

మీరు వెన్ను నొప్పి నుండి బయటపడాలంటే మీరు కొన్ని శారీరక వ్యాయామాలని క్రమం తప్పకుండ చేయాలి. కనీసం 30 నిముషాలు చురుగ్గా నడవటం, స్విమ్మింగ్, జాగింగ్, బలంగా మరియు సాగదీసే వ్యాయామాలు వంటివి చేయాలి.

మీయొక్క శరీరాన్ని సరిఅయిన భంగిమలో ఉంచటం తప్పనిసరి. మీరు ఉద్యోగపరంగా గంటలకొద్దీ కూర్చుని వుండటం తప్పనిసరి అయినప్పుడు మధ్యమధ్యలో లేచి కొంత సమయం నడుస్తూ విరామం తీసుకుని, తిరిగి మీ పనిలో ఉపక్రమించటం మంచిది. మీరు కూర్చున్నప్పుడు శరీరాన్ని నిటారుగా ఉంచండి. ఒకవేళ మీరు ఉద్యోగపరంగా గంటలకొద్దీ నిలబడి ఉండవలసివొచ్చినట్లయితే, మీరు మధ్యమధ్యలో స్టూల్ లేదా రాయి పైనకాని కూర్చుని మీ పాదాలకు అలసట తగ్గించండి.

మీరు వొస్తువులను ఎత్తినప్పుడు, మీ శరీరాన్ని సరిఅయిన భంగిమలో ఉంచండి. మీరు బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు మీ శరీరం సమీపంలో పట్టుకోండి మరియు పట్టుకోవడం కోసం మీ మోకాళ్లను ఉపయోగించండి. మీరు బరువైనవాటిని ఎత్తినప్పుడు మీ శరీరభంగిమను సరిగా ఉంచండి.

అనవసరంగా మీ వెన్నును వంచటం, తిప్పటం మరియు అధిక బరువులు మోయటం వంటివి నివారించండి.

English summary

Back Pain at Work | ఆఫీసులో వెన్నునొప్పికి తక్షణ ఉపశనం ఇలా..!

It is very difficult to concentrate on your work if you are suffering from back pain. There are several jobs which tend to put intense pressure on your back like construction, factory work, nursing etc.
Story first published: Sunday, April 14, 2013, 12:49 [IST]
Desktop Bottom Promotion