Latest Updates
-
భార్య ఎల్లప్పుడూ భర్తకి ఎడమవైపునే ఎందుకు కూర్చుంటుందో తెలుసా.? -
మగవారికి షాకింగ్ న్యూస్.. మీ శరీరంలో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోవడం గమనిస్తున్నారా.? -
ఆలయాల్లో దేవతలను మేల్కొలిపే సుప్రభాతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం -
ప్రెగ్నెన్సీ సమయంలో యోగా, స్ట్రెచింగ్ చేయవచ్చా.?.. గర్భిణీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే.! -
రెస్టారెంట్ రుచితో కరకరలాడే షెజ్వాన్ చికెన్ లాలీపాప్.. మీ ఇంట్లోనే చేసేయండిలా.. -
పరగడుపున నానబెట్టిన మెంతులు తింటే.. ఈ 5 అద్భుత ప్రయోజనాలు మీ సొంతం! -
గుడ్డిగా నమ్మి మోసపోకండి.. రిలేషన్ షిప్స్ పై చాణక్యుడి 6 హెచ్చరికలు -
హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు.. ఉద్యోగులు ఏ నగరాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసా.! -
చికెన్, మటన్ కూడా దీని ముందు బలాదూర్.. స్పైసీ మష్రూమ్ చుక్కా రుచి చూశారా? -
ముఖం, జుట్టు జిడ్డుగా మారి ఇబ్బంది పెడుతుందా.. భారీ వర్షాల్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
వెన్నునొప్పి చికిత్సకు ముందు కారణాలు తెలుసుకోండి...!
సాధారణంగా మనుషులను ఎక్కువగా బాధించే అనారోగ్య సమస్యల్లో చాలా తరచుగా ఏర్పడే సమస్య వెన్నునొప్పి ఒకటి. ప్రతి మనిషి జీవిత కాలంలో ఏదో ఒక టైమ్ లో బ్యాక్ పెయిన్ కు గురైయ్యే ఉంటారు. దానికి ఎన్నో కారణాలు. కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవన శైలిలో నడుము నొప్పి లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలే ముఖ్య కారణం. ఒకప్పుడు వయసైపోయిన వారిలో కనిపించే బ్యాక్ పెయిన్, నేటి ఆధునిక యుగంలో యుక్త వస్కులను సైతం బాధింస్తుంది.
నడుము నొప్పి అనేది మహిళలకు మాత్రమే ప్రత్యేం కాదు. స్త్రీపురుషులందరికీ అది వచ్చేదే అయినా, మహిళలకు కొంచెం ఎక్కువగానే వస్తుంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మరీ అధికం. మగవాళ్ళకన్నా స్ర్తీలు సాధారణంగా శారీరకంగా తక్కువ శ్రమ ఉండే పనులు చేస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మాత్రం వెన్నుపూసమీద భారం అధికమౌతుంది. సాధారణ వ్యక్తుల్లో వెన్ను నొప్పి రావడానికి కారణాలేంటి? వాటికి తీసుకోవాలసిన జాగ్రత్తలేంటో చూద్దాం...
సాధారణంగా వచ్చే వెన్నునొప్పి ముఖ్యంగా వారు కూర్చొనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వెన్ను నొప్పికి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ముందు ముందు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరకంగా వెన్నునొప్పి, మెడనొప్పి ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి కూర్చొనే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు.

పాత నొప్పులు(ఎప్పుడైన తగిలిన గాయాల) వల్ల కలిగే నొప్పి: బ్యాక్ పెయిన్ లేదా మెడనొప్పి, ఇంకా శరీరంలో ఏదైనా గాయలవల్ల వచ్చే నొప్పి కలిగినప్పుడు, నొప్పి ఉన్నచోట అలాగే వత్తి పట్టుకొని ప్రస్తుతానికి ఉపశమనం పొందుతారు. అయితే అది కాస్తా అలవాటుగా మారి, అలాగే కూర్చువడం, లేదా నిలబడటం వల్ల భవిష్యత్తులో ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కండరాలు బలహీనంగా ఉండటం, కూర్చోటం, నిలబడటం వగరాలలో సరైన భంగిమలను పాటించకపోవడం వంటివి అని తెలస్తుంది.

పోషకాహారం: తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం. వెన్ను ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన ఆహారాన్ని ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ అధికంగా కలిగిన ఆహారాలను అధికంగా తీసుకోవాలి. క్యాల్షియం ఉన్న ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా ఉండి ఎటువంటి నొప్పిని కలుగజేయదు.

వంశపారంపర్యంగా: ఇంట్లో పెద్దవాళ్ళకు అమ్మ లేదా నాన్న తరపు వారికి ఇటువంటి వెన్ను నొప్పి సమస్య ఉంటే కనుక వంభపారం పర్యంగాను వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. అందుకు బ్యాక్ పెయిన్ నివారణ కోసం ప్రతి రోజూ వ్యాయామం, యోగా వంటివి బాగా ఉపయోగపడుతాయి.

అధిక బరువు: అధిక బరువువల్ల వెన్నునొప్పి వస్తే బరువు తగ్గే ప్రయత్నం చేయండి. మూడు నాలుగు కిలోల బరువు తగ్గినా ఆశ్చర్యకరమైన మార్పు వస్తుంది. స్థూల కాయం తగ్గించుకోవాలి. శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.

పొజిషన్: కండరాలు బలహీనంగా ఉండటం, కూర్చోటం, నిలబడటం వగరాలలో సరైన భంగిమలను పాటించకపోవడం వల్ల వెన్నునొప్పి వస్తుంది. పడక సరిగా కుదరనప్పుడు వెన్నునొప్పి వస్తుంది. కాబట్టి పడుకోవడం, కూర్చోవడం, నిలబడటం ఇలా ఏ పని చేసిన సరైన భంగిమ అవసరం.

వర్క్ స్టేషన్(పని స్థలంలో): పని టెన్షన్ వల్ల నడుం కండరాలు సంకోచిస్తాయి. రక్త సరఫరా తగ్గవచ్చు. వీటన్నింటి వల్ల నడుం నొప్పి వస్తుంది. ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.

జీవన శైలీ మరియు ఫ్యాషన్: ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది. జీవన పంథాను మార్చుకొని మానసికోల్లాసమైన పనులు చేయండిధూమ పానానికి దూరంగా ఉండండి.



Click it and Unblock the Notifications