For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒత్తిడి(స్ట్రెస్)తగ్గించుకోవడానికి 10 ఉత్తమ యోగాసనాలు

|

జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురైన వారే. ముఖ్యంగా ప్రస్తుత మోడ్రన్ మరియు బీజీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ జీవితం మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నది. జీవితంలో వివిధ కారణాల వల్ల మనం తరచూ ఒత్తిడికి గురి అవుతూ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాము . ప్రస్తుత రోజుల్లో ఒత్తిడికి గురైన వారు ప్రశాతంగా నిద్రపోలేకపోతున్నారు. ఏదో ఆందోళన, భయం, డిప్రెషన్ వల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావాలు చూపుతున్నాయి. మరి ఈ ఒత్తిడి తగ్గించుకొనేందుకు ఒక ఉత్తమ మార్గం ఉన్నది. అదే యోగా. రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల ప్రశాతమైన నిద్రను పొందవచ్చు . యోగా వల్ల శరీరంలోని అవయావాలు విశ్రాంతిపొంది, జీవితం మరింత బెటర్ గా ముందుకు నడవడానికి సహాయపడుతుంది.

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆందోళ మరియు స్ట్రెస్ రెండూ ఏదో ఒక సందర్భంలో కలిగి ఉంటారు. అయితే, ఈ రెండు లక్షణాలను దీర్ఘకాలం పాటు అలాగే ఉంచుకోకుండా, ఏమాత్రం స్ట్రెస్ యొక్క లక్షణాలను కనిపించినా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎప్పడైతే అధిక ఒత్తిడికి గురైతే, కార్టిసోల్ అనే హార్మోన్ రక్తకణాల్లో విడుదల అవుతుంది. ఈ హార్మోన్ మీ శరీరాన్ని మరింత నాశనం చేస్తుంది. జీవక్రియల ప్రక్రియను తగ్గిస్తుంది మరియు రక్తపోటు పెరిగి గుండె మీద ఒత్తిడి పెంచుతుంది. ఈ హార్మోన్ యొక్క ప్రభావం నుండి బయటపడాలంటే ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలి. అందుకు యోగా అద్భుతంగా సహాయపడుతుంది.

యోగా, వ్యాయామం కంటే మరింత బెటర్ గా ఉంది. యోగ వల్ల శరీరంలోని ప్రతి ఒక్క అవయవానికి కదలిక కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క అవయవం, కండరాలు కదలిక వల్ల జీవక్రియలు చురుకుగా పనిచేయడం మాత్రమే కాదు, ఒత్తిడి కూడా చాలా ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది. మనస్సు ప్రశాంతపరుస్తుంది . కాబట్టి, ఒత్తిడిని చాలా తక్కువగా అంచనా వేయకుండా వెంటనే యోగా ప్రాక్టిస్ చేస్తూ మీలో ఉన్న ఒత్తిడిని పారద్రోలండి...

స్ట్రెస్ రిలీఫ్ కోసం యోగ:

సుఖాసన:

సుఖాసన:

ఒత్తిడి తగ్గించుకోవడంలో ఇది ఒక సలుభమైనటువంటి యోగాసనం. పద్మాసనంలో కూర్చొని, తర్వాత కాళ్ళను రెండింటిని ఫోటోలో చూపిన విధంగా పైకి మడవాలి. తర్వాత మనస్సును ప్రశాంత పరుచుకోవాలి. శ్వాసనెమ్మదిగా పీల్చి వదలడం వల్ల మనస్సు ప్రశాంతపడుతుంది. అంతే కాదు, వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది.

ప్రాణాయామం:

ప్రాణాయామం:

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమం టే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, నిశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అం టారు. శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబ ద్ధ్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూ డా అదుపులో ఉంచవచ్చు. నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటిలో ప్రాణం సంచరిస్తూ ఉంటుంది. ప్రాణాయామం వల్ల వాట న్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణా యామేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌'' అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరో గాలు హరించిపోతాయి అనే సూత్రం ప్రచారం అయింది.

బాలాసన (బాలల ఆసనం) :

బాలాసన (బాలల ఆసనం) :

పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది నడుము, తొడలు, చీలమండలం లను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది. ఈ బాల భంగిమ బాధను నివారించి, నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.

గరుడాసనం:

గరుడాసనం:

గ్రద్ద ఎలా నిలబడుతుందో అలా నిలబడటం అన్నమాట. గరుడాసనం వల్ల ఇన్నర్ బ్యాలెన్స్ వల్ల శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది మరియు ఏకాగ్రత పెరుగుతుంది . మీ భావోద్రేకాలన్నీ కూడా ఈ గరుడాసనంతో నివారించుకోవచ్చు.

మార్జారి ఆసనం (పిల్లిలాగా సాగడం) :

మార్జారి ఆసనం (పిల్లిలాగా సాగడం) :

పిల్లిలాగా సాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, మెదడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా, ఒత్తిడిని నివారించి, మంచి శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆసనానికి మంచి భాగం కండరాలు, ఇది నొప్పిని పోగొట్టుకోవడానికి ప్రభావిత మార్గమైన కండరాల ఒత్తిడిని పోగొట్టడానికి సహాయపడుతుంది.

బిటిలాసన:

బిటిలాసన:

కౌఫోజ్ (ఆవులా నిలబడం)ఎప్పుడూ పిల్లి నిలబడే భంగిమలాగే ఉంటుంది. ఒత్తిడి తగ్గించడంలో ఈ రెండు భంగిమలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా మీ వెన్నెముకకు మంచి వ్యాయామం వంటిది . మీ మనస్సును ప్రశాతం పరిచి, ఒత్తిడి లేకుండా ఫ్రీ మైండ్ చేస్తుంది.

ఉత్తన శిషోషన:

ఉత్తన శిషోషన:

పప్పీ భంగిమన చిన్న పిల్లల భంగిమను తలపిస్తుంది . మీరు అధిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ భంగిమ ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. మరియు నరాలు సడలింపబడుతాయి. బ్రెయిన్ కు రక్త ప్రసరణ పెంచుతుంది.

సిరసాసన:

సిరసాసన:

తలక్రిందులుగా నిలబడటం. ఈ యోగ భంగిమన నిజంగా మీరు రిలాక్స్ అవ్వడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ ఆసనం చేయడం అంత సులభమైన పని కాదు. అయితే, ఈ ఆసనం నుంది చాలా త్వరగా ఒత్తిడి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆసనం వల్ల తలకు రక్త ప్రసరణ పెరుగుతుంది.

సేతుబంధాసన (వంతెన భంగిమ) :

సేతుబంధాసన (వంతెన భంగిమ) :

ఈ ఆసనం మీ రక్తపోటు ను నియంత్రించి, మెదడుకు విశ్రాంతిని, ప్రశాంతతను ఇచ్చి ఆతృతను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ ఆసనం చేసేటపుడు రక్తం మెదడుకు సరఫరా అయి నొప్పి నివారణకు సహాయపడుతుంది. మెడ మరియు మెడయొక్క కండరాలు మరియు వీపు యొక్క కండరాలు ఫ్రీగా సడిలింపబడి, ఒత్తిడిని తగ్గిస్తుంది . ఇలా బ్రిడ్జిఫోజ్ లో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు .వెన్నునొప్పిని కూడా చాలా సులభంగా తగ్గిస్తుంది .నిటారుగా పడుకొని, కాళ్ళ పాదాల సహాయంతోనే వెన్నెముకను పైకి లేపాలి.

శవాసనం:

శవాసనం:

డిప్రెషన్‌ను ఎదుర్కోవాలంటే శవాసనం ఉత్తమాసనం. శవాసనం వల్ల శరీరంలె రక్త ప్రసరణ పెరుగౌతుంది. తరువాత రక్తప్రసరణ స్థాయి సాధారణ స్థాయికి చేరుకుంటుంది.కణాలు పని తీరు మెరుగు పడుతుంది. శవాసనం: అవయవాలన్నింటిని వదులు చేసి, వెల్లకిల పడుకుని, అరచేతులు రెండిటిని ఆకాశం వంక ఉంచి, చాచిన కాళ్ల పాదాలు రెండిటిని కొంచెం దూరంగా ఉంచి వేసే ఆసనం శవాసం. ఈ ఆసనం వల్ల శరీర అవయవాలన్నింటికీ విశ్రాంతి లభిస్తుంది. అలసట పోతుంది. టెన్షన్‌ తగ్గుతుంది.

English summary

10 Yoga Poses For Stress Relief

Yoga is much more than just exercise. It works on your body at the spiritual level. That is why yoga poses for anxiety and stress management can help to calm your mind. It is an exercise for your soul. Do not underestimate the effects of stress on your body.
Story first published: Tuesday, June 24, 2014, 17:01 [IST]
Desktop Bottom Promotion