For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెసిస్టెన్స్ బిల్డింగ్ ఫుడ్స్ : వింటర్ స్సెషల్ హెల్తీ ఫుడ్స్

|

మనం తీసుకొనే ఆహారం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందా? అనే ఆలోచనలో పడేస్తాయి. అందుకే మనం మనకోసం మరియు కుటుంంబంతో కోసం ఎంపిక చేసుకొనే ఆహారం ఆరోగ్యకరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాము. ఈ వర్షకాలంలో మన శరీరం చాలా త్వరగా జబ్బుల భారిన పడుతుంటుంది . అందుకే మన శరీరానికి జబ్బులను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండాలి . అలా స్ట్రాంగ్ గా ఉండాలంటే శక్తి వంతమైన ఆహారాలను ఎంపిక చేసుకోవాలి.

రెస్టిస్టెన్స్ బిల్డింగ్ ఫుడ్స్ ను ఏవిధంగా ఎంపిక చేసుకోవాలనేది ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ఈ క్రింది లిస్ట్ లో ఇవ్వబడ్డ రెస్టిస్టెన్స్ బిల్డింగ్ ఫుడ్స్ ను మన రెగ్యులర్ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

READ MORE: వింటర్లో రోగనిరోధకతను పంచే 15సూపర్ వెజిటేబుల్స్

వాతావరణంలో వచ్చే అకస్మిక మార్పులు వలే మన శరీరంలో కూడా అకస్మిక జబ్బులు వస్తుంటాయి. కనుక వర్షాకాలంలో ఇలాంటి వివిధ రకాల వైరస్ నుండి వివిధ రకాలజబ్బుల నుండి మన శరీరంను కాపాడుకోవడానికి తగినంత శక్తిని కలిగి ఉండాలి. అలా ఉండాలి అంటే స్ట్రాంగ్ అండ్ హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తినాలి. అప్పడే శరీరంలో ఇమ్యూనిటి పెరుగుతుంది. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

ఆమ్లా:

ఆమ్లా:

ఇది పురాతన కాలం నుండి ఒక ఔషధ ఆహారంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇది వ్యాధినిరోధకత పెంచడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .

గుడ్డు:

గుడ్డు:

గుడ్డు ప్రతి రోజూ తినడం వల్ల వ్యాధినిరోధకత పెంచడంతో పాటు వివిధ రకాల వైరస్ తో పోరాడే శక్తిని పొందవచ్చు. అంతే కాదు వీటిలో ఉండే ప్రోటీన్స్ మరియు విటమిన్ బి, కార్బోహైడ్రేట్స్ మరియు ఫ్యాట్స్ వ్యాధినిరోధకత పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

పెరుగు:

పెరుగు:

పెరుగులో ల్యాక్టో బాసిల్లస్ అనే హెల్తీ బ్యాక్టిరీయాను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . మరియు కాంప్లెక్స్ కార్బో కాంపౌండ్స్ ను విచ్ఛిన్న చేస్తుంది. దాంతో సాధారణంగా వచ్చే డయోరియాను వంటి వ్యాధిలను నిరోధిస్తుంది.

క్యాబేజ్:

క్యాబేజ్:

క్యాబేజ్ లో మేలైన యాంటీక్యాన్సర్ లక్షణాలున్నాయి. ముఖ్యంగా అతి ముఖ్యమైన న్యూట్రీషియంట్స్ విటమిన్ సి, విటమిన్ ఎ, జింక్ మిరయు మెగ్నీషియం పుష్కలంగా ఉండి ఇవి ఆందోళన మరియు డిప్రెషన్ తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:

వర్షాలకాంలో మీ శరీరానికి కావల్సిన అనేక విటమిన్స్, మినిరల్స్ మరియు యాంటీయాక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉండి. వ్యాధినిరోధకతను పెంపొంధించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

బాదం:

బాదం:

విటమిన్ E లేకపోవడం వలన అంటువ్యాధుల మీద పోరాడటానికి రోగనిరోధక వ్యవస్థ యొక్క సామర్ధ్యం మీద ప్రభావం చూపవచ్చు. అందువలన విటమిన్ ఇ సమృద్ధిగా ఉన్న బాదంను నమలండి. మీ రోగనిరోధక వ్యవస్థ మృదువుగా ఉండేలా చేస్తుంది.

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

ఈ స్పైసీ ఫుడ్ మీ వంటకు మంచి సువాసన జోడించడం మాత్రమే కాదు, జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఉన్నాయి. వెల్లుల్లి, వ్యాధినిరోధకతను ఎదుక్కోవడానికి బ్లెడ్ సెల్స్ ను పెంచుతుంది.వీటిలో అలిసిన్, అజోయేన్ మరియు థయోసల్ఫేట్ వంటి అంశాలు అనేక ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్ లను చంపేస్తుంది. Hide

 అల్లం:

అల్లం:

జలుబు మరియు దగ్గు నివారించడానికి అల్లం ఒక ఉత్తమ రెమడీ. వింటర్ సీజన్ లో మీరు తయారుచేసే వంటకాల్లో కొద్దిగా అల్లం చేర్చడం వల్ల మీలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

 వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి హెర్బల్ టీ

వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి హెర్బల్ టీ

వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి హెర్బల్ టీ బాగా సహాయపడుతుంది. హానికర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి వేడి ఒక కప్పు హెర్బల్ టీ త్రాగమని అనేక పరిశోధనలు తెలుపు తున్నాయి.

జామపండ్లు, నారింజ మరియు నిమ్మ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలు

జామపండ్లు, నారింజ మరియు నిమ్మ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలు

జామపండ్లు, నారింజ మరియు నిమ్మ వంటి విటమిన్ సి సమృద్ధిగా ఉన్న ఆహారాలు ఇవి సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అంటువ్యాధులు వేగంగా స్పందించకుండా తన విధులను నిర్వహించడానికి తెల్ల రక్త కణాలకు విటమిన్ సి సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపర్చే చర్యగా ఉంటుంది. జామపండ్లలో అధిక కొలెస్ట్రాల్ మరియు గుండె జబ్బులకు వ్యతిరేకంగా ఒక రక్షణ పాత్రను పోషించే ఫైబర్ సమృద్దిగా ఉంటుంది.

English summary

10 Best Resistance Building Foods: Health Tips in telugu

10 Best Resistance Building Foods, The word "Food" makes one think that it should be healthy. We choose the best food for the health of us and our loved ones. As this is the monsoon season our body needs to be real strong. To be very strong we need to select some best resistance building foods.
Story first published: Tuesday, August 18, 2015, 18:12 [IST]
Desktop Bottom Promotion