For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన రెగ్యులర్ వంటకాల్లో పుదీనాను ఎందుకు చేర్చుకోవాలి

|

మన నిత్య జీవితంలో పుదీనాను తెలిసి లేదా తెలియక ఉపయోగిస్తుంటాం. పుదీనా అంటే మన అందరికీ సుపరిచితమే. మన పరిసరాలలో దొరికే ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. ప్రత్యేకమైన సువాసన... మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకు సొంతం. గ్రీన్ చట్ని తయారీలో, బిర్యానిలో తప్ప దీనికి మరేం ప్రయోజనాలుంటాయి అనుకోవచ్చు. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలూ పుష్కలమే! చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్‌) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్‌ ఉంది. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.

పుదీనా ఆకుల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచే విన్తమిన్ ఎ, విటమిన్ సి గుణాలు అధికం. ఉదయాన్నే కప్ఫుడు పుదీనా తీని తాగితే దాని నించి శరీర పనితీరుకి అవసరం అయిన రాగి, పీచు, కాలుష్యంతో పాటు మాంగనీసు, పొటాషియం కూడా అందుతాయి. గర్భిణులకు అవసరం అయిన ఫోలికామ్లం, ఒమేగా త్రీలు కావాల్సినంత. చాపకింద నీరులా, శరీరంలో మనకు తెలియకుండా పెరిగే కణుతుల పెరుగుదల కు అడ్డుకట్ట వేయాలంటే రోజువారీ ఆహారంలో ఆకులని గ్రీన్ చట్ని రూపంలో కానీ, టీగా కానీ తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. పుదీనా ఆకుల నుండి ఆరోగ్యానికి కలిగే మరికొన్ని ఉత్తమ ప్రయోజనాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం..

వికారం

వికారం

వికారంగా ఉన్నప్పుడు కొన్ని పుదీనా ఆకులను వాసన చూస్తే వికారంను నివారించవచ్చు. ఇంట్లో పుదీనా ఆయిల్ ఉంటే, దీన్ని వికారానికి ఒక హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు.

బరువు తగ్గడం కోసం

బరువు తగ్గడం కోసం

బరువు తగ్గించుకోవడంలో పుదీనా చాలా ముఖ్య పాత్రను తగ్గిస్తుంది. ఇది డైజస్టివ్ సిస్టమ్ ను క్రమబద్దం చేస్తుంది. మీ శరీరం ఎక్కువ న్యూట్రీషియన్స్ ను గ్రహించడానికి సహాయపడుతుంది . ఎప్పుడైతే మీ శరీరంలో చాలా ఎఫెక్టివ్ గా కొవ్వు కరగడం ప్రారంభం అవుతుందో అప్పుడు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.

జీర్ణ సమస్యలను నివారిస్తుంది

జీర్ణ సమస్యలను నివారిస్తుంది

రెగ్యులర్ డైట్ లో పొదీనా తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి వేగవంతం చేస్తుంది. రెండు స్పూనుల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. మీరు కొన్ని రకాల జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లైతే , అందుకు పుదీనాను ఒక ఉత్తమ హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు.

ఊపిరితిత్తులు

ఊపిరితిత్తులు

పుదీనా మీ కాలేయంను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది .పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. మెంతాల్ డీకంజెస్టాంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు. నాసల్ పాసేజ్ ఫ్రీ అవుతుంది

ఓరల్ హెల్త్

ఓరల్ హెల్త్

పుదీనా నోటి సమస్యలకు చాలా మంచిది. ప్రతిరోజు పుదీనా ఆకుల్ని నమిలి తినడం వలన నోటి దుర్వాసన తగ్గిపోవడంతో పాటు, పిప్పిపళ్ళు, చిగుళ్ళ నుండి చీము కారడం తగ్గుతాయి. అందువల్ల పుదీనాను మౌత్ ఫ్రెష్నర్స్ మరియు టూత్ పేస్ట్ లలో విరివిగా ఉపయోగిస్తున్నారు. పుదీనా వల్ల ఇది ఒక ప్రధానమైన హెల్త్ బెనిఫిట్.

క్యాన్సర్

క్యాన్సర్

కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలను నివారించడంలో పుదీనా గ్రేట్ గా సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. అందువల్ల పుదీనాను రెగ్యులర్ గా ఉపయోగించడం మంచిది.

మెమరీ

మెమరీ

పుదీనా మెదడును చురుకుదనం మరియు ఇతర ఇతర అభిజ్ఞ క్రియలు తోడ్పడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చూయింగ్ గమ్ నమిలితే అందులో ఉండే పుదీనా ఎక్సట్రాక్ట్(పుదీనా రసం) వల్ల మెదడు మరింత యాక్టివ్ గా మరియు అలర్ట్స్ గా ఉంటుంది.

మొటిమలు

మొటిమలు

చర్మం శుభ్రపరచడంలో పుదీనా గ్రేట్ గా సహాయపడుతుంది. పుదీనా ఆకులు మెత్తగా పేస్ట్ చేసి ముఖానికి పట్టించడం ద్వారా కొన్ని చర్మం యొక్క ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది . మొటిమలతో మీరు బాధపడుతున్నట్లైతే దీన్ని మీరు ఒక హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు .

అలర్జీలు

అలర్జీలు

చాలా వరకూ మనలో కొన్ని రకాల సీజనల్ అలర్జీలతో బాధపడుతుంటాము . పుదీనా రసం కొన్ని రకాల అలర్జీలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు రోస్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది . ఈ అసిడ్స్ సీజనల్ గా వచ్చే అలర్జీలను నివారిస్తుంది.

డిప్రెషన్

డిప్రెషన్

డిప్రెషన్ తగ్గించడంలో పుదీనా ఒక ఉత్తమ హోం రెమెడీ. పుదీనాలో ఉండే ఆరోమా వాసన మనస్సును ఉత్తేజపరుస్తుంది మరియు ఇది చాలా యాక్టివ్ గా ఉంటుంది . ఇది డిప్రెసివ్ ఫీలింగ్స్ ను తగ్గిస్తుంది. పుదీనా వల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

English summary

10 Health Benefits Of Mint

Most of us use mint in our daily lives knowingly or unknowingly. It is present in the chewing gums we chew and the tooth paste we use daily in the morning. But are you aware of the benefits of mint? Well, some of us know it only as a mouth freshener but its benefits don't stop there. There are so many other benefits and let us discuss about them in this article.
Story first published: Friday, February 6, 2015, 18:07 [IST]
Desktop Bottom Promotion