For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కోడిగుడ్డుతో.. కొలెస్ర్టాల్ ఖతం

By Nutheti
|

అన్ని వయసుల వాళ్లకు ఎగ్స్ న్యూట్రీషన్ ఫుడ్. కానీ.. కొలెస్ర్టాల్ ఎక్కువగా ఉంటుందన్న భావనతో.. కోడిగుడ్లపై చెడు అభిప్రాయం ఉంది. ఎగ్స్ కొలెస్ర్టాల్ స్థాయి పెంచుతాయని చాలామంది ఫీలవుతారు.. కానీ అది అపోహ మాత్రమే. కోడిగుడ్లలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. అవి చెడు కొలెస్ర్టాల్ ని శరీరం నుంచి తొలగిస్తాయి. అలాగే గుడ్లు గుండెకు కూడా మంచిది.

బ్లడ్ ప్రెజర్ ని సాధారణ స్థాయికి తీసుకొస్తాయి.. హార్ట్ అటాక్ ని అరికడతాయి. హార్ట్ ఎటాక్ కి కారణమయ్యే కొలెస్ర్టాల్ ని తగ్గించడానికి ఎగ్స్ బాగా సహాయపడతాయి. కాబట్టి కొలెస్ర్టాల్ తగ్గించుకోవాలి అనుకునే వాళ్లు ఎగ్స్ తీసుకోవడం మంచిది. ఇవి బరువు పెరగడానికి కూడా ఏమాత్రం కారణమం కావు.. అలాగే బరువు తగ్గడానికి కూడా తోడ్పడతాయి. బ్రేక్ ఫాస్ట్ తో పాటు కోడిగుడ్లు తిని చూడండి.. ఖచ్చితంగా బరువు తగ్గుతారు. ఎగ్స్ తినడం వల్ల శరీరంలో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయో మీరే చూడండి..

హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది

హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గుతుంది

శరీరంలో ఉండే చెడు ఫ్యాట్స్ హైబ్లడ్ ప్రెజర్ కి కారణమవుతాయి.. దీనివల్ల హార్ట్ ఎటాక్ కి ప్రమాదం ఉంది. ఎగ్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే మంచి ఫ్యాట్స్ శరీరంలో ఉండే చెడు ఫ్యాట్స్ తో పోరాడతాయి. ఎగ్స్ లో మంచి ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

ఎగ్స్ తో పొందే మరో అద్భుతమైన ప్రయోజనం బరువు తగ్గడం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు కోడిగుడ్డు తీసుకోవడం వల్ల రోజంతా అన్ హెల్తీ ఫుడ్ తీసుకోకుండా అరికడుతుంది. అలాగే ఎగ్స్ మెటబాలిజంను పెంచుతూ.. ఫ్యాట్ కరగడానికి సహకరిస్తాయి.

ఇమ్యూనిటి

ఇమ్యూనిటి

కోడిగుడ్లు తినడం వల్ల మీ వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడి.. ఎలాంటి వ్యాధులు సోకకుండా కాపాడుతుంది. ఒక కోడిగుడ్డులో 22 శాతం సెలీనియం ఉంటుంది. ఇది వ్యాధినిరోధక వ్యవస్థకు శక్తినిచ్చి.. థైరాయిడ్ హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది.

జుట్టు, ముడతల సమస్యకు

జుట్టు, ముడతల సమస్యకు

కోడిగుడ్లు తీసుకోవడం వల్ల అవి ప్రొటీన్స్ అందించి జుట్టుకి, చర్మానికి మంచి చేస్తాయి. చర్మం యంగ్ గా కనిపించడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఎగ్స్ సహకరిస్తాయి. జట్టు రాలడాన్ని తగ్గించుకోవాలి అంటే.. కోడిగుడ్లు తీసుకోండి.

సంతోషంగా ఉండటానికి

సంతోషంగా ఉండటానికి

విటమిన్ బి లోపం వల్ల ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది. విటమిన్ బి కోడిగుడ్ల ద్వారా పుష్కలంగా అందుతుంది. కాబట్టి రెగ్యులర్ డైట్ లో కోడిగుడ్లు చేర్చుకుంటే.. మీ బ్రెయిన్ యాక్టివ్ గా, హ్యాపీగా ఉంటుంది.

బ్రెయిన్

బ్రెయిన్

బ్రెయిన్ ని స్ర్టాంగ్ గా చేసే పోషకాలు ఎగ్స్ ఉంటాయి. బ్రెయిన్ కి అవసరమైన కోలైన్ తగ్గితే.. మెంటల్ కాన్సంట్రేషన్, న్యూరోలాజికల్ డిసీజెస్ కి కారణమవుతాయి. ఎగ్స్ ద్వారా కోలైన్ లభిస్తుంది. కాబట్టి.. వీటిని తీసుకోవడం వల్ల గుండెతోపాటు, బ్రెయిన్ ఆరోగ్యం కూడా బావుటుంది.

యాక్టివ్ గా

యాక్టివ్ గా

కోడిగుడ్లలో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అవసరం. ఈ అమినో యాసిడ్స్ తగ్గినప్పుడు వీక్ నెస్, మజిల్ వీక్ నెస్, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి అమినో యాసిడ్స్ ఈజీగా దొరికే ఎగ్స్ ని తీసుకుంటే.. వీక్ నెస్ మీ దరిచేరకుండా.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండవచ్చు.

English summary

7 Golden Health Benefits of Eggs: 7 Things That Happen To Your Body When You Eat Eggs

Eggs are a complete nutrition for all age groups. However, eggs have been tagged as bad mostly because of cholesterol. Most people believe that eggs increase the cholesterol level, which is not true.
Story first published: Saturday, December 19, 2015, 15:24 [IST]
Desktop Bottom Promotion